ధర్మరాజు అహంకారం అణచడానికి శ్రీకృష్ణుడు చేసిన పని ఏమిటో తెలుసా

యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండు రాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. మహాభారతంలో మనకు తెలియని కథలెన్నో దాగి ఉన్నాయి జూదం ద్రౌపది వస్త్రాభరణం కురుక్షేత్ర యుద్ధం వీటినే చూపెడతారు. నిజానికి ఇప్పటి ఈ సమాజానికి కావాల్సిన నీతికథలు ఎన్నో ఉన్నాయి.

Lord Krishnaఅందులో ఒకటి ఇది పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరు లేరని ధర్మరాజు అభిప్రాయం ఇదే ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని ఒకరోజు వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు. ఆ రాజ్యాన్ని మహాబాల చక్రవర్తి పాలిస్తూ వచ్చారు అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది. ధర్మరాజు ఆమెతో ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని చెప్పడంతో ఆమె మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి వెళ్ళిపోయింది.

Lord Krishnaఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు. రాజా! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు. కృష్ణా మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉంది. అందరి దగ్గర సంపద బాగా ఉంది.

Lord Krishnaనా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందువల్ల దానధర్మాలకు ఇక్కడ స్థలం లేదు. ఇక్కడ ఎవరికీ ధానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.

Lord Krishnaతన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు. ఇక్కడ గమనించవలసిన నీతి ఏమిటంటే దానం ఇవ్వడం పుచ్చుకోవడంలో కుడా ఓ పరమార్ధం దాగి ఉంది. శ్రమ లేకుండా వచ్చిన ఆహారమే కానీ వస్తువే కానే ఎవరైతే ఉపయోగిస్తారో వారు శరీర అవయవాలు ఉండికుడా లేనివానితో సమానం.

Lord Krishnaఅంతే కాదు మహారోగితో సరి సమానం ఎవరి దగ్గరనైనా ఏది ఉచితంగా తీసుకున్నా వారికి ఋణగ్రస్తులం అవుతాము. కాబట్టి నీకు కావలసిన వస్తువు నీ శారీరక శ్రమతో సంపాదించుకుని అనుభవించే వాటికి ఎవ్వరికి రుణపడి ఉండవలసిన ఆవసరం ఉండదు. పైగా మానసిక సంతృప్తి. ఈ దర్మనీతిని గ్రహించిన వారు ఎవ్వరు ఎవ్వరి దగ్గర ఏది ఉచితంగా ఆశించరు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR