అరచేతిలో ఈ గుర్తులు ఉంటే ఏమవుతుందో తెలుసా?

లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సిరిసంపదలు ప్రతి ఇంటా వెల్లి విరియాలంటే ఆ దేవిని ఆరాధించడంతో పాటు అమ్మవారి ఆగ్రహానికి గురికాకుండా ఉండాలి. ప్రశాంతత ఉన్న గృహంలోనే లక్ష్మీదేవి తాండవిస్తుందని నమ్ముతారు.
శాస్త్రాలలో సాముద్రిక శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ శాస్త్రంలో వ్యక్తి అరచేతిలోని గీతలను బట్టి వారి భవిష్యత్తును తెలియజేస్తుంటారు. ఈ గుర్తుల ఆధారంగా వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురౌతాయి, ఆర్థికంగా ఎలా ఉంటారు అన్న విషయాలను గురించి సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది.
అరిచేతిలో ఇలాంటి గుర్తులు ఉండడం వల్ల ఆర్థికంగా ఎంతో ఎదగడమే కాకుండా, సమాజంలో మంచి గుర్తింపు పొందుతారని తెలియజేస్తుంది.అయితే మన అరచేతిలో ఎలాంటి గుర్తులు ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
  •  స్వస్తిక్ గుర్తు:

కొందరి అరిచేతిలో ఇలాంటి స్వస్తిక్ గుర్తు ఉంటే వారిపై సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఉంటుందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇలాంటి వారు వారి జీవితంలో ఏ చిన్న పని తలపెట్టినా, ఎంతో ఆర్థికంగా రాణిస్తారు. వీరు ప్రారంభించిన పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు.

p-alms

  • త్రిశూలం గుర్తు:

ఏ వ్యక్తుల చేతిలో త్రిశూలం గుర్తు ఉంటుందో వారిపై ఆ శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి వారు సమాజంలో పేరు ప్రతిష్టలతో కీర్తి చెందుతారు. త్రిశూలం గుర్తు చేతిలో అంగారక పర్వతంపై ఉంటే వారికి శివయోగం అధికంగా ఉండటం వల్ల వారి జీవితంలో డబ్బు కొరత ఉండదు.

Palms

  • కమలం గుర్తు:

చేతిలో కమలం గుర్తు ఉండటం ద్వారా వారిపై ఆ విష్ణు దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. చేతిలో కమలం గుర్తు ఉన్నవారు అధికంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు.
  • ఖడ్గం గుర్తు:

ఎవరి చేతిలో ఖడ్గం గుర్తు ఉంటుందో వారిపై సకల దేవతల అనుగ్రహం కలిగి ఉంటుంది. అమ్మవారికి ఖడ్గం ఒక ఆయుధంగా ఉంటుంది. కాబట్టి వీరు చేసే ఏ పనినైనా ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలరు.
అంతేకాకుండా వీరికి జీవితంలో ఎదురయ్యే ఇలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలరు. చేతిలో ఈ గుర్తు కలిగినవారు ఎంతో మందికి ఉదాహరణగా నిలుస్తారు

Palms

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR