Home Life Style What If Corona Is A Human And Talks To Us; An Eye...

What If Corona Is A Human And Talks To Us; An Eye Opening Take

0

హలో అండీ.. నా పేరు కరోనా…!

గత కొన్ని రోజుల నుండీ ప్రపంచ దేశాలను, ఆ దేశాలలో ఉన్న ప్రజలను గజ గజ వణికిస్తూన్నది నేనే..! మీ మనుషులు అంతా చాలా మేధావులు అనుకుంటారు కదా… కాదు తప్పని నిరూపించాడానికే అప్పుడు…అప్పుడు ఇలా వైరస్ల రూపంలో మేము మీకు సవాల్ విసురుతుంటాము.

1 Corona

ఇంతకీ ఈ సవాల్ వల్ల మాకు ఒరిగేది ఏం ఉంది అనుకుంటున్నారు కాదా…? అదే చెప్పబోతున్నా కొంచెం ఆగండి…!

అసలు నేను ఏలా పుట్టాను ? నా వల్ల మీ మనుషులు ఎందుకు ఇలా పిట్టల్లా రాలిపోతున్నారు ? నన్ను ఆపడానికి మేధావులు అని చెప్పుకునే.. ఈ మనిషి ఎందుకు ఏమి చేయలేకపోతున్నాడు ?

నేను ఏలా పుట్టానో తెలుసుకోడానికి అన్ని దేశాలు, శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నాలు లేవు ? ఈ గ్యాప్ లో నేను ఎంత నష్టం చేయాలో చేశాను ఇంకా చేస్తున్నాను. కొందరు అంటున్నారు నేను మనిషి కనిపెట్టిన వైరస్ అని అంటున్నారు… ఇంకొందరు చైనీస్ ప్రజలు అడ్డమైన గడ్డి తినడం వల్లే నేను పుట్టాను అంటున్నారు. సరే ఈ రెండిట్లో ఒకటి లేదా.. రెండూ కాదు అనుకుందాం. కానీ కచ్చితంగా ఒక్కటి అయితే చెప్పగలను మీ మనుషుల వల్లే నేను పుట్టాను.

ఇలా ఒక వైరస్ పుట్టి…మీ మనుషులతో ఆడుకోవడం ఇదేమి కొత్త కాదు. 2014 లో వచ్చిన మా పెద్దన్న Ebola , 2002 లో వచ్చిన మా చెల్లి SARS CoV, 2019 లో వచ్చిన మా తమ్ముడు SARS CoV – 2 మీ మనుషులతో ఫుట్ బాల్ ఆడుకున్నాయి. ఇప్పుడు వచ్చిన కరోనా లాగే మా పెద్దన్న, చెల్లి కూడా మీ మనుషుల వల్ల పుట్టినవే..! మా పెద్దన్న Ebola వల్ల ఆఫ్రికా మరియు ఇతర దేశాల్లో అప్పట్లో 11,325 మంది చనిపోయారు. ఆ తరువాత మా చెల్లి SARS CoV వల్ల 2000 మంది చనిపోయారు.

ఇప్పుడు నేను…! ఇలా మా వైరస్ ల రూపంలో ఎన్నివచ్చినా మీ మనుషులు మారడం లేదు, పద్దతిగా మంచి తిండి తినాలంటే వినరు, వైరస్ ఏదైనా వస్తే వెంటనే చికెన్ రేట్స్ తగ్గిస్తారు, వైరస్ ప్రభావం ఉన్న అన్ని రోజులు హడావిడి చేస్తారు మళ్ళీ తరువాత అంత యదావిధమే. అంత ఎందుకండీ…నేను ఇంత వైరల్ అవుతున్నా.. తక్కువ ధరలకే హోటల్స్, ఫ్లైట్స్, ఉంటున్నాయి అని చెప్పి మంచిగా టూర్స్ కి వెళ్తున్నారు. ఇంకా కొందరు ఏమో నా పేరు చెప్పుకుని మాస్కులు, శానిటైజేర్స్ లాంటివి డబుల్ రేట్ కి అమ్ముకుంటున్నారు. ఇంకా కొందరు చికెన్ రేట్ తగ్గింది అని చెప్పి కిలోలు, కిలోలు చికెన్ తెచ్చుకుని తిని పండుగ చేసుకుంటున్నారు. కొందరు తినాలని ఉన్నా.. ప్రాణ భయంతో తినడం లేదు.మనిషి అంటే ఆశావాది అని చెప్పడానికి ఇంత కంటే పెద్ద ఉదాహరణ ఏం ఉంటది చెప్పండి.

ఇంత జరురుగుతున్నా…మన వంతు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారా అంటే ? అబ్బె మనకి అంత టైం ఎక్కడుంది…కనీసం మాస్కస్ వేసుకుని, చేతులు సరిగ్గా కడుక్కుంటే నేను మీ జోలికి కూడా రాను. కానీ ఇవి చేయడం మానేసి కరోనా గో అని ఒకడు, కరోనా మీద భజన పాటలు పడేవాళ్ళు ఇంకొందరు…ఆ బొక్కలే ఈ కరోనా మమ్మల్ని ఏం చేస్తుంది అనేవాళ్ళు ఇంకొందరు.

నేను కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాను కానీ మీ మనుషులు…మళ్ళీ ఇలాగే ప్రకృతికి విరుద్దంగా ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. అందుకే మా లాంటి కంటికి కనపడని వైరస్లు వస్తూనే ఉంటాయి మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఉంటాయి.

సో, నేను చెప్పేది ఏంటంటే.. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రకృతిని పద్దతిగా వాడుకొని, మనిషి మనుగడ మాత్రమే కాదు కొన్ని జంతువులు, చెట్లు వాటి రక్షణ కూడా చాలా అవసరం…! కాదు కూడదు అంటే… మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది…మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది !

Exit mobile version