Home Health కొలొస్ట్రమ్ అంటే ఏమిటి? పసి బిడ్డలకు కచ్చితంగా ఇవ్వాలా ?

కొలొస్ట్రమ్ అంటే ఏమిటి? పసి బిడ్డలకు కచ్చితంగా ఇవ్వాలా ?

0

తల్లిపాలు బిడ్డకు దీర్ఘాయుష్షునిచ్చే అమృతం లాంటివి. బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లిపాలను తాగిస్తే ఆ బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పిల్లల్లో పెరుగుతుంది. అందుకే బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలనే పట్టించాలని మన పెద్దలు వారి అనుభవపూర్వవకంగా చెబుతారు. ఎందుకంటే వారికి వాటి విలువ తెలుసు కాబట్టి. కాని నేటి తరం ఆడవారు మాత్రం వారి పాలను ఇవ్వకుండా పోత పాలకు అలవాటు చేస్తున్నారు. దీని వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీనిపై అవగాహనా రాహిత్యం, పని వత్తిడి, మారుతున్న కాలానుగుణం వస్తున్న మార్పులూ కారణాలు కావొచ్చు.

mothers milk for baby‘తల్లి ప్రసవించిన తరువాత వచ్చే పాలను ముర్రు పాలు’ అంటారు. దీనిని ‘కొలొస్ట్రమ్’ అని కూడా అంటారు. బిడ్డకు జన్మనిచ్చిన రెండు, మూడు రోజులు ఈ పాలు తయారవుతాయి. బిడ్డ పుట్టిన అరగంట లోపలే ముర్రు పాలను శిశువుకు తాగిపిస్తే బిడ్డ దీర్ఘ్ఘకాలం, ఆరోగ్యం, అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ ముర్రు పాలు సాధారణ పాలు కంటే రెట్టింపు పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో పోషకాలు అధికంగా ఉండటమే గాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా కలిగి ఉంటంది.

ఖర్చులేని పద్ధతి కావడంతో తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి బిడ్డకి మధ్య మంచి సంబంధం, ప్రేమ, అభిమానం, అప్యాయత పెరుగుతుంది. శిశువుకి తన పాలు ఇవ్వడం వలన తల్లి శరీరంలో ‘ఆక్సిటిసిన్’ హార్మోను విడుదల వుతుంది. గర్భాశయం ప్రసవం తరువాత తొందరగా సహజ పరిమాణానికి తగ్గడానికి ఈ హార్మోను సహయపడుతుంది. తరుచుగా శిశువుకు పాలు ఇవ్వడం వలన రొమ్ములు గడ్డ కట్టవు, నొప్పి ఉండవు, స్థూలకాయం ఏర్పడటం తగ్గుతుంది.

ముఖ్యంగా ముర్రుపాలలో ఎక్కువ ఖనిజాలు, విటమిన్లు, ముఖ్యంగా ఎ,డి,బి12 విటమిన్లు, రోగకారక క్రమ నిరోధకలు ఉంటాయి. అంతే గాకుండా తల్లిపాల వలన మెదడు,నేత్రాల నిర్మాణం అభివృద్ధికి సహాయపడతాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు అలర్జీలు, పేగుల్లో రుగ్మతలు, న్యూమోనియా, మూతసంబంధిత వ్యాధులనుంచి రక్షణ పొందవచ్చు. బిడ్డ పుట్టిన పటినుంచి ఆరునెలలకాలం తల్లిపాలు సంపూర్ణ ఆహారంగా పని చేస్తాయి.

బిడ్డ పుట్టిన అరగంట లోపు ముర్రుపాలు తాగిస్తే బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతారని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు తాగిన పిల్లలకు తెలివితేటలు బాగుంటాయి. అంటువ్యాధుల నుంచి రక్షించడమే కాదు మలబద్దకం కూడా తగ్గుతుంది. బాల్యంలో యవ్వనంలో ఉబకాయం వ్యాధుల నుంచి సంరక్షణ ఉంటుంది. పుట్టిన బిడ్డకు చనుపాలు ఇవ్వటంతో రక్తస్రావ ప్రమాదం తగ్గి తల్లి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.

అంతేకాదు తల్లిపాలు బిడ్డ అవసరాలకు అనుగుణంగా తమలోని పోషకాల్ని మార్చుకుంటాయి. మొదటి నాలుగురోజులు ముర్రుపాలు వస్తాయి. ఇవి బిడ్డకు పోషణ, రక్షణ కల్పిస్తాయి. నాలుగోరోజు నుంచి రెండు వారాల వయసు వరకూ ల్యాక్టోజ్, కొవ్వులు ఎక్కువగా ఉన్న పల్చటి పాలుగా మారిపోతాయి. ఇక రెండో వారం తరువాత 90% నీరు.. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు 8%.. ఖనిజాలు, విటమిన్లు 2% కలిగిన సంపూర్ణ పోశాకాహారంగా మార్పు చెంది బిడ్డ తదుపరి ఎదుగుదలలో ముఖ్య భూమిక పోషిస్తాయి.

జంతువుల పాలలో కూడా మానవ కొలొస్ట్రమ్తో సమానంగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, వ్యాధులతో పోరాడే ప్రోటీన్లు, గ్రోత్ హార్మోన్లు మరియు జీర్ణ ఎంజైమ్లు సమృద్ధిగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తాయి, ఇన్ఫెక్షన్తో పోరాడతాయి మరియు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే మామూలు ఆవు పాలు కంటే ప్రోటీన్, కొవ్వు, పిండి పదార్థాలు, మెగ్నీషియం, బి విటమిన్లు మరియు విటమిన్లు ఎ, సి మరియు ఇ లు తల్లి పాలలో ఎక్కువగా ఉంటాయి.

Exit mobile version