Home Unknown facts What Does Modern Science Say About ‘Kaliyuga’?

What Does Modern Science Say About ‘Kaliyuga’?

0

వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ప్రస్తుతం మనం ఉన్న యుగం కలియుగం. ఇక యుగాంతం తప్పదని ప్రళయం సంభవించి సృష్టి మొత్తం నాశనం అవుతుందని 2012 లో యుగాంతం అని కొందరు భావించిన 2012 లో ఎటువంటి ప్రళయం అనేది రాలేదు. మరి అసలు కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? యుగాంతం తప్పదా? కలియుగం ఎపుడు అంతం అవుతుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kaliyuga

యుగాలు మొత్తం నాలుగు కాగా ఒక్కో యుగం ఎప్పుడు ప్రారంభం, ఎప్పుడు అంతం, ఏ యుగంలో ఎలాంటి వారు నివసించేవారనే విషయాల గురించి కొందరు వివరించారు. ఇక కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు. సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు.

ఇది ఇలా ఉంటె, మన కాలమాన ప్రకారం కలియుగాంతం రావడానికి మూడు లక్షల సంవత్సరాలకు పైగా పడుతుంది. మనం ప్రకృతి పైన చేస్తున్న కాలుష్యం, హింస, దోపిడుల వల్ల సునామీలా వంటి అవాంతర జలప్రళయాలు సంభవించడానికి అవకాశం ఉంది. మాల్ ధూస్ సిద్ధాంతం ప్రకారం ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జనాభా తగ్గుతూ వస్తుంది. ఈ జగత్ సృష్టి ప్రారంభమై మన లెక్కలో ఒక కోటి యాభై ఐదు లక్షల, యాభై రెండు వేల కోట్ల సంవత్సరాలైంది. మనకి అప్పటికి తొమ్మిది ప్రళయాలు వచ్చి వెళ్లిపోయాయి. అంటే ఈ భూమి 9 వేల సార్లు సృష్టించబడింది అని చెబుతారు.

ఆధునిక విజ్ఞాన శాస్రం ప్రకారం, సృష్టి 1500 కోట్ల సంవత్సరాల నుండి ప్రారంభమైంది. భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాలైంది. మానవులు పుట్టి మూడు లక్షల సంవత్సరాలైంది. అందువలన ఏ లెక్క చూసినాకూడా కలియుగాంతానికి ఇంకా లక్షల సంవత్సరాలు ఉందని కొందరి వాదనగా చెబుతారు. ఇంకా కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని మరికొందరి వాదనగా చెబుతారు.

Exit mobile version