గోరింటాకు చరిత్ర ఏంటి ? దానికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది?

మహిళలది గోరింటాకుది విడదీయరాని అనుబంధం. ప్రతీ పండగ, శుభకార్యాలకు గోరింటాకు పెట్టుకోవడం మన ఆచారంగా వస్తోంది. అలంకారానికే కాదు ఆరోగ్యానికీ గోరింటాకు ఎంతో మేలు చేస్తుంది. అలాంటి విశిష్టమైన గోరింటాకు చరిత్ర ఏంటి ? దానికి అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది? తెలుసుకుందాం.

గోరింటాకు చరిత్రగౌరీదేవి బాల్యంలో తన చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈవింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు.

గౌరీదేవిఅంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతుంది అని అడుగుతుంది. అపుడు పార్వతి చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి.

అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధా కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది. దాంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుందని పలుకుతారు.

పార్వతిఅంతేకాదు రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈచెట్టు జన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటూ ఉంటారు.

గోరింటాకుఅయితే ఆసమయంలో కుంకుమకు ఓ సందేహం కలుగుతుంది. నుదుటన కూడా ‌ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో! నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరి మాతను ఆసందేహం అడగగా… ఈ నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు.

గోరింటాకు చరిత్రఇక గోరింటాకు గర్భాశయదోషాలు తీసేస్తుందనడానికి శాస్త్రపరంగానూ ఆధారాలు ఉన్నాయి. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. గోరింటాకు వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి. చిన్న పిల్లల్లో కూడా శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు గోరింటాకు చక్కగా ఉపయోగపడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR