Home Unknown facts కాకి తలపై తన్నితే కలిగే దుష్ప్రభావాలు ఏంటి ?

కాకి తలపై తన్నితే కలిగే దుష్ప్రభావాలు ఏంటి ?

0

మన భారతదేశంలో ప్రజలు ఎన్నో సాంప్రదాయ పద్ధతులను, ఆచారాలను పాటించడమే కాకుండా ఎన్నో నమ్మకాలను కూడా పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు. అయితే కొన్ని న‌మ్మ‌కాలు ప్ర‌జ‌ల్లో మూఢ న‌మ్మ‌కంలా బ‌లంగా నాటుకుపోయాయి. ఆరోగ్యానికి హాని చేసే వాటికి చెక్ పెట్ట‌డానికి మ‌న పెద్ద‌లు సంప్ర‌దాయం పేరుతో మ‌న‌లో ఓ భ‌యాన్ని క‌లిగించేలా కొన్ని న‌మ్మ‌కాలను ఎక్కించారు. అలాంటి వాటిలో కాకి త‌న్నితే అప‌శ‌కునం మ‌నే ఓ న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంది. కాకి త‌ల‌పై త‌న్నితే మ‌ర‌ణ వార్త వింటార‌ని.. ఏడేళ్ల పాటు శని తాండ‌విస్తుంద‌ని న‌మ్ముతుంటారు.

కాకి తలపై తన్నితేనిజానికి కాకిని పితృదేవతలకు ప్రతినిధి పిలుస్తారు. ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని చాలా మంది నమ్ముతారు. కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇవన్నీ మూఢనమ్మకాలా? వాస్తవాలా? అన్న విషయంలో క్లారిటీ ఇచ్చేలా రామాయణంలో ఓ కథ ఉంది. ఆంజనేయుడు సీతమ్మని వెతుక్కుంటూ లంకకి వెళ్తాడు. అతడు సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టు మీద ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది. అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది. అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకి శుభవార్త కాబట్టి, కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు.

అయితే కాకి తలపై తన్నితే మాత్రం భయపడిపోయే అంత అపనమ్మకమూ ఉంది. కాకి శని వాహనం కాబట్టి.. కాకి తలకు తగిలితే శని దోషం జరుగుతుందని, యముడి రాకకి సంకేతమని భయపడతారు. కాకి మనపై వాలితే మరణవార్త వింటారని, కాకి మన ఇంట్లో దూరితే శని వస్తుందని చెబుతుంటారు. మరికొందరు శనీశ్వరుడికి కాకి వాహనం కనుక, కాకి మన ఇంట్లో దూరితే సాక్షాత్తు శనీశ్వరుడు మన ఇంట్లోకి వచ్చాడని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున పూజలను నిర్వహిస్తున్నారు.అయితే ఇవన్నీ కేవలం మనం పెట్టుకున్న నమ్మకాలేనని కొట్టిపారేస్తున్నారు. అయితే దీని వెన‌క కూడా శాస్త్రీయ‌త ఉంద‌ని మీకు తెలుసా.? ఇంత‌కీ కాకి త‌ల‌పై త‌న్నితే సైన్స్ ప్ర‌కారం ఏమ‌వుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకి గోళ్లు చాలా ప‌దునుగా ఉంటాయి. కాబ‌ట్టి వేగంగా ఎగురుతూ వ‌చ్చి త‌ల‌పై త‌న్నితే గోళ్లు గుచ్చుకునే ప్ర‌మాదం ఉంటుంది. అయితే కాకులు స‌హ‌జంగా ఆహార అన్వేష‌ణ‌లో భాగంగా ఎలుక‌ల‌ను, చ‌నిపోయిన జంతువుల‌ను కాలి గోళ్ల‌తో పీక్కుతింటాయి. దీనివ‌ల్ల కుళ్లి పోయిన జంతువుల వ్య‌ర్థాలు కాకి కాలి గోళ్ల‌లో ఉండిపోతాయి. కాకికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే. కుళ్లినవి తిన్నా దానికి ఏం కాదు. కానీ ఆ కాకి త‌ల‌పై త‌న్నిన స‌మ‌యంలో కుళ్లిపోయిన వ్య‌ర్థాల్లో ఉండే క్రిములు మాన‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశించే ప్ర‌మాదం ఉంటుంది.

ఫలితంగా ఆ క్రిములు తల నుంచి చెవుల్లోకి, చేతుల్లోకి చివరకు శరీరంలోకి ప్రవేశించి రోగాలు వస్తాయి. వేగంగా ఎగిరే కాకి అంతే వేగంతో కాలిగోటితో తన్నుతాయి. కొన్ని సార్లు కాళ్లతో తల మీద రక్కడంతో రక్తస్రావం అవుతుంది. అయితే పూర్వం రోజుల్లో స‌రైన వైద్య స‌దుపాయాలు లేక‌పోవ‌డంతో సూక్ష్మ క్రిములు శరీరంలోకి ప్ర‌వేశించ‌డంత‌తో మ‌ర‌ణాల‌కు దారి తీసేది. దీంతో కాకి త‌న్నితే మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌నే న‌మ్మ‌కం బ‌లంగా ఉండిపోయింది. అంతే కాకుండా కాకి త‌ల‌పై త‌న్నితే త‌ల స్నానం చేయాల‌ని చెబుతుంటారు. దీనివ‌ల్ల త‌ల‌పై ఏమైనా క్రిములు చేరితో తొలిగిపోతాయ‌ని చెబుతుంటారు.

కాబ‌ట్టి కాకి త‌న్నితే అంతగా భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అప‌శ‌కునంలాగా భావించ‌కుండా శాస్త్రీయంగా ఆలోచించి, ఏదైనా గాయ‌మైతే చికిత్స తీసుకోవ‌డం ఉత్త‌మం. అప్పటికీ భయంగా ఉంటే శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం చేసి, అభిషేకం చేయిస్తే దోషం పోతుంది.

 

Exit mobile version