గురువారం ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

0
718

ఉపవాసం అంటే చాలా అపోహలు ఉంటాయి. నిజానికి ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు. దేవుడికి దగ్గరగా ఉండటం. అంటే ధ్యాస భగవంతుడు మీద పెట్టి ఆ రోజు ఆయనకు కేటాయించడం. ఉపవాసం ప్రజలకు ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాలను చేకూరుస్తుంది. అంతేకాదు భగవంతుడి ఆశీర్వాదాలు పొందడానికి అవకాశాన్ని ఇస్తుంది.

గురువారం ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయిఅయితే ఉపవాసం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో నమ్మకం. కొందరు సోమవారం ఉపవాసం ఉంటారు. ఇంకొందరు శుక్రవారం ఉపవాసం ఉంటారు. మరి కొందరు గురువారం ఉపవాసం ఉంటారు. అయితే.. గురువారం ఎందుకు ఉపవాసం చేయాలి? గురువారం ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గురు లేదా బృహస్పతి రోజుగా గురవారాన్ని పాటిస్తారు. హిందూ పవిత్ర గ్రంథాల ప్రకారం బృహస్పతి శివుడు గొప్ప భక్తుడు. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు గురువారం ఉపవాసాలు పాటిస్తారు. అలాగే గురువారం పూట లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. గురువారం పూట ఒంటి పూట ఆహారం తీసుకుని లేదా పండ్లు, పాలు, నీరు మాత్రమే సేవించి పూజిస్తే ఈతిబాధలంటూ వుండవు. ఈ విధానం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలేమైనా ఉంటే అవి తొలగుతాయి. గురువారం ఉపవాసం చేయడం వల్ల వ్యక్తి ఆరోగ్యం, ఆర్థిక స్ధితి మెరుగవుతుంది.

గురువారం ఉపవాసంఈ ఉపవాసాన్ని ఏ నెలలోనైనా అందులో ఏ గురువారం నుంచైన ప్రారంభించవచ్చు. కానీ పుష్యమాసం నుంచి మాత్రం మొదలుపెట్టకూడదు. అయితే మీరు ఏ నెల నుంచి ఉపవాసం ప్రారభించినా శుక్ల పక్షంలోని మొదటి గురువారం నుంచి మొదలు పెడితే ఎంతో మంచిది. ఈ ఉపవాసం 16 గురవారాలు పాటు చేయాలి. మూడు సంవత్సరాల వరకు కూడా పాటించవచ్చు.

బృహస్పతిగురువారం ఉపవాసం చేసేవారు పసుపు రంగు పుష్పాలు, పసుపు రంగు ధాన్యాలతో కూడిన వంటకాలు, స్వీట్లు, పసుపు రంగుతో కూడిన దుస్తులు ధరించి బృహస్పతికి పూజ చేయాలి. ఇలా చేస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం పూట ఉపవాసం వుండి గురు భగవానునికి కుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయిస్తే.. ఆర్థిక ఇబ్బందులు వుండవు. అలాగే ఉన్నత విద్యను అభ్యసిస్తారు. ఇంకా గురువారం పూట పేద ప్రజలకు చేతనైనంత అన్నదానం చేయడం ద్వారా కోరుకున్న కోరికలునెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే గురువారం ఉపవాసం చేయడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బృహస్పతిగురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. బృహస్పతికి పూజ చేసిన అనంతరం మీరు భుజించాలి. ఈ రోజు పూర్తిగా తల కడగడం లేదా ఉప్పు కలిగిన భోజనం తినడం మానుకోవాలి. భగవంతుడు కథ వినడం లేదా చదవడం ద్వారా ఉపవాసం ముగించాలి. అరటి చెట్టును శుభ్రపరిచి శనగలు, పసుపు అర్పించాలి. అంతేకాకుండా గురువారం రోజు పసుపు రంగు బట్టలను దానం చేస్తే మంచిది.

 

SHARE