బుద్ధుని తలపై కనిపించేవి వెంట్రుకలు కాదట, మరేమిటి?

బుద్ధుడిని విష్ణు మూర్తి అవతారంగా భావిస్తారు, పూజిస్తారు. జ్ఞానానికి, ప్రశాంతతకు చిహ్నంగా బుద్ధుడిని పిలుస్తుంటారు. బుద్ధుడు ప్రవచించిన ధర్మాలని పాటిస్తూ బౌద్ధం ఒక మతం కూడా వెలిసింది. మనం ఏ బుద్ధుడి విగ్రహాన్ని చూసినా ప్రసన్న వదనం తో కనులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. బుద్ధుడి విగ్రహాన్ని చూస్తేనే మనకి ఒకరకమైన ప్రశాంతత అనిపిస్తూ ఉంటుంది.

siddharth gautamaనేటి కాలంలో, బౌద్ధమతం ప్రపంచంలో అత్యంత పురాతన మరియు అత్యంత ప్రసిద్ధ మతాలలో ఒకటి. నేడు బౌద్ధమతం యొక్క అనుచరులు కోట్లాది మంది దీనిని ప్రచారం చేస్తున్నారు. ప్రపంచంలో చాలా అందమైన మరియు ఆకర్షణీయమైన బుద్ధ భగవానుని విగ్రహాలు వేల సంఖ్యలో చూడవచ్చు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా స్థానం పొందిన విగ్రహాలు అనేకం ఉన్నాయి.

బుద్ధుడి విగ్రహానికి ఉన్న శక్తీ అలాంటిది మరి. అందుకే చాలా మంది బుద్ధుడి చిత్రపటాలను కానీ, చిన్నపాటి విగ్రహాలను కానీ తమ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయడం వలన ఆ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని విశ్వసిస్తూ ఉంటారు. మనం చాలా చోట్ల బుద్ధుడి విగ్రహాలను లేదంటే ఫొటోలనో చూస్తూనే ఉంటాం. అయితే… వాటిని తీక్షణం గా పరిశీలిస్తే.. మనకు ఓ విషయం అవగతమవుతుంది.

siddharth gautamaగౌతమ బుద్ధుని ప్రతి విగ్రహంలో కనిపించే ఉంగరాల జుట్టు. అది జుట్టు అయ్యుండచ్చు లేదా కిరీటం అయ్యుండచ్చు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దీని వెనుక ఉన్న అసలు కథ చెబితే ఆశ్చర్యపోతారు. జ్ఞానోదయం పొందడానికి బౌద్ధ సన్యాసులు ముండన్ ను నిర్వహిస్తారు – బౌద్ధంలోని త్రిపితాకుని నుంచి వినయపిటక గ్రంథ్ లో అనేక మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ మార్గదర్శకసూత్రాలను పాటిస్తే జ్ఞానోదయాన్ని సాధించాలంటే మానవ శరీరం, మనస్సు రెండూ పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలని రాసి ఉంది.

ఈ మార్గదర్శకసూత్రాలను అనుసరించి బౌద్ధ సన్యాసులు తమ శరీర స్వచ్ఛత కోసం తల నీలాలు కడిగిస్తారు. దీనిని సిద్ధార్ధ గౌతముడు గౌతమ బుద్ధుడు చేశాడు. తన రాజ్యాన్ని త్యజించిన తరువాత, అతడు కూడా తన క్షమాపాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత బుద్ధుడు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నారట. ఆయన గంటల తరబడి ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. బయట ఏమి జరుగుతోందో కూడా ఆయనకు పట్టడం లేదు.

snail on gautama buddhaఈ లోపు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నుంచి వచ్చే ఎండ మండిపోతోంది. ఈ సమయం లో ఓ నత్త ఆయనను గమనించింది. ఆయన ఎండ మండిపోతున్నా కూడా ధ్యానం లో మునిగిపోయి ఉన్నాడని గ్రహించింది. ఇంకా ఇలానే కొనసాగితే.. ఎండ వేడి ఆయన మాడుకి తగిలి ధ్యానం చేయడం కష్టం అవుతుంది అని భావించింది. తాను ఆయన తలపై కూర్చుంటే.. తన శరీరం లో ఉండే తేమ వలన ఆయనకు ఎండ వేడి తగలకుండా ఉంటుందని భావించి.. ఆయన తలపైకి ఎక్కి కూర్చుంది.

siddharth gautamaఅలా.. ఆ నత్త వెనకే మరికొన్ని నత్తలు.. మొత్తం 108 నత్తలు ఆయన తలపైకి ఎక్కి కూర్చున్నాయట.. అయితే.. ఆ వేడి వలన నత్తలు తమ ప్రాణాలను కోల్పోయాయి. బుద్ధుడికి జ్ఞానోదయం కలిగే వరకు అవి అలానే ఉన్నాయట. బుద్ధునికి జ్ఞానోదయం కలిగించడం కోసమే.. అవి ప్రాణాలు వదిలేసుకున్నాయని చెబుతారు. బుద్ధుడి కోసం ప్రాణాలు అర్పించిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు. అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉన్నట్టే బుద్దుడి విగ్రహాలను, ఫొటోలను, చిత్రాలను తయారు చేస్తారు.

siddharth gautamaమరో కథ కూడా ప్రచారం లో ఉంది. బుద్ధుని జుట్టు కర్లీ గా ఏమి ఉండదు. కానీ.. ఆయన గంటల తరబడి ఎండలో కూడా ధ్యానం చేయడం వలన ఆయన జుట్టు కొంత కాలిపోయి వంకర్లు తిరిగిపోయి ఉంటుందట. మనం గమనిస్తే.. చాలా వరకు ఉష్ణ దేశాల్లో ఉండే ప్రజలకు కూడా జుట్టు కర్లీ గానే ఉంటుంది. అందుకే ఈ కథ కూడా ప్రచారం లోకి వచ్చి ఉండవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR