మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఉండే 4 దశలు ఏంటి ?

0
365

మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు 4 దశలుగా వివరించారు. అవేంటో చూద్దాం. బ్రహ్మచర్యం, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేవి నాలుగు ఆశ్రమాలు. బ్రాహ్మణ, క్షత్రియులకు బ్రహ్మచర్యం, గార్హస్థ్య, వానప్రస్థములు మూడు సమానంగా వుంటాయి. సన్యాసం తప్ప మిగిలిన మూడు శూద్రులు కూడా ఆచరించవచ్చు.

బ్రహ్మచర్యం :

బ్రహ్మచర్యంగురుకులవాసం చేసి ఏ ఇతర ఆలోచనలు లేకుండా విద్యాభ్యాసం చేయడం, నియమనిబంధనలతో వుంటూ వాటిని పాటించడం వంటివి బ్రహ్మచర్యంలో జరుగుతుంది.

గార్హస్థ్యము :

గార్హస్థ్యమువిద్యాభ్యాసం పూర్తయిన తరువాత తనకు నచ్చిన కన్యతో వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం వంటివి ఐదు మహాయజ్ఞాలను ఆచరిస్తూ వారిని సంతోషపరచాలి. ఇంటికి వచ్చిన అతిథులను, బంధవులను ఆదరించి, సంతోషపరచాలి. గోసేవ చేయాలి. స్నానసంధ్యావందనాలు, అగ్నిహోత్రాలు, పితృతర్పణాలను నిత్య కర్మలుగా చేస్తూ వుండాలి. పుత్రుడు, పుత్రికలకు విద్యాభ్యాసం చేయించి.. వారికి వివాహాలు జరిపించాలి.

వారప్రస్థము :

Rahasyavaaniఇంట్లో వున్న బాధ్యతలన్నీ తన కొడుకుకు అప్పగించి, ఇతర చింతనలు పెట్టుకోకుండా కేవలం దేవుని ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా వుండటమే ఈ ఆశ్రమంలో చేయాల్సిన పని.

సన్యాసం :

సన్యాసంఇంద్రియనిగ్రహాలు కలిగిన ప్రాపంచిక భోగాలకు వికర్తుడై.. కేవలం భగవంతునిలో చేరడానికి సాధన చేయడం సన్యాసి కర్తవ్యం. ఇంట్లో ఒక్కరోజు కూడా వుండకుండా ప్రతిరోజూ భిక్షాటన చేస్తుండాలి. అహంకారం గల సన్యాసి బ్రహ్మపదాన్ని చేరుకోలేడు.

 

SHARE