మెటబాలిజం అంటే ఏంటి? ఎలా వృద్ధి చేసుకోవాలి?

ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే మనం ఏం తింటున్నాం అనేదానితో పాటు ఎప్పుడు తింటున్నాం అనే విషయం మీద కూడా దృష్టి పెట్టాలి. అప్పుడు మెటబాలిజం అనేది వృద్ధి చెందుతుంది. అసలు ఇంతకీ ఈ మెటబాలిజం అంటే ఏంటి?
మ‌న శ‌రీరంలో ఖ‌ర్చ‌య్యే క్యాల‌రీల రేటునే మెట‌బాలిజం అంటారు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే శరీరం శక్తిని ఖర్చు చేసే వేగమే మెటబాలిజం. అంటే.. మెట‌బాలిజం ఎంత ఎక్కువ ఉంటే క్యాల‌రీలు అంత త్వ‌ర‌గా కరిగిపోతాయి. కాబట్టి ప్ర‌తి ఒక్క‌రు ఆరోగ్య‌క‌ర‌మైన మెట‌బాలిజం క‌లిగి ఉండటం అవసరం. ఈ వేగం మన ఆహారపుటలపవాట్లు, జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. అది ఏ మాత్రం తక్కువగా ఉన్న అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల కు దారి తీస్తుంది.

oolong teaమనందరం ఏదో ఒక రూపంలో రోజు వారీ ఆహారంలో కార్బో హైడ్రేట్స్ తీసుకుంటాం. శరీరానికి కావాల్సిన శక్తి వాటి ద్వారానే లభిస్తుంది. కానీ, ఈ కార్బో హైడ్రేట్స్ ని ప్రాసెస్ చేసుకోడానికి శరీరానికి యాక్టివ్ మెటబాలిజం యొక్క హెల్ప్ కావాలి. లేదంటే, ఈ కార్బో హైడ్రేట్స్ ఫ్యాట్స్ లా శరీరంలో పేరుకుపోతాయి. ఇంకా చెప్పాలంటే మెట‌బాలిజం త‌గ్గితే, క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చుకావు దాని ఫ‌లితంగా శ‌రీరంలో కొవ్వు పెరిగి అధిక బ‌రువు బారిన పడతారు. అలాగే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు కూడా వ‌స్తాయి. క‌నుక మ‌న శ‌రీర మెట‌బాలిజం స‌రిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు గాను మనం కొన్ని ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి.

ముఖ్యంగా ఆహారం లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దాని వ‌ల్ల మన శ‌రీర మెట‌బాలిజం రేటు 15 నుంచి 30 శాతం వ‌ర‌కు పెంచుకోవచ్చని సైంటిస్టులు తెలియచేస్తున్నారు. క‌నుక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్‌,కోడిగుడ్లు, మ‌ట‌న్, ప‌ప్పులు ఎక్కువగా తీసుకోవటం వలన మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌యి అధిక బ‌రువు తేలికగా త‌గ్గుతారు. డైటింగ్‌తో కడుపు మాడ్చుకుంటూ, హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌ చేస్తే, అందుకు సరిపడా శక్తి అందక బలహీనపడతాం. ఇందుకు కారణం డైటింగ్‌ సమయంలో, శక్తిని పొదుపు చేసుకోవడం కోసం శరీర జీవక్రియలను మందగింపజేయాలనే మెసేజ్‌ మెటబాలిజానికి చేరడమే.

non vegకంటి నిండా కునుకు కచ్చితంగా ఉండాలి. బాడీ మెటబాలిజం చురుగ్గా ఉండాలంటే కంటి నిండా నిద్ర తప్పనిసరి. కాబట్టి రోజుకు 8 గంటలకు తగ్గకుండా ప్రశాంతంగా నిద్ర పోవాలి.ఇక నీరు కూడా తగినన్ని తాగుతూ ఉండాలి. ఏసీ రూమ్ లో పనిచేస్తున్న కూడా .. గంటకోసారి అర గ్లాసు నీటిని తాగుతూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగ‌డం వ‌ల్ల కూడా శ‌రీర మెట‌బాలిజం వృద్ధి చెందుతుంది. 0.5 లీట‌ర్ల నీటిని తీసుకుంటే మ‌న శ‌రీర మెట‌బాలిజం 10 నుంచి 30 శాతం వ‌ర‌కు ఇంప్రూవ్ అవుతుంది.

waterజిమ్‌లో చేసే వ్యాయామంతో మ‌జిల్స్‌ను పెంచుకున్నా మ‌న శ‌రీర మెట‌బాలిజం రేటు వృద్ధి చెందుతుంది. వ్యాయామం తర్వాత కూడా మెటబాలిజం వేగంతో పని చేయాలంటే హై ఇంటెన్సిటీ వర్కవుట్స్‌కూడా చేయాలి. దీన్నే ‘ఆఫ్టర్‌ బర్న్‌ వర్కవుట్‌’ అని కూడా అంటారు. బరువులు మోయండి. బరువులు ఎత్తడం వల్ల లీన్‌ మజిల్‌ మాస్‌ తయారవుతుంది. కాబట్టి నిద్రావస్థలో ఉన్న మెటబాలిజం మేల్కొనేలా బరువులతో కూడిన వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. గంట‌ల కొద్దీమారకుండా ఒకే పొజిష‌న్‌లో కూర్చుంటే మ‌న శ‌రీర మెట‌బాలిజం తగ్గిపోతుంది. క‌నుక మ‌ధ్య మ‌ధ్య‌లో లేచి అటు ఇటూ నడుస్తూ ఉండాలి.

carbohydratesకారం,మ‌సాలాలు, ల‌ను ఎక్కువగా తిన్న మెట‌బాలిజం పెరిగి క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతాయి. ముఖ్యంగా దాల్చిన చెక్క‌, ల‌వంగాలు లేదా మిరియాలు, మిర్చి వంటివి తింటే మెట‌బాలిజం బాగా పెరుగుతుంది. జంక్ ఫుడ్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్‌ పెరిగి మెటబాలిజం కుంటు పడుతుంది. కాబట్టి తేలికగా అరుగుతూ, స్వల్ప పరిమాణాల్లో గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేసే ఆహారానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి వీలైనంత వరకు ఇంటి ఫుడ్డుకు ప్రాధాన్యతనిస్తూ ఉంటే బాడీ మెటబాలిజాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది.

work outమ‌ధ్యాహ్నం భోజ‌నం చేసి వాకింగ్ చేయ‌డం వ‌ల్ల 174 క్యాల‌రీలు ఎక్కువగా ఖ‌ర్చ‌వుతాయ‌ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.కాబట్టి భోజ‌నం చేశాక కొంత సేపు వాకింగ్ చేస్తే మెట‌బాలిజం వృద్ధి చెందుతుంది. అధికంగా ఉన్న బరువు కూడా తగ్గుతారు. ప్రతి రోజు తాగే కాఫీ, టీ ల‌ను మానేసి గ్రీన్ టీ లేదా ఊలాంగ్ టీ ల‌ను తాగటం వలన మ‌న శ‌రీర మెట‌బాలిజం 4 నుంచి 5 శాతం వ‌ర‌కు పెరిగి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR