బ్రహ్మ ముహూర్తం అంటే కచ్చితంగా ఎన్ని గంటలకు?

బ్రహ్మా ముహూర్తం అనే పదం మనం తరుచూ వింటూనే ఉంటాం. పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. దీన్నే బ్రాహ్మీ సమయం అని కూడా అంటారు. అయితే మనం చిన్నప్పటి న్నుండి వింటున్నా ఈ పదానికి సరైన అర్థం, పరమార్థం మాత్రం చాలామందికి తెలియదు. బ్రహ్మా ముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. కరెక్ట్ సమయం మాత్రం చాలామందికి తెలియదు. అసలు బ్రహ్మా ముహూర్తం అంటే ఏంటి ? బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్రలేవాలి? ఎందుకు పూజ చేయాలని చెబుతారు? పిల్లలు చదువుకోవాలని ఎందుకు చెబుతారు ? బ్రహ్మా ముహూర్తానికి ఎందుకంత ప్రాధాన్యత ? ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు సమాధానం తెలుసుకుందాం.

Brahma Muhurtamప్రతీ రోజు సుర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రాహ్మా ముహూర్తం అంటారు. అంటే ఉదాహరణకు ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటలకు అనుకుంటే… అప్పుడు 5.12 నిమిషాల నుంచి 6 వరకు గల సమయాన్ని బ్రహ్మమూహుర్తం అని అంటారు. అంటే రాత్రిభాగంలోని ఆఖరి 48 నిమిషాలను కూడా బ్రహ్మా ముహూర్తంగా చెబుతారు. బ్రహ్మా ముహూర్తం పూజలు, జపాలకు మంత్ర సాధనకు విశిష్టమైన సమయంగా చెబుతారు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఆరోగ్య పరంగాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ సూర్యోదయము చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు, ప్రశాంతంగా ఆరోగ్యంగ ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Brahma Muhurtamబ్రహ్మా ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహయపడుతుంది.ముఖ్యంగా శరీరంలోని ప్రతి కణానికి ప్రాణశక్తినిచ్చేది ఆక్సిజన్‌. ఈ సమయంలో ఆక్సిజన్‌ చాలా స్వచ్ఛంగా, ఎక్కువ మొత్తంలో మనకు లభిస్తుంది. రాత్రంతా చెట్లు వదిలిన ఆక్సిజన్ వేకువ జామున కాలుష్యం బారిన పడకుండా ఎక్కువ పరిమాణం లో మనకు అందుబాటులో ఉంటుంది. వాకింగ్ కు వెళ్లేవారికి ఇది చాలా ఉపయెాగ పడుతుంది.

Brahma Muhurtamవిద్యార్థులు బ్రాహ్మా ముహూర్తం లో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటుందని విశ్వాసం. అలాగే ముందు రోజు భరించిన ఒత్తిడులు అన్ని నిద్రలో మరిచిపోతాం కాబట్టి మెదడు ఉత్తేజంతో ఉంటుంది. పరిసరాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి. ఈ అన్ని కారణాల వల్ల చదివినది మెదడులో జాగ్రత్తగా నిక్షిప్తం అవుతుంది. ఇది నిజం కూడా. పలువురు ఈ విషయమై అనేక సందర్భాలలో తమ స్వీయ అనుభవాలను విజేతలు పంచుకున్నారు.

Brahma Muhurtamఆయుర్వేదం ప్రకారం రాత్రి తోందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆరోగ్య సమస్యలు రావు. గృహిణులకు నిద్ర లేచిన దగ్గర నుంచి ఎన్నో పనులు , పిల్లల సంరక్షణ, ఇంట్లో పెద్దవారి సంరక్షణ , వంట పనులు,ఇంటి పనులతో క్షణం తీరిక లేకూండా గడుపుతారు. అలాంటి వారికి ఒత్తిడి లేని మానసిక ,శారీరక ఆరోగ్యం చాలా అవసరం.

Brahma Muhurtamబ్రహ్మా ముహూర్తంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఉదయాన్నే నిద్రలేస్తే, ఇంటిపనులన్ని ఆందోళన లేకుండా అయిపోతాయి. మన శరీరంలో జీవ గడియారం ఉంటుంది. దీన్ని అనుసరించే మన జీవక్రియలన్నీ జరుగుతాయి. అలాగే ఉదయం మనలో కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ మోతాదులో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమయాన్ని పవిత్రమైన సమయంగా మన పూర్వీకులు పేర్కొన్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR