జలుబు చేయడానికి గల కారణాలు ఏమిటి ?

0
291

సీజన్ మారినప్పుడు ముందుగా వచ్చే ఆరోగ్య సమస్య జలుబు. జలుబు.. వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదలదు. ఓ సామెత ఉంది కదా… జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారంరోజుల్లో తగ్గుతంది. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెబుతారు. అంటే.. జలుబు వస్తే ట్యాబ్లెట్స్ వేసినా.. వేయకపోయినా అది తగ్గాల్సిన టైమ్‌లోనే తగ్గుతుంది.

causes-of-coldsఅంతేనా జలుబు వచ్చిందంటే చాలు.. దాంతో పాటే తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి. జలుబు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ జలుబు చేయడానికి నిద్రలేమి కూడా ఒక కారణమేననే ఒక కొత్త నిజం ఇప్పుడు వెలుగు చూసింది.

causes-of-coldsఅవును.. రోజుకు 7 గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే 5 నుంచి 6 గంటలు నిద్రించే వారు ఎక్కువ సార్లు జలుబుకు గురవుతున్నట్లు, 5 గంటల కన్నా తక్కువగా నిద్రించే వారు, మిగతా వారికన్నా నాలుగు రెట్లు తీవ్రంగా జలుబు బారిన పడుతున్నట్లు పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు.

causes-of-coldsఅందుకే పెద్దలు కనీసం 7 గంటలైనా నిద్రించాలని, పిల్లలు, టీనేజ్‌ వాళ్లు 8 గంటల కన్నా ఎక్కువే నిద్రించాలని నేష్నల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ వారు సూచిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే వైరస్‌, బ్యాక్టీరియాలు దాడి చేస్తాయి. అసలు వ్యాధి నిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది? అనే విషయానికి వస్తే, దానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో నిద్రలేమి కూడా ఒక బలమైన కారణమేనని ఇటీవలి అధ్యయనాల్లో స్పష్టమయ్యింది.

causes-of-coldsనిద్ర సమయంలో ఎలాంటి పని ఉన్నా దాన్ని పక్కన పెట్టేయాలి. ఆ సమయంలో నిద్రకన్నా ఇంపార్టెంట్ మరేదీ లేదని గుర్తుంచుకోవాలి. ప్రశాంతమైన నిద్ర జలుబుకే కాదు అన్నీ రోగాలకు నివారిణిలా పనిచేస్తుంది.

 

SHARE