విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి రూపంలో యాదవుల ఇంట పెరగటానికి కారణం ఏంటి?

పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం పుష్కరతీర్థంలో యజ్ఞం చేయాలని శ్రీపతితో చెబుతాడు. ఆయన ‘‘శివుడు, నేను అన్ని చూసుకుంటాము. కానివ్వండి’’ అని అంటాడు. వెంటనే ముహూర్తాన్ని నిశ్చయించారు. అందరికీ ఆహ్వానాన్ని పంపించారు. ముహూర్త సమయం దగ్గర పడుతుండడంతో బ్రహ్మ, సావిత్రిని పిలుచుకుని రావల్సిందిగా ఇంద్రునిని పింపిస్తాడు.

Indhruduఇంద్రుడు, సావిత్రి వున్న చోటుకు చేరుకుని, ఆమెకు బ్రహ్మ నిర్వహిస్తున్న యజ్ఞం గురించి వివరిస్తాడు. అప్పుడు ఆమె ‘‘నావాళ్లు ఇంకా ఎవ్వరూ రాలేదు. వారు రాగానే నేను వచ్చేస్తాను’’ అని సమాధానం చెబుతుంది. దాంతో ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్లి, తిరిగి బ్రహ్మ దగ్గరకు చేరుకుని, ఈ విషయం చెబుతాడు.

Bhrmaఅయితే ముహూర్త సమయం దగ్గరపడుతుండడంతో బ్రహ్మ… ‘‘ముహూర్తం సమయం దాటిపోకూడదు. అంతలోపే ఈ శుభకార్యాన్ని ముగించాలంటే ఎవరైనా ఒక కన్యను చూడండి. ఆమెను భార్యగా గ్రహించి సంకల్పాన్ని పూర్తి చేద్దాం’’ అని ఇంద్రునికి ఆజ్ఞాపిస్తాడు. బ్రహ్మ చెప్పిన మాటలు విని ఇంద్రుడు భూలోకానికి వెళ్లి ఒక కన్య కోసం వెదుకటం మొదలుపెడతాడు. అప్పుడు అతను పెరుగు అమ్ముకుంటున్న ఒక కన్యను చూసి, ఆమె చేయిపట్టుకొని బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళతాడు.

Vishnuvuవెంటనే విష్ణువు, రుద్రులు పెద్దలుగా వుండి, గాంధర్వవివాహం జరిపించారు. వివాహం అయిన మరుక్షణమే బ్రహ్మదేవుడు సంకల్పం చేసుకుని, యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. అయితే తమ పిల్లను ఎవరో ఎత్తుకువెళ్లారని విని గొల్లలందరు బ్రహ్మలోకానికి వచ్చి ఏడ్వడం మొదలుపెట్టారు. వీరిని చూసిన విష్ణువు అక్కడికి చేరుకుని, వారితో.. ‘‘మీ అమ్మాయి సాక్షాత్తూ బ్రహ్మదేవుడిని పెళ్లి చేసుకుంది. నేను శ్రీమన్నారాయణుడిని. నేను కృష్ణుడిగా అవతరించినప్పుడు మీ మధ్యనే వుంటాను. మీరు నన్ను దర్శించుకోవడంతో మీ వంశాలు పవిత్రమయ్యాయి’’ అని వారితో చెబుతాడు.

Yadhavuluబ్రహ్మదేవుణ్ణి పెళ్లి చేసుకున్న గాయత్రి గొల్లలందరితో.. ‘‘నేను చాలా సంతోషంగా వున్నాను. నా గురించి విచారించకండి’’ అని చెప్పగానే.. వారందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR