ఎర్రగా మారిన కళ్లు మాములు స్థితికి రావాలంటే ఏం చేయాలో తెలుసా ?

రెండు రోజులు నిద్ర పోలేదంటే కళ్ళలో నీటికి బదులు రక్తం నిండినట్టు కనిపిస్తుంది. కళ్ళు ఎర్రగా మారిపోతాయి. అయితే నిద్రరాని సమయంలో కళ్లు ఎందుకు అలా ఎర్రగా మారతాయనేది చాలా మందికి కలిగే సందేహం. దీనికి కారణం బాడీలో ఆక్సిజన్ స్దాయి తగ్గడమే. మత్తుగా,బలహినంగా ఉన్నప్పడు కంటికి సరఫరా అయ్యే ఆక్సిజన్ పరిణామాణం కూడా తగ్గుతుంది. దీంతో కంటిలో ఉండే రక్తనాళాలు ఉబ్బుతాయి. దీంతో రక్త నాళాలు పైకి తేలి ఎర్రగా కనిపిస్తాయి.

What causes redness of the eyesమరి అలా ఎర్రగా మారిన కళ్లు మాములు స్థితికి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఆరు నుంచి ఏడు గంటల పాటు చక్కని నిద్ర పోయి కంటిని చల్లటి నీటితో కడ్కుకుంటే ఈ ఎరుపు మాయమవుతుంది. కళ్లు సాధారణ స్థితికి వస్తాయి. అలాగే సాధారణంగా మనిషి అలసిపోయినప్పుడు నిద్ర వస్తుంది. దీన్ని అపడానికి కళ్లను ఆర్పడం తగ్గిస్తాడు. ఈ కారణంగా కళ్లలలో ఉండే లూబ్రికెంట్ తగ్గుతుంది. దీంతో కళ్ళ పొడిబారి దురదలు మెుదలవుతుంది. దీంతో అదే పనిగా కళ్ళను చేతితో నలుపుకుంటారు.

What causes redness of the eyesఇలా నలపడం వల్ల కూడా కళ్లు ఎర్రబడుతాయి. రాత్రి సమయాల్లో కళ్లు ఎర్రబడానికి చాలా కారణాలు ఉన్నాయి. అలసట, కళ్లు నలపడం, విరామం లేకుండా పగటిపూట సూర్య కిరణాలు తాకిడికి గురవడం కారణంగా కళ్లు ఎర్రగా మారుతాయి. ఇలాంటి సాధరణ పరిస్థితుల వలన కాకుండా కళ్లు ఎర్రబడితే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

What causes redness of the eyesనిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తున్న సమస్య. నిద్రపోకపోవడం వల్ల ఆరోగ్యం పాడైపోవడమే కాకుండా మన పని సామర్ధ్యం తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కారణంగా మనిషి అనేకరకాల రుగ్మతలకు దారి తీస్తుంది. దాంతోపాటు చికాకు, నిద్రలేమి, ఆందోళన వంటివి మనిషిని వేధిస్తున్నాయి. రాత్రి పూట విధులు నిర్వర్తించే వారిలో నిద్రలేమి సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఈ సమస్య వలన డీఎన్‌ఏ సైతం దిబ్బతింటోంది. ఇది కాస్త దీర్ఘకాలిక వ్యాధులను ప్రేరేపించేందుకు దోహదపడుతోంది. రోజూలో కనీసం 7-8 గంటల నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR