పెద్దలే కాదు చిన్నపిల్లలు కూడా కొంతమంది పాలు తాగడానికి ఇష్టపడరు. పాలు తాగినా, పెరుగన్నం తిన్నా కడుపునొప్పి అంటారు. పాలు తాగకుండా తప్పించుకోవడానికి ఇలాంటి సాకులు చెబుతున్నారేమో అనుకుంటారు. కానీ, అది లాక్టోజ్ ఇన్‌టాలరెన్స్. అంటే పాలు, పాల ఉత్పత్తులు పడకపోవడం. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఒక చిన్న సమస్య. ఇది ఉన్న వారు పాలు గానీ, పాల పదార్థాలు గానీ తీసుకోలేరు.
మనం తీసుకునే పాలలో పాల పదార్థాలలో ఉండే షుగర్ ని మన చిన్న పేగులలో ఉండే లాక్టేజ్ అనే పదార్థం జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలా మన చిన్న పేగులలో ఉండే లాక్టెజ్ ఈ పాలలోని షుగర్ ని జీర్ణం చేసి దాన్ని గ్లూకోజ్ మరియు గలాక్టోస్ గా మార్చి, దాన్ని మన రక్తం లో కలిసేలా చేస్తుంది. ఇది సాధారణ ప్రక్రియ. లాక్టోజ్ ఇటోలరెన్స్ ఉన్న వారికి ఈ లాక్టేజ్ అనే పదార్థం చాలా తక్కువ మోతాదు లో తయారు అవుతుంది.
అందువల్ల పాల లోని షుగర్ వీరికి జీర్ణం అవ్వదు. అది సరాసరిగా పెద్ద పేగు లోకి వెళుతుంది. కనుక వీరికి వాంతులు, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపం వలన పాలు, పాల పదార్ధాలు తీసుకున్నప్పుడు పొట్ట ఉబ్బరం, త్రేనుపులు లాంటి ఇబ్బందులు సామాన్యమే. ఈ లోపం దాదాపు 70 % శాతం ప్రపంచ జనాభాలో చోటుచేసుకుంటుంది అంటే… దీనిని సామాన్యమైన లోపంగా చూడాలేం.
‘లాక్టేజ్’ అనే ఎంజైమ్ రిలీజ్ అవ్వక పోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. పాలు తాగకపోతే.. పోషకాలు అందవు. తాగితే ఇబ్బంది. మరి ఈ లాక్టోజ్ ఇన్‌టాలరెన్స్ ఉన్న పిల్లలకు పోషకాలు ఎలా? పాలకు బదులుగా ఏం ఇవ్వాలి? లాక్టేజ్ అనేది డైజషన్ కోసం ఉపయోగపడే ఒక ఎంజైమ్. పాలు, పాల ఉత్పత్తుల్లో గ్లూకోజ్, గెలాక్టోజ్‌లు కలిసి ఏర్పడే లాక్టోజ్ అనే చక్కెర అరగడానికి ఇది ఉపయోగపడుతుంది.
కొంతమంది పిల్లల్లో ఆ ఎంజైమ్ నేచురల్‌గా రిలీజ్ కాదు. అందుకే, ఐస్‌క్రీమ్, చీజ్, పాలు, ఇంకొన్ని పాల పదార్థాలు తింటే పిల్లలకు అరగదు. అలాంటి పిల్లలకు పాలు తాగించడం, పాల ఉత్పత్తులు పెట్టకపోవడం మంచిది. పాల నుంచి వచ్చే పోషకాలు అందాలంటే డైరీ ప్రొడక్ట్స్ కాకుండా దానికి బదులుగా ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇస్తే మంచిది. ఆవు -గేదె -మేక -పాలు, జున్ను, ఐస్ క్రీమ్స్, వెన్న -పెరుగు మొదలగు వాటిలో ఈ లాక్టోజ్ ఎక్కువ శాతం ఉంటుంది. పాలు కంటే వెన్న, పెరుగు, తక్కువ పరిమాణంలో తీసుకుంటే కొంత ఇబ్బంది ఉండదు.
విటమిన్ – డి, ప్రొటీన్, క్యాల్షియం, ఫ్యాట్ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అందుకే, లాక్టోజ్ డిజార్డర్ ఉన్న పిల్లలకు ఆ పోషకాలు అందే ఫుడ్ ఇవ్వాలి. సోయా, ఆల్మంద్, ఓట్, రైస్, కొబ్బరి పాలు లాంటి ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఇవ్వొచ్చు. మిగతా పాలతో పోలిస్తే సోయా మిల్క్ బెటర్ అంటున్నారు డాక్టర్లు. సోయా మిల్క్‌లో లాక్టోజ్ తక్కువగా ఉంటుంది. దాంట్లో దాదాపు ఆరు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మూడు గ్రాముల కార్బొహైడ్రేట్లు, నాలుగు గ్రాముల ఫ్యాట్, 80 కాలరీలు ఉంటాయి. సోయా మిల్క్‌తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.