Home Health అరోమాథెరపీ అంటే ఏమిటి ? దాని వలన కలిగే ప్రయోజనాలు

అరోమాథెరపీ అంటే ఏమిటి ? దాని వలన కలిగే ప్రయోజనాలు

0

ఎన్నో రుగ్మతలు తగ్గించడమే కాదు మానసిక వ్యాధులను, ఒత్తిళ్లను తగ్గించడానికి సైతం మన పూర్వికులు ఆయుర్వేద వైద్యంలో అరోమాథెరపీని కనిపెట్టారు. కానీ ఈ పద్దతిని మనకంటే విదేశాలలోని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 21వ శతాబ్దంలో అరోమాథెరపీకి డిమాండ్ పెరుగుతోంది. ఇది చాలా సింపుల్‌గా… ఇంట్లోనే ఎవరికి వారు చేయదగ్గ థెరపీ. దీని వల్ల మంచి ఫలితాలు వస్తుండటంతో… దీన్ని ఫాలో అవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది.

Aromatherapy And Their Benefitsఅరోమాథెర‌పీ అంటే సువాస‌న‌ల‌తో వ్యాధుల‌ను చేసే పద్దతి. ఈ పద్దతిలో మనసులని ప్రశాంతపరిచే సువాసనాలని మనం పీల్చేలా చేస్తారు. అప్పుడు మ‌న‌స్సుకు ప్ర‌శాంతంగా, హాయిగా అనిపిస్తుంది. రిలాక్సేష‌న్ క‌లుగుతుంది. దీంతోపాటు మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది. ఇలా అనేక మానసిక రోగాలని తగ్గిస్తున్నారు.

ఈ అరోమాథెర‌పీ కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం వంటలలో విరివిగా ఉపయోగించే బిర్యానీ ఆకుని ఉపయోగించి మానసిక ప్రశాంతతని పొందవచ్చు. సాధారణంగా మనం బిర్యానీ రైస్ చేసేటప్పుడు ఈ ఆకులని ఉపయోగిస్తాం. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించటం వలన బిర్యానీకి ఒక రకమైన రుచి, వాసన వస్తాయి.

అలాగే ఇంకొంతమంది ఈ ఆకులని వేడినీటిలో వేసుకొని స్నానం కూడా చేస్తారు. కానీ ఈ బిర్యానీ ఆకును ఆహారంలోనే కాకుండా ఇంటి చుట్టూ ఉన్న గాలిని శుభ్రపరచడానికి మరియు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ బిర్యానీ ఆకు మనకి అరోమాథెర‌పీలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బిర్యానీ ఆకులో సువాసనని వెదజల్లే పోషకాలు ఉంటాయి.

మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకుల‌ను తీసుకుని ఒక గ‌దిలో పొగ వచ్చేలా కాల్చి బయటకు వచ్చి త‌లుపులు పెట్టేయండి. అలా ఒక 10 నిమిషాల పాటు అలాగే త‌లుపులు మూసి ఉంచితే ఆ పొగంతా రూమ్‌లో వ్యాపిస్తుంది. తరువాత గదిలోకి రూమ్‌లోకి వెళ్లి చూస్తే చ‌క్కని సువాస‌న వ‌స్తుంది. ఆ వాస‌న‌ను పీల్చితే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. కొద్ది సమయంలోనే ఒత్తిడి, ఆందోళ‌న అంతా మటుమాయం అవుతుంది.

అంతేకాదు గ‌ది అంతా సువాస‌నా భరితంగా ఉంటుంది. దోమ‌ల వంటి పురుగులు ఏవైనా ఉంటే పారిపోతాయి. ప్రస్తుతం ఈ పద్దతిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. బిర్యానీ ఆకులో యూజీనాల్ మరియు మైర్సిన్ అనే రెండు సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి బిర్యానీ ఆకులను కాల్చిన తరువాత, దాని వాసన మెదడు యొక్క నరాలను సడలించి, ఉద్రిక్తతను తొలగిస్తుంది.

బిర్యానీ ఆకులో లినూల్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి ఒత్తిడిని వదిలించుకోవడానికి ఇది సరళమైన మార్గం. ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది. బిర్యానీ ఆకుల తేలికపాటి పొగ అలెర్జీ బాధితులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ముక్కు మరియు గొంతులోని మంటను తొలగిస్తుంది. అయితే బిర్యానీ ఆకును ముక్కు దగ్గర కాల్చకూడదని, దాని పొగను నేరుగా పీల్చకూడదని గుర్తుంచుకోండి.

 

Exit mobile version