మాస శివరాత్రి ఎలా జరుపుకోవాలి? దాని ప్రాముఖ్యత ఏంటి ?

హిందూ ధర్మంలో శివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ప్రతీ ఏడాది ఫిబ్రవరి లో శివరాత్రి ఘనంగా జరుపుకుంటాము. కానీ మాస శివరాత్రి అంటే ఏంటి? అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రతీ నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా అని అంటారు. మరి మాసశివరాత్రిని ఎప్పుడు, ఎలా జరుపుకోవాలి? అసలు మాస శివరాత్రి అంటే ఏంటి?

మాస శివరాత్రిశివరాత్రి అనగా శివుని లింగోద్భవం అని అర్ధం. ఆ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి అంటే మృత్యువునకు కారకుడు కేతువు, అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు.

మాస శివరాత్రిచంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావం ఉండడంతో మన ఆహారపు అలవాట్లపై ప్రభావం పడి జీర్ణశక్తి తగ్గుతుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. ఈ సమయంలో మానసికంగా సంయమనం కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరుగుతుంది. తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణాలకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. తద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించవచ్చు. ఆ తీవ్రత మనపై తక్కువగా ఉండాలంటే మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసం ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది.

మాస శివరాత్రిఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5 గాని 11గాని 18గాని 21గాని 56 లేదా 108 ప్రదక్షణలు చేయవచ్చు. శివాలయంలో పూజలో ఉంచిన చెరకు రసాన్ని భక్తులకు పంచితే ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది.

మాస శివరాత్రిఅలాగే ఆరోజు ప్రదోష వేల శివునికు మారేడు దళాలతో లేదా కనీసం గంగా జలంతో అభిషేకాది అర్చనలు చేయడం మంచిది. మూడు పూటలా చల్లటి నీటితో వీలయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. ఈ రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడం వలన దోష తీవ్రత తగ్గుతుంది. సంతానలేమి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR