డయాబెటిక్‌ రెటినోపతి అంటే ఏమిటి? ఎలా గుర్తించాలి?

ప్రస్తుతమున్న ఆర్టిఫిషల్ జీవితాల్లో ప్రతీ ఇరవై మందిలో ఒకరికి డయాబెటిస్ ఉంటుంది. వంశపారపర్యంగా, టెన్షన్‌, సరైన నిద్ర లేకపోవడం ఇంకా ఎన్నో కారణాల వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది వ్యాపించిందంటే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం, అలాగే డాక్టర్‌ సూచించిన విధంగా పాటిస్తే ఎప్పటికి అదుపులో ఉంచుకోవచ్చు.

diabetesఒకసారి షుగర్ కనిపిస్తే దాన్ని పూర్తిగా తగ్గించే మార్గం లేదు. అదుపులో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా నయం చేసే మార్గం లేదు. రక్తంలోని చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇన్సులిన్ తక్కువగా విడుదల కావడం.. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు అలాగే పెరిగిపోతూ ఉండడం ఈ సమస్యకు ముఖ్య కారణమని వైద్యులు చెబుతున్నారు.

no to sugarడయాబెటిస్‌1, టైప్‌-2 కలిగిఉన్న దాదాపు 25 శాతం మందిలో రక్తంలో అధిక చక్కెరల స్థాయితో పాటు కంటి సమస్యలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ‘డయాబెటిక్‌ రెటినోపతి’. మిగతా ఏదైనా అవయవానికి లోపం వస్తే కొద్దో గొప్పో సమస్యను మేనేజ్‌ చేయవచ్చేమోగానీ కంటికి వచ్చే సమస్యలతో అంతా అంధకారమైపోతుంది.

diabetic retinopathyఅందుకే డయాబెటిస్‌ ఉన్నవారు అన్ని అవయవాల విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నప్పటికీ కంటి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. షుగర్‌వ్యాధి ఉన్న ప్రతివారూ తమ రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవడం ఎంతముఖ్యమో డయాబెటిక్‌ రెటినోపతిపై అవగాహన పెంచుకోవడమూ అంతే ప్రధానం. అందుకు ముందుగా డయాబెటిక్‌ రెటినోపతి అంటే ఏమిటో తెలుసుకోవాలి.

అది తెలుసుకోవాలంటే అసలు మన కళ్ల వెనుక ఏం జరుగుతుంది. మనం ఎలా చూడగలుగుతున్నామనే విషయం అర్థం చేసుకోవాలి. మన కంటి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. అక్కడి నుంచి ఆ ఇమేజ్‌ మెదడుకు చేరడం వల్ల మనకు చూడటం అనే ప్రక్రియ సాధ్యమవుతుంది.

retinaకంటికి వెనక ఉన్న రెటినా తెరకు అత్యంత సన్నటి రక్తనాళాల(క్యాపిల్లరీస్‌) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. డయాబెటిస్‌ నియంత్రణ లేనివారిలో ఈ క్యాపిల్లరీస్‌ ఉబ్బడం జరుగుతుంది. దీన్నే మైక్రో అన్యురిజమ్‌ అంటారు. కొందరిలో క్యాపిలరీస్‌ మూసుకుపోతాయి. క్యాపిలరీస్‌ మూసుకుపోయినప్పుడు రెటినాకు కావాల్సిన పోషకాలు, ఆక్సిజన్‌ అందవు. అప్పుడు రెటీనా సరిగా పనిచేయదు.

capillariesమైక్రో అన్యురిజమ్స్‌ లీక్‌ అయినప్పుడు ఎగ్జుడేట్స్‌ అనే పదార్థం రెటినాలో పేరుకుపోతుంది. దీనివల్ల రెటినా ఉబ్బతుంది. ప్రధానంగా మాక్యులా అనే మధ్యభాగంలో ఈ ఉబ్బు ఎక్కువగా ఉంటుంది. దీన్నే డయాబెటిక్‌ మాక్యులార్‌ ఎడిమా అంటారు. రక్తనాళాలు మూసుకుపోయినవారిలో అసాధారణమైన అవాంఛిత కొత్తరక్తనాళాలు పెరుగుతాయి. ఈ కొత్త రక్తనాళాల నుంచి మాటిమాటికీ రక్తస్రావం జరుగుతుంటుంది.

dmeఈ రక్తం రెటినాలోనూ, విట్రియస్‌ అనే జెల్‌లోనూ స్రవిస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా చూపు తగ్గిపోతుంది. ఈ రక్తస్రావం రెటినాలోగానీ, విట్రియస్‌లో గానీ కొంతకాలం అలాగే ఉంటే రెటినా ఊడే ప్రమాదం ఉంది. దీన్నే ‘రెటినల్‌ డిటాచ్‌మెంట్‌’ అంటారు. క్రమేణా ఈ కొత్తరక్తనాళాలు కంటి ముందుభాగానికి వచ్చినప్పుడు నియోవాస్కులార్‌ గ్లకోమా అనే ప్రమాదకరమైన గ్లకోమా వస్తుంది. రెటినల్‌ డిటాచ్‌మెంట్‌ వల్లగానీ లేదా గ్లకోమా వల్లగానీ చాలామంది తమ చూపును పూర్తిగా కోల్పోతారు.

neovascular glaucamaఅయితే డయాబెటిక్‌ రెటినోపతి లక్షణాలు మొదటి దశలో కనిపించవు. ఇలాంటి అసాధారణ, అవాంఛిత రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, అది కంటిలోని విట్రియస్‌ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు ఈ కండిషన్‌ను తొలిసారి గుర్తించడం సాధ్యమవుతుంది. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగా, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగాగానీ లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా గాని కంటిచూపు పోవచ్చు.

ఎక్కువ కాలం మధుమేహం ఉన్న వ్యక్తులు, డయాబెటిస్‌ లక్షణాలు ఉన్న గర్భిణీలు, దీర్ఘకాలంపాటు రక్తంలో గ్లూకోజ్‌ను అదుపుచేయని వారు, రక్తంలో అధిక కొలెస్ట్రాల్‌ కలిగి ఉన్నవారు, అధిక రక్తపోటు ఉన్నవారిలో డయాబెటిక్‌ ఐ కనిపిస్తుంది. అలాగే, సిగరెట్‌ స్మోకింగ్‌ చేసేవారిలో, ఊబకాయులు కూడా డయాబెటిక్‌ ఐ కి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఇది మన జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.

blood pressureడయాబెటిక్‌ ఐ ని తొలి దశలోనే గుర్తించడం ద్వారా తగిన మందుల వాడకంతో అదుపులో పెట్టుకోవచ్చు. తరచుగా బ్లడ్‌ గ్లూకోజ్‌ పరీక్షలు చేయించుకుంటూ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. ప్రతియేటా ఒక్కసారైనా పూర్తి కంటి పరీక్ష చేయించుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, ఫైబర్‌ ఎక్కువగా ఉన్న ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం తప్పనిసరి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR