Home Unknown facts సైంధవుడు ఎవరు? అతడికి ఉన్న వరం ఏంటి?

సైంధవుడు ఎవరు? అతడికి ఉన్న వరం ఏంటి?

0

మహాభారతంలో సైంధవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు. పుట్టగానే అతడికి ఒక వరం కూడా లభించింది. అయితే శ్రీలోలుడు అయినా సైంధవుడు ఒక సందర్భంలో ద్రౌపతిని ఎత్తుకు వెళ్తాడు. ఇంకా కురుక్షేత్రంలో అభిమన్యుడి మరణానికి కూడా కారణం అవుతాడు. మరి సైంధవుడు ఎవరు? అతడికి ఉన్న వరం ఏంటి? అర్జునుడు సైంధవుడి తలని ఏవిధముగా నరికి వేస్తాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Saindhavaసింధు దేశాధిపతి అయినా వృద్ధక్షత్త్రుని కొడుకు సైంధవుడు. అయితే సైంధవుడు చిన్నతనంలో ఆడుకుంటుండగా ఏమరపాటుగా ఉన్నప్పుడు ఇతని తల నరకబడుతుంది అని ఆకాశవాణి పలుకుతుంది. అప్పుడు ఆకాశవాణి మాటలను విన్న అతడి తండ్రి వృద్ధక్షత్త్రుని బాధపడుతూ ఎవరైతే సైంధవుడి శిరస్సుని నేలపైన పడివేస్తారో వారి తల వెయ్యి ముక్కలు అవుతుందని శపిస్తాడు.

ఇది ఇలా ఉంటె, సైంధవుడి పేరు జయధ్రదుడు. సింధు దేశానికి రాజు కావున సైంధవుడు అనే పేరు వచ్చింది. ఈ సైంధవుడు కౌరవుల చెల్లి అయినా దుస్సలకి భర్త. ఇతడికి స్త్రీ వ్యామోహం ఎక్కువ, అయితే ఒకరోజు ద్రౌపతిని చూసి మోహించి ఆమె దగ్గరికి వెళ్లి పాండవులు లేని సమయంలో తన కోరికను తెలియచేయగా, వరుసకు అన్న అయినా నీవు ఇలాంటి బుద్దితో నీచంగా మాట్లాడటం నీకు తగదు అని హెచ్చరించగా అవి ఏవి పట్టని సైంధవుడు ద్రౌపతిని ఎత్తుకుపోతాడు. అప్పుడు పాండవులు ద్రౌపతిని విడిపించి, సైంధవుడు వారి చెల్లి అయినా దుస్సలకి భర్త అనే ఒక్క కారణంతో చంపకుండా గోరంగా అవమానించి వెళ్ళిపోతారు.

ఇక కురుక్షేత్రంలో కౌరవుల తరపున ఉన్న సైంధవుడు పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడి మరణానికి కారణం అవుతాడు. ఆ సమయంలో సైంధవుడి ని సంహరించడం కోసం అర్జునుడు బయలుదేరి యుద్ధంలో అర్జునుడు సైంధవుడి తలని నైకివేస్తాడు. ఇక ఆ సమయంలో ఆ శిరస్సు నేలపైన పడకుండా శ్రీకృష్ణుడు ఉపాయం చెప్పడం వలన పాశు పతాస్త్రాన్ని ఉపయోగించి శిరస్సును తపస్సు చేసుకుంటున్న సైంధవుని తండ్రి అయినా వృద్ధక్షత్త్రుని ఒడిలో పడేలా చేస్తాడు

Exit mobile version