Home Health వ్యాయామానికి మెదడుకి ఏంటి సంబంధం?

వ్యాయామానికి మెదడుకి ఏంటి సంబంధం?

0
do exercise regularly

ఆటలు, వ్యాయామం శరీరానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. శరీరాన్ని బలంగా చేయడంలో ఫిట్ గా ఉండడంలో వ్యాయామం సహాయపడుతుంది. వ్యాయామం అనగానే కండరాలు బలోపేతం కావటం, శరీర పటుత్వం ఇనుమడించటమే గుర్తుకొస్తుంది. దీని ప్రభావం ఒక్క కండరాలతోనే ఆగిపోయేది కాదు. వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కదా. దీంతో మెదడుకు మరింత ఎక్కువ రక్తం, ఆక్సిజన్‌ సరఫరా అవుతాయి. దాని వల్ల టాక్సిన్ల నిర్మూలన జరుగుతుంది. వ్యాయామంతో మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు కణాల మధ్య కొత్త అనుసంధానాలు పుట్టుకొచ్చేలానూ ప్రేరేపిస్తుంది. ఇవన్నీ రకరకాల ప్రయోజనాలు చేకూరేలా చేస్తాయి. నడక, జాగింగ్, తోటపని వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు (గుండె, శ్వాస వేగం పెరిగేలా చేసేవి) మెదడులోని హిప్పోక్యాంపస్‌ అనే భాగం వృద్ధి చెందేలా చేస్తాయి.

మనం ఆయా విషయాలను నేర్చుకోవటం, జ్ఞాపకం పెట్టుకోవటం వంటివాటికి తోడ్పడేది హిప్పోక్యాంపసే. ఇది వయసుతో పాటు కుంచించుకుపోకుండానూ వ్యాయామం కాపాడుతుంది. అంటే వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండానూ చూస్తుందన్నమాట. పనులను మరింత ఇష్టంగా చేసేవారిలో మెదడు కణాలు తిరిగి ఉత్తేజితం కావటం ఇంకాస్త ఎక్కువగా ఉంటున్నట్టూ కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వయసుతో పాటే మన జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుందని చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాం. అలాగే వయసుతో పాటు మన ప్రతిస్పందనలూ మందగిస్తాయని కూడా విన్నాం. కానీ వ్యాయామం ద్వారా మన మెదడును తిరిగి ఉద్దీపనం చేసుకోవచ్చని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాయామం వల్ల మన మెదడు పరిమాణం పెరుగుతుంది. వ్యాయామం కారణంగా మెదడులో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అలాగే కొత్త కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి.

వ్యాయామం ఆరు బయట చేస్తే మరీ మంచిది. దాని వల్ల శరీరానికి విటమిన్ డి కూడా లభిస్తుంది. కొత్త వాతావరణంలో, కొత్త తరహాలో వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీకు గార్డెనింగ్ ఇష్టమైతే, ఒక్కరే గార్డెనింగ్ చేసే బదులు అలాంటి అలవాటున్న వాళ్లతో కలిసి పని చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల శరీరానికి వ్యాయామం లభించడంతో పాటు మెదడూ చురుగ్గా మారుతుంది. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో సెర‌టోనిన్‌, డోప‌మైన్‌, ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. వీటి వ‌ల్ల మూడ్ మారుతుంది. ఉత్సాహం ల‌భిస్తుంది. సంతోషంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు.

రోజూ మ‌నం అనేక సంద‌ర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. దీని వ‌ల్ల శ‌రీరంలో కార్టిసోల్ విడుద‌ల‌వుతుంది. ఇది మంచిది కాదు. అనారోగ్యాల‌ను తెచ్చి పెడుతుంది. అయితే రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల కార్టిసోర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారి నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దాంతో మెద‌డు చురుగ్గా మారుతుంది. ఆలోచ‌నా శ‌క్తి పెరుగుతుంది.

వ్యాయామం చేసేవారిలో తెల్ల, బూడిద రంగు మెదడు పదార్థం మరింత ఎక్కువగానూ, దెబ్బతిన్న కణజాలం తక్కువగానూ ఉంటుంది. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉందనటానికి సూచికలు. వ్యాయామంతో గుండెతో పాటు తలకు రక్తాన్ని తీసుకొచ్చే పెద్ద రక్తనాళం, మెదడులోని సూక్ష్మ రక్తనాళాలూ బలోపేతమవుతాయి. దీంతో మెదడుకు రక్తం బాగా అందుతుంది. ఫలితంగా మెదడు చక్కటి ఆరోగ్యంతో కళకళలాడుతుంది. మేధోశక్తి పుంజుకుంటుంది.

అల్జీమర్స్‌కు కారణమయ్యే ప్రొటీన్‌ ముద్దలు కట్టడమూ నెమ్మదిస్తుంది. వ్యాయామం చేయని వారితో పోలిస్తే.. నిత్యం వ్యాయామం చేసే వారికి అల్జీమర్స్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలా పరిశోధనలు ఇప్పటికే వెల్లడించాయి. అలాగే ఎక్సర్​సైజ్​లు చేయడం వల్ల మెదడు సంబంధిత ఇతర వ్యాధులు కూడా దరి చేసే ప్రమాదం తగ్గుతుందని స్పష్టం చేశాయి. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు ఎరోబిక్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది.

Exit mobile version