అంతర్ వ్యాయామం ఎలా చేయాలి ? దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0
208

వ్యాయామం చేసేటప్పుడు బాహ్య శరీరంపై మాత్రమే ప్రభావం పడుతుంది. లోపలి దేహానికి అనగా అంతర వ్యాయామం గురించి చాలా మందికి అవగాహన ఉండదు. కపాలభాతి అనేది బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు.

cranial exerciseకపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది.

cranial exercise‘కపాలం’అంటే మస్తిష్కం లేదా మెదడు.’భాతి’అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపచేసే క్రియ కాబట్టి దీనిని కపాలభాతి అంటారు. ఇది షట్‌క్రియల్లో ఒకటి అయినప్పటికీ ప్రాణాయామంలో భాగంగానూ సాధన చేయవచ్చు. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం.

cranial exerciseమరి ఈ వ్యాయామం ఎలా చేయాలో, దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

 • ఈ భంగిమను ప్రారంభించటానికి ముందుగా ఒక సౌకర్యవంతమైన స్థానంలో కూర్చొవాలి. అలాగే వెన్నెముకను నిటారుగా ఉంచి, ఉదరాన్ని సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంగా ఉంచాలి.
 • మోకాళ్ళ మీద అరచేతులను ఉంచాలి.
 • పొట్ట కింద బాగంలో దృష్టి పెట్టాలి. మంచి పరిపూర్ణత సాధించడానికి అరచేతులను మోకాళ్ళ మీద నుంచి పొట్ట కింద బాగంలో పెట్టి, తగ్గిపోతుంది.

కపాలభాతి చేయాలి.

 • ఇప్పుడు ముక్కు రెండు రంద్రాల ద్వారా లోతైన శ్వాసను తీసుకోవాలి.
 • ఇప్పుడు అరచేతులతో పొట్టను శాంతంగా నొక్కి శ్వాసను నియంత్రించాలి.
 • గాలిని పీల్చటం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అందువల్ల గాలిని వదిలే క్రమం మీద దృష్టిని కేంద్రీకరించాలి.
 • మొదట 60 నుంచి 70 శ్వాసలతో ప్రారంభించాలి. ఆ తర్వాత 95 నుంచి 105వరకు నిదానంగా పెంచుకుంటూ . ఊపిరి అడనట్టు అన్పిస్తే, ఆపి సాదారణ శ్వాస తీసుకోని మరల ప్రారంభించవచ్చు.
 • ఈ ఆసనం వేసేటప్పుడు నోరు,ముక్కు రెండు అవయవాలు పనిచేస్తాయి. ముక్కు గాలి పీల్చుకోవటానికి మరియు నోరు గాలిని వదలటానికి సహాయపడుతుంది. ఇలా రోజు 15 నుంచి 20 నిమిషాల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

cranial exerciseఈ వ్యాయామం ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.

 • కాపాలభాతి సాధన చేయడం వలన మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి.
 • శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది.
 • ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది.
 • జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి.
 • సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి.
 • కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది.

cranial exerciseఅయితే హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా కపాలభాతి సాధన చేయరాదు.

 

SHARE