హనుమంతుని సంతానం గురించి కాంబోడియాన్, థాయ్ కథనాలు ఏమి చెబుతున్నాయి

కాంబోడియాన్, థాయ్ కథనాల ప్రకారం హనుమంతుడి పుత్రుడిని మచ్చాను అని కూడా పిలుస్తారు. రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య, హనుమంతులకు మచ్చాను జన్మించాడని అంటారు. ఇంకొన్ని కథనాలు, హనుమంతుడి వీర్యం నదీజలాల ద్వారా పయనించి రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య సువన్నమచ్చని చేరిందని ఆ విధంగా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని అంటున్నాయి. మరికొన్ని కథనాలు, లంకకు వంతెనను కడుతున్నప్పుడు హనుమంతుడు సువన్నమచ్చతో ప్రేమలో పడి తద్వారా మచ్చాను అనే బిడ్డకు జన్మనిచ్చారని అంటారు.

Hanumanథాయ్, కేంబోడియాన్ రామాయణ కథనాల ప్రకారం రావణసైన్యంతో జరుగుతున్న ఒకానొక యుద్ధంలో హనుమంతుడు సాహసోపేతమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటాడు. వానరునిలాగే కనిపించిన ఆ ప్రత్యర్థి సగం చేప ఆకారంలో కనిపించాడు. భీకర యుద్ధం తరువాత హనుమంతుడు తన వద్ద నున్న ఆయుధాలతో తన ప్రత్యర్థిని డీ కొనడానికి సంసిద్ధమవుతాడు. ఇంతలో, ఆకాశంలో బంగారు వర్ణంలోనున్న నక్షత్రం మిల మిల మెరుస్తుంది. ఆకాశవాణి వినిపిస్తుంది. హనుమంతుడికి ఎదురైనా సాహసోపేతమైన ప్రత్యర్థి మరెవరో కాదని అతను స్వయంగా హనుమంతుడి కుమారుడేనని ఆకాశవాణి వినిపిస్తుంది. రావణుడి కుమార్తె అయిన సువన్నమచ్చ ద్వారా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని ఆకాశవాణి తెలియచేస్తుంది. వెనువెంటనే హనుమంతుడు తన ఆయుధాలను వెనక్కి తీసుకుంటాడు. తండ్రీ కొడుకులు ఇరువురూ ఒకరినొకరు గుర్తుపడతారు.

మకరధ్వజుడుహనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ద భూమిలో ఎదురైనా శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. హిందూ పురాణంలో ఇలాంటి ఆశ్చర్యకరమైన అంశాలెన్నో చెప్పబడ్డాయి. మకరధ్వజ హనుమంతుడి కొడుగుగానే కాకుండా సాహసోపేతమైన యుద్ధ వీరుడిగా కూడా ప్రసిద్ధి. తండ్రీ కొడుకులిద్దరూ యుద్ధభూమిలో ఒకరికొకరు ఏమవుతారో తెలుసుకోకుండా యుద్ధానికి సన్నద్ధమవుతారు.

మకరధ్వజుడుఅంతే కాకుండా మహర్షి వాల్మీకి రామాయణంలోని ప్రసిద్ది చెందిన కథనం ప్రకారం ఒకసారి హనుమంతుడు ఒక నదిలో స్నానమాచరిస్తుండగా అతని శరీరంలోనుంచి పుట్టిన వేడివల్ల అతని వీర్యం ఆ నదీజలాల గూండా ప్రయాణించి ఒక చేప లాంటి జీవి అయిన మకరలోకి చేరింది. ఆ తరువాత ఆ జీవి ఒక బిడ్డను ప్రసవించింది. ఆ తరువాత రావణుడి దాయాదులైన ఆహిరావణ, మహిరావణలు సగం వానర ఆకారంలో సగం చేప ఆకారంలోనున్న ఈ బిడ్డని ఆ నదీతీరంలో కనుగొన్నారు. ఆ విధంగా మకరధ్వజ జన్మించాడు.

Hanumanవాల్మీకి రామాయణం ప్రకారం, రామలక్ష్మణులను అహిరావణుడు పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరతాడు. ఇంతలో, సగం వానరం, సగం చేప ఆకారంలోనున్న మకరమనే వాడు పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి సవాల్ విసిరాడు. హనుమంతుడికి కుమారుడిగా తనని తాను పరిచయం చేసుకున్నాడు.

Valmikiమకరధ్వజుడు తన కుమారుడన్న విషయం తెలుసుకుని హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. తాను బ్రహ్మచారని చెప్తాడు. జరిగిన సంఘటనలన్నిటినీ ఒకసారి కళ్ళు మూసుకుని తన మనోనేత్రంతో హనుమంతుడు తెలుసుకున్నాడు. తన పుత్రుడైన మకరధ్వజుడిని హత్తుకుని ఆశీర్వాదాన్ని అందించాడు.

మకరధ్వజుడురాక్షసుల బారినుంచి రామలక్ష్మనులను రక్షించడానికి తనకు దారిని వదలమని తనను అడ్డుకోవద్దని హనుమంతుడు తన పుత్రుడినడుగుతాడు. అయితే, మకరధ్వజుడు హనుమంతుడికి దారివ్వడానికి అంగీకరించడు. తన తండ్రని తెలిసిన తరువాత కూడా హనుమంతుడికి అడ్డు తగులుతాడు. తన యజమాని అహిరావణ ఆజ్ఞను ధిక్కరించడానికి మకరధ్వజుడు అంగీకరించడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR