పసుపు కుంకుమలు కింద పడితే???

మంగళ వారం కుజునికి సంకేతం . కుజుడు ధరిత్రి పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారంనాడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు.

kujuduసాధారణంగా మంగళవారం రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇలా జరగడం వల్ల అశుభమని అంటారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం పసుపు, కుంకుమ కింద పడితే ఏదో అశుభం జరుగుతుందని భావిస్తుంటారు.

turmeric and kumkumaఅయితే అది కేవలం అపోహ మాత్రమేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళవారం, శుక్రవారం పసుపు, కుంకుమలు కింద పడితే అది శుభ సూచికంగా భావించాలని పండితులు చెప్తున్నారు.

మంగళవారం అనుకోకుండా లేదా పిల్లలు ఆడుకుంటూ పసుపు కుంకుమలను కిందకి పడేస్తూ ఉంటారు. ఆ రోజంతా మన మనసు కీడును శంకిస్తూ ఉంటుంది.

turmericపసుపు కుంకుమ కింద పడటం వల్ల ఏదైనా అశుభం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని పసుపు, కుంకుమ కింద పడటం వల్ల శుభం కలుగుతుంది.

పసుపు కుంకుమ కింద పడటం వల్ల సాక్షాత్తు భూదేవి మాతకు పసుపు, కుంకుమలను ఇచ్చినట్లు. మన ఇంటికి ఎవరైనా ఆడపడుచు వస్తే పసుపు కుంకుమలు ఇస్తారు.
అలాగే పసుపు కుంకుమ కింద పడినప్పుడు భూదేవి మాతకు తనకు కుంకుమ పెట్టమని సంకేతం. కుంకుమ పడిన చోట కొద్దిగా బొట్టు పెట్టి, మిగిలిన కుంకాని ఎవరూ తొక్క నటువంటి ప్రదేశంలో పెట్టాలి .

home warmingమన ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా వ్రతం నిర్వహించేటప్పుడు కుంకుమ కింద పడితే అది శుభకరం. అమ్మవారు తనకు తానుగా మన చేత బొట్టు పెట్టించుకున్నట్లుగా భావించాలి.

ఇంతటి అదృష్టం భాగ్యాన్ని ఎప్పుడు కూడా దురదృష్టమని భావించకూడదు. మన ఇంటికి వచ్చే సుమంగళి కి బొట్టు పెట్టి పంపించాలి.

bottu for womenమంగళవారం రోజున ఎవరి నుంచి డబ్బులు తీసుకోకూడదు. మనకు ఏవైనా అప్పులు ఉంటే మంగళవారం తీర్చడం ద్వారా జీవితంలో ఎప్పుడు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR