కరోనా సమయంలో అల్లం చేసే మేలు ఏంటో తెలుసా ?

కరోనా మొదలైనప్పటి నుండి అందరి నోటా ఒకటే మాట, ఇమ్యూనిటీ. ఆరోగ్యం విషయంలో, ఇమ్యూనిటీ విషయంలో, హోమ్ మేడ్ ఫుడ్ విషయం లో గత సంవత్సరం నుండి చర్చ జరుగుతూనే ఉంది. మనం ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించాలంటే రోగ నిరోధక వ్యవస్థ పని తీరు బాగుండాలి అనే విషయాన్ని అందరూ తెలుసుకున్నారు. రోగనిరోధక వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్, పారసైట్స్ వంటివి మన శరీరానికి హాని చేస్తాయి. ఎప్పుడైతే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ వంటివి మన శరీరంలోకి ప్రవేశిస్తాయో మన రోగనిరోధక వ్యవస్థ వాటిని అటాక్ చేస్తుంది. ఇటువంటి హానికరమైన వాటి నుండి రక్షించడం మాత్రమే కాదు, శరీరంలో ఉండేటువంటి మృతకణాలను తొలగించడానికి కూడా ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగ పడుతుంది.

అల్లంమన శరీరం మొత్తం ఈ రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మీ శరీరానికి ఎటువంటి వ్యాధికి సంబంధించిన హానికరమైన కణాలు శరీరంలోకి చేరినా ఈ రోగనిరోధక వ్యవస్థ పోరాడుతుంది, అంటే ఉదాహరణకు క్యాన్సర్ కణాలు అని చెప్పవచ్చు. అందుకే ఇమ్మ్యూనిటి పోరు పెంచుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ టైమ్ ఇంట్లోనే గడపడంతో ఎలా అయితే హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నామో, అలాగే హోమ్ రెమిడీస్ కి కూడా ప్రాముఖ్యత బాగా పెరిగింది. కిచెన్ లో ఉండే ఇన్‌గ్రీడియెంట్స్ తోనే ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవచ్చో తెలుసుకునే పనిలో పడ్డారు. అలాంటి ఒక ఇంగ్రేడియెంట్ అల్లం.

అల్లంమన దేశంలో పురాతన కాలం నుండి ప్రజలు వంట మరియు ఔషధల్లో అల్లం ఉపయోగించారు. ప్రతి ఇంట్లో ఏదో రూపంలో అల్లాని వాడుతూ నే వుంటారు. అల్లం వంటలకు రుచిని తెచ్చిపెట్టడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. సుమారు ఒక ఇంచు అల్లంని ముక్కలుగా కట్ చేసి, గోరువెచ్చని నీటిలో కానీ, ఒక కప్పు ఛాయలో కానీ, వంటలలో కానీ కలిపి వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు అంటున్నారు అల్లం మహత్యం తెలిసిన హెల్త్ ఎక్స్‌పర్ట్స్. ఇంతకి ఆ అద్భుతాలేంటో చూసేద్దామా మరి. ఉదయం లేవగానే తరచుగా వికారంగా అనిపిస్తుందా? ప్రతీ రోజు అల్లం తినడం ద్వారా ఆ వికారం తగ్గుతుంది. నేరుగా అల్లం తినలేని వాళ్లు బెళ్లం, లేదా చక్కరతో చేసిన అల్లమురబ్బ తినడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, కీమోథెరపీ చేయించుకునేవారు దీని నుండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

అల్లంమలబద్దకంతో బాధపడే వారికి అల్లం మంచి దివ్య ఔషధంగా పని చేస్తుంది. అల్లంలో ఉండే పీచు మలబద్దకాన్ని దూరంచేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు 20.మి.లీ. అల్లం రసం 20 మి.లీ తేనె కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే సుఖ విరోచనం అయ్యి, కడుపులోని వాయువులు కూడా బయటికి పోయి, నొప్పి తగ్గుతుంది. అల్లాన్ని వాడుకునే ముందు దాని పై పొట్టును తీసి వాడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా ఉదయం లేచిన వెంటనే పడి కడుపున అల్లం రసం తాగితే నీ బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

అల్లంఅల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అందుకే జలుబు, వైరస్ బారిన పడిన వారికి త్వరగా కోలుకోవడానికి అల్లం సహాయపడుతుంది. దగ్గు, జలుబు నుండి పూర్తిగా కోలుకోవచ్చు . అల్లం లో ఉన్న యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వలన జింజర్ టీ తలనొప్పి, ఫ్లూ నుండి కూడా రిలీఫ్ ని కలుగచేస్తుంది. అల్లం రసంలో లో ఒక స్పూన్ తేనె, పసుపు, నిమ్మరసం కలిపి తీసుకున్న గాని ఉపయోగం ఉంటుంది. అల్లం రసం ఇష్టంలేని వారు మూడు పూటలా చిన్న అల్లం ముక్కను నోట్లో దవడన పెట్టి కొంచెంకొంచెంగా అల్లం రసం తీసుకోవచ్చు.

అల్లంఅల్లం రసంలో ఎక్కువ శాతంలో విటమిన్ సి, మెగ్నీషియం ఇలా శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కేవలం ఇమ్యూనిటీపవర్ అనిపించడమే కాకుండా కీళ్ల నొప్పులు ఇతర నొప్పులతో బాధపడుతున్న వారికి కూడా అల్లం రసాన్ని ప్రతిరోజు సేవించడం వల్ల వాటి నుండి ఉపశమనం దొరుకుతుంది. ప్రతీ రోజు అల్లం తీసుకోవడం ద్వారా కండరాల నొప్పిపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. రోజూ అల్లం తీసుకోవడం వల్ల కండరాల నొప్పి క్రమంగా తగ్గుతుంది.

అల్లంఆస్టియో ఆర్థ్రైటిస్ తో బాధపడుతున్న పేషెంట్స్ కూడా రెగ్యులర్ గా అల్లం టీ తాగడం వల్ల వారి మెడికేషన్ కొంచెం తగ్గించుకోగలిగారని తెలిసింది. అల్లం తినడం ద్వారా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అరికట్టవచ్చు. అల్లం తీవ్రమైన కడుపు నొప్పి నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ అల్లం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అల్లం తీసుకోవడం ద్వారా రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది.

అల్లంగొంతు నొప్పితో బాధపడే వారికి సైతం అల్లం ఛాయ దివ్య ఔషదంగా పనిచేసి వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు అయితే అల్లం రసం ఒక వజ్రాయుధం లా పనిచేస్తుంది. ప్రతిరోజు కొంత మొత్తంలో అల్లం రసాన్ని సేవిస్తే షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా అజీర్తి తో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో మంటను వేగంగా నివారించుకోవచ్చు.

అల్లంఅంతేకాదు అల్లంలోని రసాయనాలు ఆస్తమా లక్షణాలు తగ్గటానికీ తోడ్పడగలవని తేలింది. ఆస్తమా బాధితుల్లో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు సన్నబడి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. సాధారణంగా వీరికి గాలి గొట్టాల్లోని మృదుకండర (ఎఎస్‌ఎం) కణజాలాన్ని వదులు చేసే మందులు ఇస్తుంటారు. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. అల్లంలోని జింజెరాల్, షాగావోల్ అనే రసాయనాలను శుద్ధిచేసి వాడితే.. ఆస్తమా మందుల మాదిరిగానే పనిచేస్తుందని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో ఉండే ‘పీడీఈ4డీ’ అనే ఎంజైమ్ గాలిగొట్టాలు వదులయ్యే ప్రక్రియను అడ్డుకుంటుంది. అల్లంలోని రసాయనాలు ఈ ఎంజైమ్‌ను నిరోధిస్తున్నట్టు కనుగొన్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR