చలికాలంలో పల్లీ పట్టీ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

చలి కాలం ఎన్నో ఆరోగ్య సమస్యలను మోసుకొస్తుంది. శరీరంలో వేడి తగ్గి, చలికి ముడుచుకుపోతుంటారు. దీనికి తోడు చల్లటి వాతావరణం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు పొంచి ఉంటాయి. వీటినుండి బైటపడడానికి వేడిసూప్ లు, శరీరంలో వేడి పుట్టించే ఆహారపదార్థాలు తినాల్సి ఉంటుంది. అందులో పల్లి పట్టి ముందుటుంది.

health benefits of eating palli pattiపల్లీల్లో ఉండే సుగుణాలు, బెల్లంలోని ఆరోగ్య లక్షణాలు చలికాలంలో శరీరంలో వేడి పుట్టించి జబ్బులకు దూరంగా ఉండేలా చేస్తుంది. పల్లీల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ కలవడం వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది.

health benefits of eating palli pattiపల్లీ పట్టీల వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగని అదే పనిగా మరీ ఎక్కువగా తినొద్దు. ఏదైనా మోతాదు మించితే అనర్థమే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. రక్త సమస్యలు లేదా మరేదైనా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకున్నాకే తినాలి.

health benefits of eating palli pattiపల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. పల్లీలను తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడతుంది. వేరు శనకలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. డయాబెటీస్ బాధితులు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తినడం మంచిదే.

health benefits of eating palli pattiబెల్లం, వేరుశనగలను కలిపి తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. పల్లీలో ఉండే పీచు పదార్థాలు ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలను దూరం చేస్తాయి. వేరుశనగ, బెల్లం ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపేస్తాయి. బెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR