దగ్గు ఎందుకు వస్తుంది ? దగ్గుని తగ్గించే వంటింటి చిట్కాలు ఏంటి ?

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో చిన్నపాటి దగ్గు వచ్చినా సరే చుట్టుపక్కల వారు భయపడుతున్నారు. కరోనా లేకపోయినా అదే పనిగా దగ్గుతూ ఉంటే పక్కనున్న వారు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. దగ్గే వారు కూడా దగ్గలేక చాలా ఇబ్బంది పడతారు. దగ్గు తగ్గించుకోవాలంటే ముందు అది ఎందుకు వస్తోందనేది మనకు తెలియాలి. శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు.

దగ్గు మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది. ఊపిరితిత్తులలోకి ఏవో సూక్ష్మక్రిములు ఎంటరైతే అవి కుదురుగా ఉండవు. ఊపిరితిత్తుల్ని పాడుచేస్తూ రోగాలూ వచ్చేలా చేస్తాయి. వాటిని తరిమేసేందుకు మన బాడీలోని మంచి బ్యాక్టీరియా ప్రయత్నిస్తుంది. అయితే ఆ బ్యాక్టీరియా తరమలేనప్పుడు మనకు దగ్గు వస్తుంది.

What are the tips to reduce coughదగ్గు రాగానే కొంత మంది మందులు వేసేసుకుంటారు. అలా చెయ్యడం మంచిది కాదు. ఆ మందుల వల్ల చెడు బ్యాక్టీరియాతోపాటూ. మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. దగ్గు ముందులు తాత్కాలికంగా దగ్గును అణిచివేస్తాయిగానీ లోపల అసలు సమస్య అలాగే ఉండి, అది మరింత ముదురుతుంటుంది. పైగా ఈ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.

What are the tips to reduce coughదగ్గును అణిచివేసే మందులు నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మలబద్దకం కూడా మొదలవ్వచ్చు అంటున్నారు. కొన్ని దగ్గు మందులతో మగత, అలసట వంటి సమస్యలు రావచ్చు. కొన్ని దగ్గు మందులు తీసుకున్న తర్వాత మత్తుగా అనిపించవచ్చు. కాబట్టి వీటిని అందరూ, ఎప్పుడుబడితే అప్పుడు వాడటం అంత మంచిది కాదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ చేసేవాళ్లు వీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

What are the tips to reduce coughఅందుకే జలుబు, దగ్గు వచ్చినప్పుడు వెంటనే ఆస్పత్రికి పరుగులు పెట్టి ఆ మందులు, ఈ మందులు వేసుకోకుండా ఒకసారి మన వంటింట్లోని పోపుల పెట్టెలోకి తొంగిచూస్తే దగ్గు, జలుబులను తగ్గించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే, అప్పుడు మందుల జోలికి వెళ్లాలి. మరి దగ్గుని తగ్గించే ఆ వంటింటి చిట్కాలేంటో చూసేద్దామా…

->మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటించే చిట్కా… ఆవిరి పట్టడం. ఓ గిన్నెలో వేడి నీరు పోసి. దుప్పటి కప్పుకొని… ఆ నీటి ఆవిరిని పీల్చాలి. ఇలా చెయ్యడం వల్ల మ్యూకస్‌ క్లియర్ అయి శ్వాస చక్కగా ఆడుతుంది. ఈ ఆవిరి అనేది యాంటీసెప్టిక్‌లా పనిచేస్తూ… గొంతులో, ముక్కులో బ్యాక్టీరియా, క్రిములను చంపేస్తుంది కూడా.

What are the tips to reduce cough-> తేనె అనేది స్కిన్, ఆహార నాళం, శ్వాసకు ఎంతో మేలు చేస్తుంది. దగ్గు వచ్చే వారికి ఉపశమనం కలిగిస్తుంది. ఊపిరి తిత్తులకు కావాల్సిన మాయిశ్చర్ అందిస్తుంది. అందువల్ల గోరు వెచ్చటి నీటిలో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తేనె ఎంత తీసుకోవాలో ఆ జాగ్రత్తలు పాటించాలి.

What are the tips to reduce cough-> నిమ్మరసంలో విటమిన్ C ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి కాయల్లో కూడా ఇది ఎక్కువగానే ఉంటుంది. విటమిన్ C టాబ్లెట్లు వాడే బదులు సహజ పండ్లను వాడటం మేలు. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే గొంతు గరగర తగ్గుతుంది. దగ్గు కూడా పరారవుతుంది.

What are the tips to reduce cough-> దగ్గ ఎక్కువగా వేధిస్తుంటే, మిరియాల కషాయం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ½ చెంచా నల్ల మిరియాల పొడిని దేశవాళి నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ కషాయాన్ని కనీసం రోజుకి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

What are the tips to reduce cough-> కొంతమంది ఎక్కువగా ఫ్రైలు, స్పైసీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. దగ్గు వచ్చే సమయంలో మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఫ్యాట్ ఉండే ఫుడ్ కూడా తినకూడదు. నాన్ వెజ్‌కి దూరంగా ఉంటే మంచిది. చక్కగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ఆహారం తింటే… దగ్గు త్వరగా తగ్గిపోతుంది. ఉడకబెట్టిన గుడ్లు, క్లియర్ సూప్స్ వంటివి కూడా కొంత మేలు చేస్తాయి.

What are the tips to reduce cough->రాత్రి పడుకునే ముందు చిటికెడు పసుపులో కొన్ని నీళ్లు కలిపి ఉండలా చేసి మింగి పడుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది.

What are the tips to reduce cough-> కాసిన్ని వాము గింజలను దవడకు పెట్టుకుని పడుకున్నా రాత్రి దగ్గు రాదు. రాత్రి పడుకునే ముందు బుగ్గన కరక్కాయ పెట్టుకుని పడుకున్నా దగ్గు రాదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR