ప్రోనింగ్ అంటే ఏంటి? ఎప్పుడు ఎలా చేయాలి?

కరోనా రెండో దశలో విపరీతమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఆక్సిజన్ దొరక్క ఎంతో మంది కరోనా రోగులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మనిషికి ఆక్సిజన్‌ తక్కువగా అందుతున్నప్పుడు ఏం చేయాలా అని అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ప్రోనింగ్ అనే ఒకరకం వ్యాయామంతో ఈ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో ప్రోనింగ్‌ ద్వారా శరీరంలోకి వెళ్లే ఆక్సిజన్‌ స్థాయిని పెంచవచ్చని సలహా ఇస్తున్నారు.

proningఅసలు ఇంతకీ ఈ ప్రోనింగ్‌ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోనింగ్ అంటే ఒక వ్యాయామం. ఊపిరి ఆడనపుడు బోర్లా పడుకోవడం పురాతన పద్ధతి. దీనిని చాలా కాలం నుంచి పాటిస్తున్నారు. వైద్య పరిభాషలో ఈ పద్ధతిని ప్రోనింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి శ్వాస వేగం పెరుగుతుంది. అంతేకాకుండా ఎక్కువసేపు పడుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోని ద్రవాలు కలిగి ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ వచ్చి చేరుతుంది. ఊపిరితిత్తులు ఎక్కువభాగం వెనకభాగంలోనే ఉంటాయి. బోర్లా పడుకోవడం వల్ల అన్ని భాగాలు పనిచేసి చురుగ్గా పని చేస్తాయి. ఇలా శ్వాసవేగం పెరిగి ప్రాణ వాయువు అందుతుంది.

కరోనా బాధితులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఆస్పత్రుల్లోనూ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఐసోలేషన్‌లో ఉన్న కరోనా‌ రోగులకు ‘ప్రోనింగ్‌’ చాలా ప్రయోజనకరం అని వైద్యులు చెబుతున్నారు. ఈ పద్ధతిని చాలా కాలంగా ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. తొలుత చాలామంది ఈ పద్ధతిని వ్యతిరేకించినా క్రమంగా సముఖత చూపుతున్నారు. ప్రోనింగ్ తో శ్వాస మెరుగుపడుతుందని గుర్తించారు. ఊపిరి కష్టమైనప్పుడు తగు జాగ్రత్తలతో ఈ పద్ధతిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వెల్లడించారు.

proningమరి ఈ ప్రోనింగ్ చేయాలంటే ఏమేం కావాలి, ఎలా చేయాలో చూద్దాం…ప్రోనింగ్‌కు కావాల్సిందల్లా 4 నుంచి 5 దిండ్లు. బోర్లా పడుకుని ఒక దిండు తల కింద పెట్టుకోవాలి. 1 లేదా 2 దిండ్లు ఛాతీ నుంచి తొడల వరకు నిలువుగా ఉంచుకోవాలి. రెండు దిండ్లు మోకాళ్ల కింద నిలువుగా ఉంచుకోవాలి. ఏ పొజిషన్‌లో కూడా ఎక్కువ సేపు పడుకోవద్దు. 30 నిమిషాలకోసారి పడుకునే పొజిషన్లను మారుస్తూ ఉండాలి. సొంతంగా కదలగలిగితే పేషెంట్‌ స్వయంగా దీనిని అనుసరించవచ్చు. పేషెంట్‌ సొంతంగా కదిలే పరిస్థితి లేకుంటే కొందరి సాయంతో ప్రోనింగ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతి పొజిషన్‌ కూడా 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఉండొచ్చు. రెండు గంటలకు మించి మాత్రం ఒకే పొజిషన్‌లో ఉండొద్దు.

back injuryప్రోనింగ్‌‌ చేయడం వల్ల శ్వాస తీసుకునే మార్గం సజావుగా మారి గాలి ప్రసరణ బాగుంటుంది . పల్స్‌ ఆక్సీ మీటర్‌వాడినప్పుడు ఆక్సిజన్‌ స్థాయి 94 శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలోనే ఈ ప్రోనింగ్‌ చేయాలి. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు ఆక్సిజన్‌ స్థాయి, శరీర ఉష్ణోగ్రత,షుగర్‌ లెవల్‌ పరిశీలించిన తరువాత మాత్రమే ఈ పద్ధతిని పాటించడం మంచిది. వీటితో పాటురూమ్స్ లో ఎక్కువ వెంటిలేషన్‌ ఉండేలా చూసుకోవాలి . ప్రోనింగ్‌ చేసే ముందు ఒకసారి వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

lungsఅయితే ప్రోనింగ్ పద్దతితో లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరు బోర్లా పడడానికి కష్టపడతారు అని అన్నారు. ఊబకాయం ఉన్నవారిని పడుకోబెట్టడం కష్టమని చెప్పారు. ఇకపోతే ఛాతికి గాయాలున్నావారు ఇతర గుండె సంబంధ సమస్యలున్న వారికి ఇది చేయకూడదని వివరించారు. కొన్ని సార్లు ఊపిరి అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

proningభోజనం చేసిన సుమారు గంట వరకు ప్రోనింగ్‌ చేయకూడదు. తేలికగా, సౌకర్యవంతంగా ఉన్నంత సేపు మాత్రమే ప్రోనింగ్‌ చేయాలి. ప్రోనింగ్‌ చేసే సమయంలో దిండ్లను ఎప్పటికప్పుడు సౌకర్యవంతంగా ఉండేలామార్చుకోవచ్చు. రోజులో 16 గంటల వరకు ప్రోనింగ్‌ చేయవచ్చు.వెన్నెముకలో సమస్యలున్నవారు, గర్భిణులు, గుండె జబ్బు సమస్యలు ఉన్నవారు ప్రోనింగ్‌ చేయకపోవడమే మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR