శరీరంలో ఫోలిక్ యాసిడ్ తగ్గితే ఏమవుతుంది?

శరీరం అనే వాహనం సరిగా నడవాలంటే ఎన్నో విటమిన్ లు, ఎన్నో ఖనిజాలు, పోషకాలు అవసరమవుతాయి. అలాంటి వాటిలో విట‌మిన్ బి9 కూడా ఒక‌టి. దీన్నే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. ఈ విట‌మిన్ లోపిస్తే ఎప్పుడూ నీర‌సంగా ఉంటారు. కొద్దిగా ప‌నిచేసినా తీవ్రమైన అల‌స‌ట వ‌స్తుంది. గుండె అసాధార‌ణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్యలు వ‌స్తుంటాయి.

b9 or folic acidత‌ల‌నొప్పి, ఏకాగ్రత లోపించ‌డం వంటి ఇత‌ర స‌మస్యలు కూడా వ‌స్తాయి. క‌డుపులో ఉన్న బిడ్డ స‌రిగ్గా ఎద‌గాలంటే ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను గ‌ర్భిణులు ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే క్యాన్సర్‌ రాకుండా, డీఎన్ఏ మార్పులు జ‌ర‌గ‌కుండా చూసేందుకు కూడా ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల కొత్త క‌ణాలు నిర్మాణం అవుతాయి. అందువ‌ల్ల ఫోలిక్ యాసిడ్ గ‌ర్భ‌వతుల‌కు మేలు చేస్తుంది.

head acheపుట్ట‌బోయే పిల్ల‌ల్లో లోపాలు రాకుండా చూస్తుంది. డిప్రెష‌న్‌ను త‌గ్గిస్తుంది. పుట్టబోయే పిల్లల్లో మెద‌డు, వెన్నెముక స‌మ‌స్యలు రాకుండా ఉండాలంటే గ‌ర్భిణులు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. ​కొలెస్ట్రాల్ లెవల్స్ త‌గ్గుతాయి. ఎర్ర ర‌క్త క‌ణాలు ఏర్ప‌డుతాయి. ఇలా ఫోలిక్ యాసిడ్ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

pregnant women​క‌నుక ఎవ‌రైనా స‌రే.. ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో ఈ విట‌మిన్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. ఫోలిక్ యాసిడ్ మ‌న‌కు రోజుకు 400 మైక్రోగ్రాముల వ‌ర‌కు అవ‌స‌రం. అదే గ‌ర్భిణీల‌కు అయితే 600 నుంచి 800 మైక్రోగ్రాముల వ‌ర‌కు అవ‌స‌రం అవుతుంది. ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా గుడ్లు, బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్‌, బీట్ రూట్‌, ట‌మాటా, అవ‌కాడో, లివ‌ర్, క్యాబేజీ వంటి వాటిల్లో ల‌భిస్తుంది.

avocadoపాల‌కూర‌, బ్రొకోలి, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు, ప‌ప్పు దినుసులు, నిమ్మకాయలు, అర‌టి పండ్లు, పుచ్చకాయలు, తృణ ధాన్యాల్లో మ‌న‌కు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ​అయితే అన్నింటిక‌న్నా ఎక్కువ‌గా ఫోలిక్ యాసిడ్ మ‌న‌కు రాజ్మా విత్త‌నాల్లో ల‌భిస్తుంది. 100 గ్రాముల రాజ్మా విత్త‌నాలను ఇంటే మ‌న‌కు 20 గ్రాముల ప్రోటీన్లు ల‌భిస్తాయి. 300 క్యాల‌రీల శ‌క్తి వ‌స్తుంది. అలాగే 316 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ ల‌భిస్తుంది. అందువ‌ల్ల రాజ్మాను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

kidney beansఇక ఫోలిక్ యాసిడ్ శ‌న‌గ‌లు, పెస‌ల‌లోనూ లభిస్తుంది. వీటిని కూడా త‌ర‌చూ తీసుకోవ‌చ్చు. కానీ ఎక్కువ మొత్తంలో ల‌భించాలంటే మాత్రం రాజ్మాను తీసుకోవాలి. చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా రాజ్మా త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి. పైగా ఫోలిక్ యాసిడ్‌, ప్రోటీన్లు కూడా ఉంటాయి. క‌నుక ఇవి ఫోలిక్ యాసిడ్‌కు అత్యుత్త‌మ‌మైన ఆహారం అని చెప్ప‌వ‌చ్చు.

chickpeasరాజ్మాలలో ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణ స‌మస్య‌లు త‌గ్గుతాయి. రాజ్మా విత్త‌నాల‌ను రోజూ నీటిలో నాన‌బెట్టి త‌రువాత ఉడికించి తిన‌వ‌చ్చు. లేదా కూర‌ల్లోనూ వేసుకోవ‌చ్చు. ఏవిధంగా తీసుకున్నా వాటితో లాభాలే క‌లుగుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR