జుట్టు పొడవుగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

సాధారణంగా జుట్టు ఎదగడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. వాటి వల్ల రాత్రికి రాత్రే కురులు ఒత్తుగా, పొడవుగా అయిపోతాయనుకుంటే పొరపాటే.కురుల పెరుగుదలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని విషయాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ముఖ్యమైనవి.

precautions for long hair->వయసు
->ఆరోగ్యం
->జుట్టు తత్వం

ముందు మన హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుందనే విషయం తెలుసుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దానికోసం కొన్ని ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. అందులో భాగంగా మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి కురుల సంరక్షణ విషయం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

పోషకాహారం:

precautions for long hairతినే ఆహారంలో జుట్టుకి అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఆహారంలో ఒమెగా 3, ఒమెగా 6, జింక్, బీ 5, బయోటిన్, విటమిన్ సి, ఐరన్, విటమిన్ డి కలిగిన ఆహారపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలనుకుంటే.. మాత్రం డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించాలి.

ప్రొటీన్:

precautions for long hairకురులపై కాలుష్య ప్రభావం పడకుండా ప్రొటీన్ కాపాడుతుంది. కాబట్టి ప్రొటీన్ నిండిన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే హీట్ స్టైలింగ్ చేసుకునేటప్పుడు అంటే.. స్ట్రెయిటనింగ్, కర్లింగ్ లాంటివి చేసుకునేటప్పుడు ప్రొటీన్ నిండిన హీట్ ప్రొటెక్టెంట్ ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా కొబ్బరి నూనె కూడా ఉపయోగించవచ్చు. తలస్నానానికి ముందు తర్వాత కొంత కొబ్బరినూనె అప్లై చేసుకోవడం ద్వారా వెంట్రుకలు ప్రొటీన్ కోల్పోకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఎక్కువగా తింటే.. వెంట్రుకలు బిరుసుగా మారి తెగిపోయే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రొటీన్ విషయంలో సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా కూరగాయలు, నట్స్, పెరుగు వంటివాటిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ప్రొటీన్ పొందవచ్చు.

నూనెలు:

precautions for long hairఎస్సెన్సియల్ నూనెలు ఉపయోగించడం ద్వారా జుట్టు ఎదిగేలా చేసుకోవచ్చు. రోజ్ మేరీ, జొజోబా, టీట్రీ, పెప్పర్మింట్ తదితర నూనెలను ఎస్సెన్సియల్ నూనెలు అని పిలుస్తారు. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అయితే వీటిని నేరుగా వెంట్రుకలకు రాసుకోకూడదు. కొన్ని చుక్కలు కొబ్బరినూనెలో కలిపి రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే తలస్నానం చేసేటప్పుడు షాంపూలో కొన్ని చుక్కల జొజోబా నూనె కలిపి అప్లై చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,640,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR