దీపావళి రోజు నువ్వుల నూనెతో స్నానం చేస్తే ఏమవుతుంది?

దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి నువ్వుల నూనెను ఒంటినిండా శుభ్రంగా పట్టించి, దానిని శెనగపిండితో రుద్దుకుని.. పావు గంట అలానే వుండి.. తలంటు స్నానం చేయాలి. దీపావళి నాటి నుంచి ఇక చలికాలం మొదలైపోతుంది.

దీపావళి రోజు నువ్వుల నూనెతో స్నానంఒంట్లోని రక్తప్రసరణ వ్యవస్థ సరిగా లేకుంటే, వచ్చే చలికాలంలో ఇబ్బందులు తప్పవు. అందుకే శరీరభాగాలు మొద్దుబారిపోకుండా వుండేందుకు.. నూనెను పట్టించి.. అభ్యంగన స్నానం చేస్తారు. ఇలా తలస్నానం చేయడం వలన కంటి ఎలాంటి హాని చేకూరదని, వృద్ధాప్యంలో కంటి సమస్యలే రావని చెప్తుంటారు.

దీపావళి రోజు నువ్వుల నూనెతో స్నానందీపావళి అభ్యంగనం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నువ్వుల నూనెను తల మాడుకు, శరీరానికి రాసుకుని.. ఆయిల్ మసాజ్‌ చేసుకుని అరగంట లేదా 15 నిమిషాల పాటు ఆ నూనంతా శరీరం పీల్చుకున్న తరువాత వేనీళ్లతో కుంకుడు కాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేయాలి.

దీపావళి రోజు నువ్వుల నూనెతో స్నానంఇంకా దీపావళి రోజున నువ్వులనూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటారని పెద్దలు చెప్తుంటారు. నువ్వులనూనె సాంద్రత ఎక్కువగా ఉండి వేడి కలిగించే గుణంతో ఉంటుంది. ఇక శెనగపిండికి చర్మానికి ఉండే స్వేదరంధ్రాలను శుభ్రపరిచే స్వభావం ఉంది. అందుకే దీపావళి రోజున నూనెతో శరీరానికి మర్దన చేసి అభ్యంగన స్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

దీపావళి రోజు నువ్వుల నూనెతో స్నానంఅలాగే నరకచతుర్దశి నాటి నుంచే, ఇళ్లల్లో, ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. ఆ దీపం నుంచి వెలువడే పొగ ఆరోగ్యానికి మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే ఈ పండుగ నాడు ఇలా చేస్తే.. నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR