డీ హైడ్రేషన్ అంటే ఏమిటి ? దాని లక్షణాలు

వేసవిలో ఎండా వేడి ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి డీహైడ్రేషన్ వస్తూ ఉంటుంది. అసలు డీ హైడ్రేషన్ అంటే ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరంలో నీరు దాదాపుగా 60% వుంటుంది. ఎండలో తిరిగినప్పుడు, వాంతులు విరేచనాలు వచ్చినప్పుడు మన శరీరంలో నీటి పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీనినే డీ హైడ్రేషన్ అంటాము.

de hydrationడీహైడ్రేషన్ కు గురైనప్పుడు మూత్రం ముదురు పసుపు రంగులో వస్తుంది. అంతేకాకుండా మంటగా కూడా ఉంటుంది.

నోరంతా పొడిబారినట్లు, నాలుక తడారిపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డీ హైడ్రేషన్ ఉన్నట్లు గుర్తించాలి.

de hydrationచాలామంది శారీరిక శ్రమ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో చెమట ఎక్కువగా పడుతుంది. అలా కాకుండా చెమట నిలిచిపోతే డీహైడ్రేషన్ కు గురయినట్లు గుర్తించాలి.

తీవ్రమైన అలసట, ఎక్కువగా నిద్ర పోవాలనే కోరిక ఇవి కూడా డీహైడ్రేషన్ లక్షణాలు.

తలనొప్పితో కూడా ఎక్కువ బాధ పడుతున్నప్పుడు డీహైడ్రేషన్ కి గురి అయినట్లు గుర్తించాలి.

de hydrationకండరాల తిమ్మిర్లు, శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిల సమతుల్యతకు కారణం అనుకుంటారు. కానీ డీహైడ్రేషన్ కు అది ఒక గుర్తు.

చర్మము సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు గుర్తించి. నీళ్లు బాగా తాగాలి.

de hydrationకంటి చూపు సరిగా కనపడకపోయినా డీహైడ్రేషన్ ఉన్నట్లు గుర్తించాలి.

వీటిని అధిగమించటానికి తగినంత నీటిని తీసుకోవాలి. వాటితో పాటుగా ఎలక్ట్రోలేట్ లాంటి ఓరల్ సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. దాంతో డీహైడ్రేషన్ ను అధిగమించవచ్చును.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR