రక్తం జిగురులా మారిపోవడం వెనుక గల కారణం ఏమిటి

ఎక్కడో చైనాలో పుట్టిన ఒక సాధారణ వైరస్ మనందరి జీవితాలను ఒక్క కుదుపుతో ఆపేసింది. చరిత్రలో ఎన్నో రకాల వైరస్‌లు మానవ జీవితాన్ని ప్రభావితం చేశాయి. కొన్ని మహమ్మారిగా మారి ప్రాణాలు తీశాయి. కానీ ప్రపంచం ఎప్పుడూ ఇలా స్తంభించిపోలేదు. కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందినప్పుడు, సీజన్ మారుతున్నప్పుడు ఫ్లూ జ్వరాలు వచ్చాయి. కానీ ఎన్నడూ ఇలా జీవితం నిలిచిపోలేదు. మరి, కరోనావైరస్ మాత్రం ఎందుకు మన జీవితాలకు ఇంత ముప్పు తెచ్చి పెట్టింది?

రక్తందానికి కారణం తెలుసుకోవడానికి వైద్య నిపుణులు పలు అధ్యయనాలు చేసి విస్తు పోయే నిజాలను తెలుసుకున్నారు. కరోనావైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలైన రోగుల్లో 30 శాతం మందిలో ప్రమాదకరంగా రక్తపు గడ్డలు(బ్లడ్ కాట్స్) ఏర్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వైరస్ సోకినప్పుడు ఊపిరితిత్తుల్లో మంట కలుగుతుంది. ఊపిరితిత్తుల్లో తీవ్రమైన మంట వల్ల ఇలాంటి క్లాట్స్ ఏర్పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా క్రిటికల్ కేర్‌లో ఉన్న కోవిడ్ రోగుల్లో సుమారు సగం మందికి ఊపిరితిత్తుల్లో పల్మనరీ ఎంబోలిజమ్ లేదా బ్లడ్ క్లాట్స్ కనిపిస్తున్నాయన్నారు

రక్తంకరోనావైరస్ వల్ల రోగుల రక్తానికి జిగురు స్వభావం పెరుగుతోందని.. దానివల్ల రక్తపు గడ్డలు ఏర్పడుతున్నాయని, ఇవన్నీ కలిసి రోగి పరిస్థితిని విషమంగా మార్చేస్తున్నాయని ఆర్య చెప్పారు. కరోనావైరస్ కారణంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు ఇలా రక్తం జిగురుగా మారడం కారణం అని తేల్చేసారు. కాగా కరోనా పేషెంట్లకు వాడే స్టెరాయిడ్స్ అదేవిధంగా రక్తం పలచబడటానికి వాడే మందుల వలన చాలా మంది పేషెంట్స్ ప్రాణాలు నిలబడ్డాయని కొందరు వైద్యులు గట్టిగా నమ్ముతున్నారు.

రక్తంకోరనా సంక్రమణ శరీరంలోని వాస్కులర్ సిస్టమ్ లోని వివిధ భాగాలలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది జరగకుండా నిరోధించడానికి, కరోనా సంక్రమణతో బాధపడుతున్న రోగులు ప్రతిస్కందకాలు (రక్తం చిక్కబడకుండా ఉంచే మందులు) తీసుకోవాలి. ఈ మందులు వాడాల్సిన వ్యవధి వ్యాధి తీవ్రత (కరోనావైరస్ సంక్రమణ), రోగుల గుండె జబ్బులు, మెదడు(బ్రెయిన్) స్ట్రోక్, డయాబెటిస్, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి వంటి వైద్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ ప్రతిస్కందకాలు ఎప్పుడూకూడా వైద్యుల పర్యవేక్షణలోనే.. వారు సూచించిన విధంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి వారుగా స్వంతంగా ఈ మందులు వాడటం చేటు తెస్తుంది అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

రక్తంరక్తం పలుచన చేయడానికి యాంటీ ప్లేట్‌లెట్, యాంటీ క్లాటింగ్ ఏజెంట్ల కలయికను ప్రస్తుతం వైద్యులు ఉపయోగిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ఇవి ఉపయోగించడానికి ఒక పధ్ధతి ఉంటుంది. డి-డైమర్, ఫైబ్రినోజెన్ వంటి రక్త పరీక్షలద్వారా వచ్చిన నివేదికలను అనుసరించి ఈ మందులను వాడతామని డాక్టర్లు అంటున్నారు. సాధారణంగా రక్తం గడ్డ కట్టే పరిస్థితి ఒక్కోరిలో ఒక్కోరకంగా ఉంటాయి. వైద్యుల సలహాలేకుండా రక్తం పలుచపడటానికి మందులు వాడితే, ఒక్కోసారి రక్తస్రావం జరిగి ప్రాణాలు పోవచ్చు. అందువల్ల ఆరోగ్య నిపుణుడి సలహా మేరకే ఈ మందులు వాడాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. కరోనా సంక్రమణ ఒక నిర్దిష్ట దశలో లేదా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు రికవరీ దశలో రక్తం పలుచబడటం అవసరం.

రక్తంచాలామంది శరీరంలో వైరస్ ఎటువంటి ప్రతిచర్య లేకుండా శరీరంలో ఈ వైరస్ కలిగి ఉంటారు. అలాంటి రోగులకు రక్తం పలుచన చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. అయినా, పరీక్షలు జరిపి ఎటువంటి ఇబ్బందులూ లేవని నిర్ధారించుకోవాలి. సాధారణంగా ఫ్లూ సోకిన తరువాత, ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకుంటాయి. కానీ కోవిడ్ 19 విషయంలో అలా జరగట్లేదు. కోవిడ్ సోకి తగ్గిన తరువాత కూడా రక్తం గడ్డ కట్టడం జరుగుతోంది. కోవిడ్ రోగుల రక్తంలో గడ్డ కట్టిన రసాయనాలు సాధారణ స్థాయి కన్నా 200 నుంచి 400 శాతం ఎక్కువగా ఉంటున్నాయని కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ బెవర్లీ హంట్ చెప్పారు.

రక్తంఅయితే, ఇప్పటివరకు వివిధ రకాల రోగుల్లో రక్తపు గడ్డలను కరిగించడానికి వాడే బ్లడ్ థిన్నర్స్ ఈ కరోనా రోగులకు ఏ్పడుతున్న రక్తపు గడ్డల విషయంలో అన్నిసార్లూ పనిచేయడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇలాంటి మందులను డోసేజ్ పెంచి ఇస్తే రక్తస్రావం జరిగి చనిపోయే ప్రమాదముంది. అయితే.. ఎంత మోతాదులో ఇలాంటి బ్లడ్ థిన్నర్స్ ఇవ్వాలనే విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇంకొందరు నిపుణులు ఈ రక్తపు గడ్డలకు కారణమవుతున్న ఊపిరితిత్తుల్లో మంటను నివారించే ప్రయత్నం చేస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR