స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి కలలో కనిపిస్తే అర్థం ఏంటి?

చాలా వరకు మనుషుల కలలు వారిని సంతోషపరుస్తాయి. కానీ కొన్ని కలలు చెడు జ్ఞాపకాలను మిగిలిస్తాయి. మరి కొన్ని ఎంతో ప్రత్యేకమైన వాటిగా భావిస్తాం. స్వప్న శాస్త్రం ప్రకారం అలాంటి వాటిని శుభ స్వప్నాలు అని అంటారు. మరి అలాంటి శుభం చేకూర్చే టాప్-6 కలలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మాంసాన్ని ఉడికిస్తున్నట్లు కలవస్తే మీ జీవితంలో విశేష లాభాలను సంపాదించిపెడుతుంది. మాంసాన్ని మీరే కట్ చేస్తున్నట్లు కలొస్తే.. మీకు వారసత్వం రూపంలో ఆర్థిక లాభాలను పొందబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. మాంసం తినడం లేదా వంట చేయడం లాంటి కలలొస్తే.. స్నేహితుడికి దూరం కాబోతున్నారని అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

కలలో కనిపిస్తే కుళ్ళిన మాంసం కలలో వస్తే.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని, పాము మాంసం కలలో కనిపిస్తే.. అశుభ సూచకమని.. పంది మాంసం అక్రమ మార్గాల నుంచి డబ్బును సూచిస్తుంది. కోడి మాంసం తిన్నట్లు వస్తే మహిళలకు ఉపయోగకరమైన వార్తలు వస్తాయి.

కలలో కనిపిస్తేకలలో శంఖం కనిపించడం చాలా అరుదు. కలలో శంఖం కనిపిస్తే నారాయణుడు, లక్ష్మీ దేవి కనిపించారని అర్థం. అది చాలా మంచిది. వీరికి సంపద, ఆనందాలు పెరుగుతాయి.

కలలో కనిపిస్తేగుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కల వస్తే ఎంతో శుభదాయకం. దీనర్థం మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో మీకు మెరుగైన ఫలితాలు అందుతాయని అర్థం. అంతేకాకుండా వ్యాపారస్థులకు త్వరలో లాభాలు వస్తాయి. ఇదే సమయంలో ఉద్యోగస్థులైతే ఉన్నత హోదాలు పొంది మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.ఒక వేళ మీ కలలో గుర్రంపై పడుతున్నట్లు వస్తే కెరీర్ లో మీరు కూడా అలానే కిందకు దిగజారతారని అర్థం. అంటే మీరు ఎంచుకున్న రంగాల్లో భారీ నష్టాలను చవిచూస్తారని చెప్పవచ్చు.

కలలో కనిపిస్తేకలలో గాజులు ధరిస్తున్నట్లుగా కనిపిస్తే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోననే సందేహం కలగకపోదు. ఈ విధంగా కల రావడం శుభ సూచకమని శాస్త్రం చెబుతోంది. పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకు గాజులు ధరిస్తున్నట్లుగా కలవస్తే త్వరలోనే వారి వివాహం జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతోంది.

కలలో కనిపిస్తేకలలో పక్షులు చనిపోయిన వ్యక్తి పక్షి రూపంలో కలలోకి వచ్చడాని అర్థం. పక్షి కనిపిస్తే.. సంపాదన పెరగడమే కాకుండా.. శుభ సుచికం.

కలలో కనిపిస్తేపాములు కనిపించి తరిమితే చెడు జరుగుతుందని, కాటేసి, రక్తం వస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అంతే కొత్త బట్టలు కనబడితే హాని అని, చనిపోయిన వారు కనబడితే మంచిదని అంటుంటారు.

కలలో కనిపిస్తేఒకవేళ కలలో మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నట్లు వస్తే అప్పుడు కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీ కిష్టమైన వారి నుంచి ఇంకా మధురానుభూతులు, అనుభవాలను పొందుతారు. ఇలాంటి కలలు ఆడవాళ్లకు ఎక్కువగా వస్తుంటాయి. మగవారికైతే వారి ప్రేయసి నుంచి మరింత ప్రేమ పొందేందుకు ప్రతీకగా చెబుతుంటారు. అంతేకాకుండా వారి కలల రాకుమారిని కలిసేందుకు ఆత్రుత పడుతుంటారు. ఇలాంటి కలలు స్త్రీలకు వస్తే త్వరలో వారి కలల రాకుమారుడిని కలుసుకోబోతున్నారని అర్థం.

కలలో కనిపిస్తేకలలో పండ్ల బుట్ట కనిపిస్తే.. ఇంటికి కొత్త అతిథి రాబోతున్నారని అర్థం. అలాగే స్త్రీకి ఆపిల్ తినే కల వస్తే  వారికి పిల్లలు కలుగుతారని అర్థం. నిజ జీవితంలో వెంట్రుకలు కత్తిరించుకోవాలంటే ఎంతో బాధపడుతుంటారు. అదే కలల లోకంలో జుత్తు కత్తిరించుకుంటున్నట్లు కల కంటే.. అప్పటివరకు మీకున్న సమస్యలు ముగుస్తాయని అర్థం. అంటే ఏదయితే మీ ముఖ్యమైన పని అనుకుని ప్రణాళిక వేసుకుని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారో.. అది సకాలంలో పూర్తవుతుంది. అదే సమయంలో మీ వెంట్రుకలను స్వయంగా మీరే కత్తిరించుకుంటున్నట్లు కల కంటే అది అంత శుభదాయకం కాదు. ఫలితంగా సంపద తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి కల కన్నప్పుడు ఖర్చు విషయంలో మిమ్మల్నీ మీరు నియంత్రించుకోవడం అలవర్చుకోవాలి.

కలలో కనిపిస్తేకలలో ముంగిస కనిపిస్తే చాలా మంచిది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారని అర్థం. అలాగే.. బంగారం, వెండి పొందుతారని అర్థం.

కలలో కనిపిస్తేనల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు కల వస్తే.. చాలా మంది కంగారు పడతారు. అది మంచి కల కాదని అభిప్రాయపడుతుంటారు. అయితే ఇలాంటి కలలను ఎంతో శుభ పరిణామంగా భావించాలి. అంటే మీరు దేంట్లోనైనా పెట్టుబడి పెట్టుబడి పెట్టినప్పుడు మీకు త్వరలో మంచి ఫలితం రాబోతుందని అర్థం చేసుకోవాలి. అది సంపదైనా కావచ్చు లేదా సంబంధాలైన కావచ్చు. నల్ల మబ్బులు భారీ వర్షానికి సూచన. అంటే మీ రొమాంటిక్ లైఫ్ ఎంతో అపురూపంగా ఉంటుందని అర్థం. ఫలితంగా మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా సాగుతుంది.

కలలో కనిపిస్తేఎర్ర చీరలో స్త్రీ కలలో కనిపిస్తే… లక్ష్మీ దేవి దర్శనం ఇచ్చినట్లుగా అర్థం. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని అర్థం.

కలలో తమలపాకులు వచ్చాయంటే సంతోషం, సంపదతో పాటు జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం చేసుకోవాలి. కలలో తాంబులం తింటున్నట్లు వస్తే.. త్వరలో మీరు విజయాన్ని రూచి చూడబోతున్నారని అనుకోవచ్చు. అంతేకాకుండా తమలపాకులు తినడమనేది ఎంతో శుభ సంకేతం.

కలలో కనిపిస్తేకలలో జింక కనిపిస్తే మీకు ఉన్న ఉన్నత లక్ష్యాలని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్ధం. అనుకోకుండా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటాన్ని కూడా ఇది సూచిస్తుంది. కలలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉంది.

కలలో కనిపిస్తేకలలో చంద్రుడు కనిపిస్తే జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరంగా, సాఫీగా సాగిపోతుందని అర్థం. ప్రతి ఒక్కటి క్రమపద్ధతిలో జరుగుతుందని తెలుసుకోవచ్చు. కుటుంబంలో ఎలాంటి వివాదాలు, తగాదాలు లేకుండా సుఖంమైన జీవితంతో ప్రశాంతంగా ఉన్నారని అర్థం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR