గేదె పాలు ఆవు పాలకు మధ్య తేడా ఏంటి? ఏ వయసు వారు ఏ పాలు తాగితే మంచిది?

కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యమైపోయింది. దానికోసం పోషకాలు ఉన్న ఆహారంపై అవగాహన పెంచుకుంటున్నారు జనాలు. ఈ కరోనా సమయంలో వైద్యులు సూచించే పోషకాల్లో పాలు కూడా ఒకటి. కాబట్టి.. అలవాటు లేకపోయినా కనీసం ఒక పూటైనా పాలు తీసుకోండి. లేదా పాల ఉత్పత్తుల్లో ఏదో ఒకటి తీసుకోండి.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ పాలు తాగడం వల్ల పోషకాలు మెండుగా పొందొచ్చని చెబుతుంటారు. ప్రతి రోజు పాలు తాగడం వలన బలం వస్తుంది. ఇందులో విటమిన్ డీ, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా చేయడంలో సహాయపడతాయి.

milkఆవుపాలను అత్యధికంగా వినియోగించే దేశం భారత్. యూరిపియన్ యూనియన్‌లోని మొత్తం దేశాల కంటే రెట్టింపు పాల వినియోగం ఒక్క భారత్‌లోనే ఉంది.. భారత్‌లోనే పాల వినియోగం అధికంగా ఉంటుంది. మన దగ్గర పుట్టినప్పుడు అమ్మపాలతో మొదలైన ఆ అనుబంధం అమ్మపాలు మరిచాక.. ఆవు పాలు, గేదెపాలతో ముడిపడి ఉంటుంది. ఇది మనం వృద్ధులు అయ్యే వరకూ కూడా కొనసాగుతూ ఉంటుంది. అయితే చాలామందిలో ఒక డౌట్ ఉంటుంది. మన ఆరోగ్యానికి ఆవు పాలు మంచివా? లేక గేదె పాలు మంచివా? అని ఈ ప్రశ్నకు ఈ రోజు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

cow milkచాలామంది ఆవు పాలల్లోనే ఎక్కువ ప్రొటీన్లుంటాయనుకుంటారు. కానీ బర్రె పాలు తాగడానికే ఎక్కువ ఇష్టపడుతారు. అయితే.. ఆవుపాలు అందరికీ అందుబాటులో ఉండవు. అందుకే ఎక్కువ మంది బర్రెపాలు తాగడానికి కూడా ఒక కారణం. బర్రెపాలు ఆవుపాల కంటే చిక్కగా.. రుచిగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది బర్రె పాలు తాగడానికే ఇష్టపడతారు. అంతేకాదు బర్రె పాలలో వెన్నశాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే.. బర్రెపాల కంటే ఆవు పాలే శరీరానికి ఎంతో మంచివి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాకపోతే రెండింటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

buffalo milkఆవు పాల వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అధిక బరువును నియంత్రించడంలో ఈ పాలు చాలా సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. ఆవు పాలలో కాస్త కుంకుమ పువ్వును, చక్కెరను కలుపుకుని తాగితే పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లల ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ఆవు పాలు చాలా ఉపయోగపడతాయి. ఆవు పాలలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో ఆవుపాలు బాగా పనిచేస్తాయి. కంటి సమస్యలు రాకుండా నివారించడంతో పాటు.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఆవుపాలు మంచి ఔషధం.

vitamin Aపాల‌ల్లో ఉండే కొవ్వుపై వాటి చిక్కద‌నం ఆధార‌ప‌డి ఉంటుంది. ఆవు పాల‌ల్లో 3-4 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. అదే బ‌ర్రె పాలల్లో 7-8 శాతం వ‌ర‌కు కొవ్వు ఉంటుంది. అందుకే ఆవు పాల కంటే బ‌ర్రె పాలు చిక్కగా ఉంటాయి. దీనివ‌ల్ల బ‌ర్రెపాలు అర‌గ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో 10-11 శాతం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇవి ఎక్కువ‌గా వేడి నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉంటాయి. అందుకే న‌వ‌జాత శిశువులు, వృద్ధుల‌కు బ‌ర్రె పాలు తాగించొద్దని చెబుతుంటారు.

fat content 3.5 in milkఆవు పాల‌తో పోలిస్తే బ‌ర్రె పాల‌ల్లో కొలెస్ట్రాల్ త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డేవారు ఆవు పాల‌కు బ‌దులు బ‌ర్రె పాలు తాగ‌డం మంచిది. ఆవుపాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలల్లోనే కేల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి. కేల‌రీల‌తో పాటు ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఒక‌ గ్లాస్ బ‌ర్రె పాల‌ల్లో 237 కేల‌రీలు ఉంటే.. ఒక గ్లాస్ ఆవు పాల‌ల్లో 148 కేల‌రీలు మాత్రమే ఉంటాయి. ఆవు పాలు ప‌సుపు, తెలుపు రంగులో ఉంటాయి. అదే బ‌ర్రె పాలు తెలుపు, క్రీమ్ క‌ల‌ర్‌లో ఉంటాయి. బ‌ర్రె పాలల్లోని బీటాకెరోటిన్ రంగులేని విట‌మిన్ ఏగా మారుతుంది. అందుకే బ‌ర్రె పాల‌ల్లో ప‌సుపు రంగు పోతుంది. ఆవు పాలల్లో కూడా బీటాకెరోటిన్ ఉంటుంది. కానీ త‌క్కువ మోతాదులో మాత్రమే ఉంటుంది.‌

cholestrolబ‌ర్రెపాల‌ల్లో పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఆవుపాల‌తో పోలిస్తే బ‌ర్రె పాలు ఎక్కువ స‌మ‌యం నిల్వ ఉంటాయి. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే ఒక గ్లాసు బ‌ర్రెపాలు తాగ‌డం మంచిదంటున్నారు వైద్యులు. కోవా, పెరుగు, నెయ్యి, ప‌న్నీర్‌, పాయ‌సం వంటివి చేయ‌డానికి బ‌ర్రె పాలు మంచివి. అదే ఆవు పాలల్లో త‌క్కువ క్రీమ్ ఉంటుంది కాబ‌ట్టి స్వీట్ల తయారీకి వీటిని ఉప‌యోగించ‌వచ్చు. ఆవు పాలు, బ‌ర్రె పాల మ‌ధ్య తేడా ఉన్న‌ప్ప‌టికీ ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే. ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఏ పాలు తాగాలి అనేది నిర్ణ‌యించుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR