ఖాళీ కడుపుతో ఇవి తింటే కలిగే అనర్ధాలు ఏంటో తెలుసా ?

ఉదయం లేవగానే కడుపులో ఏదో ఒకటి పడకపోతే ఆ రోజు మొదలవదు చాలామందికి. లేవగానే కడుపులోకి ఎదో ఒకటి తోసేస్తూ ఉంటారు. అలా ఏది పడితే అది ఖాళీ కడుపుతో తింటే తరువాత మెడిసిన్స్ వాడాల్సిందే అంటున్నారు డాక్టర్లు. ఆహరం ఒక పద్ధతిలో తింటే మనకు ఆరోగ్యాన్నిస్తుంది లేదంటే ఆ ఆహారం బదులు మందులు తినాల్సొస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

empty stomachరోజును టీ, కాఫీతో ప్రారంభించేవారు చాలా మంది ఉంటారు. పరగడుపున తాగే కాఫీ, టీల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. అందుకనే ఒక గ్లాసు మంచినీళ్లు తాగిన తర్వాత కాఫీ, టీలు తీసుకోవడం మంచిది. సిట్రస్ పండ్లయిన నిమ్మ, బత్తాయిలాంటివాటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం ఎసిడిటీ, గుండె మంటకు కారణమవుతుంది. ఇవి పొట్టలో గ్యాస్, యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. జీర్ణవ్యవస్థను పాడుచేస్తాయి.

empty stomachఇంకొందరికి లేవగానే పండ్లు తినేయడం అలవాటు. చౌకగా ఎప్పుడైనా అందుబాటులో ఉండే అరటి పండ్లని ఎక్కువగా తినడం చూస్తుంటాం. కానీ శరీరంలో మెగ్నీషియం శాతం ఎక్కువైతే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. అందులోనూ అరటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పరగడుపున దీన్ని తీసుకుంటే శరీరంలో మెగ్నీషియం స్థాయి ఒక్కసారిగా పెరిగి, గుండె సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. అయితే భోజనానికి ముందుగానీ, ఆ తర్వాతగానీ అరటి పండు తింటే మంచి ఫలితం ఉంటుందట. కానీ ఖాళి కడుపుతో మాత్రం తినొద్దు.

empty stomachచాలా మంది లేవగానే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. వీటిలో ఏ రకమైన పోషక విలువలు ఉండవు. చల్లగా ఉండటం వల్ల తాగేస్తుంటారు. కానీ ఇవి బరువు పెంచుతాయి. తీపి డ్రింక్, షర్బత్ వంటి వాటిల్లో షుగర్ అధికంగా ఉండి కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో పీహెచ్ విలువ ఎక్కువగా ఉండే సోడా, కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల పేగుల్లో ఇరిటేషన్ వచ్చి వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అదేవిధంగా కోల్డ్ కాఫీ, కోల్డ్‌టీలు కూడా స్టమక్ యాసిడ్స్‌కు దారితీస్తాయి. కూల్ డ్రింక్స్‌కు బదులుగా తాజా పండ్ల రసాలు తాగడం శ్రేయస్కరం.

empty stomachపరగడుపునే పెరుగు తీసుకున్నట్లయితే, పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారవుతుంది. లేక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాను చంపుతుంది. పెరుగులో ఎక్కువ శాతం లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల ఎసిడిటీ వస్తుంది. అలాగే టమాటాల్లో ఎక్కువగా టానిక్ యాసిడ్ ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, అల్సర్ వచ్చే అవకాశం ఎక్కువ కనుక పరగడుపున టమాటాలు తినకూడదు.

empty stomachనిజానికి టమోటాల్లో ఆకలిని పెంచే గుణం ఉంది. అందుకే భోజనానికి ముందు టమోటా‌ను సూప్‌గా తీసుకుంటారు. అలా తినే ముందు ఓకే కానీ, భోజనానికి ముందు కాకుండా ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్‌ మాత్రం తాగొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమోటాల్లోని టానిక్‌ యాసిడ్‌లు ఎసిడిటీని పెంచి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట. దాంతో జీర్ణ సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.

empty stomachఉదయం ఖాళీ కడుపుతో మసాలాలు దట్టించిన ఆహారం తింటే..పొట్టలో తీవ్ర మంట పుడుతుంది. ప్రేగులలో బాధ కలిగిస్తుంది. తీసుకునే అల్పాహారంలో ఎక్కువగా కారంగా ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. కారంగా ఉండే ఆహారం, మసాలాలతో ఉండే పదార్థాలను తినడం వల్ల ఎసిడిటీ, అల్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే స్వీట్స్ లాంటివి కూడా ఉదయాన్నే ఖాళి కడుపుతో తినకూడదు.. పరగడుపున తీపి పదార్థాలు తినడం వల్ల శరీరంలో చక్కెరస్థాయి పెరగడంతో క్లోమగ్రంథి మీద అదనపు భారం పడుతుంది. దీంతో డయాబెటిస్‌కి దారితీసే అవకాశాలు ఎక్కువవుతాయి.

empty stomachపచ్చి కూరలలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఖాళీ కడుపున తిండే హార్ట్ బర్న్, వెన్ను నొప్పిలాంటివి వస్తాయి. బీన్స్‌ని ఉదయాన్నే తీసుకుంటే అలసట, గ్యాస్‌కి కారణమౌతుంది. శరీరం వీటిని జీర్ణం చేసుకోవడానికి కష్టంగా ఫీలవుతుంది. ఉదయాన్నే పియర్స్ తింటే పొట్ట పనిచేసే తీరు దెబ్బతింటుంది. గ్యాస్ట్రో ఇన్‌టెన్షియల్ టిష్యులకు కారణమౌతుంది. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పొట్ట నొప్పి, అధిక బరువు సమస్య తలెత్తుతాయి.

empty stomachజిమ్‌కు ఖాళీ కడుపున వెళ్లకూడదు. అలా వెళ్తే కండరాలు విపరీతంగా అలిసిపోయి భరించలేని నొప్పులు వస్తాయి. జిమ్‌కు వెళ్లే ముందు అరటి పండు, సిట్రస్ ఫ్రూట్స్ తప్ప మిగతా ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR