Home Health చలికాలంలో గుడ్డు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి

చలికాలంలో గుడ్డు తినడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి

0

ప్రోటీన్ అందించే ఆహార పదార్థాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పాలు, గుడ్డు. రోజూ ఓ గ్లాస్ పాలు, ఒక గుడ్డు తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయని చెబుతారు నిపుణులు. అందుకే చిన్నపిల్లలకు ఇచ్చే ఆహరంలో పాలు, గుడ్డు ఉండేలా చూస్తారు. మరి చలికాలంలో గుడ్డు తినొచ్చా, దాని వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Eggsఇక చ‌లికాలంలో గుడ్డు ఎక్కువ‌గా తీసుకోవడం శరీరానికి మంచిది. శీతాకాలం రోజుకి ఓ ఉడ‌క‌బెట్టిన గుడ్డు తీసుకుంటే శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. దీని వ‌ల్ల రోజుకి ఏడు గ్రాముల ప్రొటీన్ ల‌భ్యం అవుతుంది. గుడ్డు తింటే శరీరానికి అవ‌స‌రం అయిన యాంటీబాడీలు త‌యారు అవుతాయి.

గుడ్డులోని జింక్‌ చలికాలంలో ఎక్కువగా వేధించే జలుబును నివారిస్తుంది. ఇక రోజుకి ఓ గుడ్డు తింటే విట‌మిన్ డీ లోపం ఉండ‌దు. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే రోజుకి ఒక గుడ్డు తింటేనే మంచిది. అలా కాకుండా రెండు మూడు తింటే మాత్రం ఊబ‌కాయం కొవ్వు స‌మ‌స్య ఎక్కువవుతుంది.

Exit mobile version