విఘ్నేశ్వరుడి ఆరాధన ఏ రంగం వారికి ఎలాంటి ఫలితాన్నిస్తుంది?

దేవతలకు ఆదిదేవుడు, గణాలకు అధిపతి మహాగణపతి. విఘ్నాలకు నాయకుడు, విద్యలన్నిటికి గురువు, నాట్యాకారులకు నాట్యాచార్యుడు, కవులకు ఆదికవి, పార్వతీదెవి గారాల బిడ్డ, అమ్మ చేతి పసుపు ముద్ద. అటువంటి గణపతిని పరమభక్తితో పూజించడం వలన జ్ఞానం సిద్ధించి తీరుతుంది. ఎటువంటి విద్యనైనా వినగానే నేర్చుకోగలిగిన ‘ఏకసంధాగ్రహణ’ శక్తి లభిస్తుంది.

Ganapathiగణపతిని గురువుగా భావించి పూజిస్తే, స్వయంగా గణపతి మన మనసులో ఉండి మనకు విద్యలను నేర్పిస్తాడు. బుధగ్రహానికి అధిదేవతగా గణపతిని చెబుతారు. గణపతికి గరిక సమర్పించడం వలన మేధస్సు వృద్ధి చెందుతుంది. ఎలాగూ అన్ని విద్యలకు గురువు కనుక విద్యను ఇట్టే ఇచ్చేస్తాడు.

Ganapathiజ్యోత్సిష్యులకు వాక్కు ప్రధానం. జ్యోతిష్యం సక్రమంగా చెప్పాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. యోగులకు తమ శరీరంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవ్వాలి. గణపతి మూలాధారచక్రంలో ఉంటాడు. మూలాధరానికి అధిష్టాతయై కుండలిని శక్తికి రక్షకుడిగా ఉంటాడు.

Ganapathiవాస్తు శాస్త్రంలో గణపతి వాస్తు పురుషుడు. గణపతిని ఈశాన్యంలో కానీ, లేక మనకు అనుకూలంగా ఉన్న ఏ దిక్కులోనైనా నెలకొల్పి, రోజు ఒక చిన్న బెల్లం ముక్క నైవేధ్యం పెట్టి, దీపారాధన చేస్తే, ఇంట్లో ఉన్న వాస్తు దోషాల పాలిట కాలుడై సర్వదోషాలను హరిస్తాడు. కళాకారులు, నటుల ఎదుగుదలకు కావాల్సింది ప్రజల అభిమానం. అందుకోసం ప్రజలందరిని వశం చేసుకోగలగాలి. ఈ వశీకరణం నిత్యం గణపతిని ఆరాధించేవారికి సహజంగానే ప్రాప్తిస్తుంది.

Ganapathiగణపతి ఆరాధన సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. సినిమారంగంలో ఉన్నవారు, యానిమేషన్ రంగంలో ఉన్నవారికి అవసరమైనది క్రియేటివిటి. గణపతి నిత్యం భక్తితో కలిచేవారికి ఈ క్రియేటివిటి సహజంగానే సిద్ధిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR