సోరియాసిస్ అంటే ఏంటి? ఎవరికీ వస్తుంది? దాని లక్షణాలు!

మనిషి ఎదుర్కునే సమస్యలకు కారణాలు చాలా వరకు స్వయం తప్పిదాలే. తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు ప్రత్యేక్షంగానూ, పరోక్షంగా ఫలితం అనుభవిస్తున్నాం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన విధానం వలన అధికంగా మానసిక ఒత్తిళ్ళు ఎదురుకావడం, రోజువారీ వ్యాయామ లోపం వంటి అంశాల కారణంగా ఎన్నో రకాల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు గురికావడం జరుగుతోంది. మన అంతర్గత రోగనిరోధక వ్యవస్థ సొంత కణాలపైనే దాడి చేయడం వలన కలిగే వ్యాధులను ఆటో ఇమ్యూన్‌ వ్యాధులుగా పరిగణిస్తారు. ఇలాంటి వ్యాధులలో సోరియాసిస్‌ ప్రధానమైనది.

psoriasisమనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామనే విషయం మన శరీరమే చెబుతుంది. చర్మం పైకి ఎలా కనిపిస్తే మన ఆరోగ్యం అలా ఉంటుందని అర్థం చేసుకో వచ్చు. ఇలాంటి దృఢమైన చర్మంపై సోరియాసిస్ అనే జబ్బు దాడి చేస్తుంది. మృదువైన చర్మ పొరలు ఐదింటిపై దాడి చేసి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ కారణంగానే చర్మ రూపం, దృఢత్వం దెబ్బతిని మృదుత్వం కోల్పోయి రాలిపోతుంది. దీన్నే సోరియాసిస్ అంటారు. చలికాలంలో కాసింత చర్మం పొడిబారి లేస్తేనే చాలు మంట పుడుతుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే మొత్తం శరీరంపై ఎర్రగా, మందంగా మచ్చలు పడి పొలుసుల్లా, చేప చర్మంలా ఊడిపోతుంటే ఎలా ఉంటుంది. అందుకే సోరియాసిస్ అంటే చాలా మందికి ముందు నుంచే భయం. మరి ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది. ఎవరికీ వస్తుంది. అసలు సమస్య లక్షణాలు ఏంటి?

psoriasisసోరియాసిస్ దీర్ఘకాలికంగా వేధించే సాధారణ చర్మ సమస్య. కానీ అంటువ్యాధి మాత్రం కాదు. ఇది ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తుంది. స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. చల్లని వాతావరణం వలన కూడా ఈ సోరియాసిస్‌ వ్యాధి ప్రేరేపించబడుతుంది. ఈ వ్యాధి వస్తే చర్మం ఎర్రగా మారుతుంది. పొడిబారినట్లుగా అయిపోయి చర్మం పొలుసుల్లా రాలిపోతుంది. దురదలు రావడం, మచ్చలు పడటం కూడా జరుగుతాయి. ఏ వయస్సు వారినైనా ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

geneticఈ వ్యాధి దాడి చేస్తే చాలు.. ఓ పట్టాన అస్సలు వదలదు.. చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. ఈ వ్యాధి సోకితే చాలు.. ఎంతటి అందమైన చర్మమైనా సరే అందవిహీనంగా మారి.. చిరాకుగా ఉంటుంది. అలాంటి చర్మాన్ని చూడ్డానికి, ముట్టుకోవడానికి కూడా అసౌకర్యం అనిపించేలా తయారవుతుంది. దీంతో మనలో ఆత్మన్యూనత భావం మొదలవుతుంది. నిజానికీ ఇది అంటువ్యాధి కాకపోయినా.. చూడ్డానికి మాత్రం అందవిహీనంగా ఉండడం వల్ల ఎవరూ కూడా అలాంటి చర్మాన్ని ముట్టుకోవడానికి సాహసించరు.

సోరియాసిస్‌ను ప్రేరేపించే కారణాలు:

సోరియాసిస్‌కు ఇప్పటివరకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. అవి… మానసిక ఒత్తిడి వంశపారంపర్యం ఆటోఇమ్యూన్ ప్రతిస్పందన జన్యుసంబంధిత లోపాలు. సోరియాసిస్ అనేది చికిత్స తీసుకుంటున్నా తగ్గుతూ, మళ్లీ పెరుగుతూ ఇబ్బంది పెడుతుంది. అయితే దీన్ని ప్రేరేపించే కారణాలకు దూరంగా ఉంటే వ్యాధి తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. వాటిల్లో ముఖ్యమైనవి… మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. దుమ్ము ధూళి పెంపుడు జంతువుల వంటి అలర్జీలను కలిగించే కారకాలకు దూరంగా ఉండాలి. యాంటీ బయాటిక్స్ వాడినప్పుడు దీని తీవ్రత పెరుగుతుంది. కాబట్టి వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలి. మద్యం అలవాటును పూర్తిగా మానేయాలి. చల్లటి వాతావరణంలో తిరగకుండా ఉండటం మంచిది. పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.

alcoholలక్షణాలు: చర్మం ఎర్రగా మారడం దురద చర్మం గట్టిగా తయారవడం అరికాలు, అరచేయిపై బొబ్బలు ఏర్పడటం గోళ్లు పెళుసుగా తయారయ్యి నల్ల రంగుకు మారడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కీళ్లనొప్పులు దురద ఎక్కువగా ఉన్నప్పుడు గీరగానే చర్మం మీద పుండ్లు పడి రక్తం స్రవించడం కనిపిస్తుంది.

stress

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR