మూల గౌరీ వ్రతం వెనుక ఉన్న పురాణం కథ ఏంటి ?

ఒకానొక మహారాణి భర్త శ్రేయస్సు, తనయుల శ్రేయస్సు, రాజ్యం శ్రేయస్సు, కోరి మూల గౌరీ నోము పట్టి ఉద్యాపనం చేసుకుంది. అంతలోనే శత్రురాజులు దండెత్తి వచ్చి, రాజునూ, సైనికులనూ, బంధువులనూ, అందరినీ చంపేశారు. అప్పుడా రాణీ యుద్ధ భూమిలో నిలిచి, తనవారి ప్రాణాలను తీసుకుని పోయేందుకు వచ్చిన యమకింకరులను ఉద్దేశించి ఇలా అన్నది.

Gauri Poojaచంపుటకు వచ్చిన శత్రు సైన్యములారా ప్రాణాలు తీసేటి యమదూతలారా

  • మా రాజ్యాన్ని వీడి మరలి వెళ్ళిపొండి.అని వ్రతం ఆరంభించింది.
  • పతి సౌఖ్యము నిలుపుకొనుటకు పసుపు వాయనమిచ్చింది .
  • సౌభాగ్యాలు నిలుపుకొనుటకు సువర్ణ వాయనమిచ్చింది.
  • ఇల్లు వాకిలి నిలుపుకొనుటకు భూములు వాయనమిచ్చింది.
  • తోటలు నిలుపుకొనుటకు తోవు చీర వాయనమిచ్చింది.
  • బిడ్డల సంతతి కోసం – బీరకాయల వాయనమిచ్చింది.
  • చిన్నిమనుమల సౌఖ్యం కోసం – చెరకుగడలు వాయనమిచ్చింది.
  • అల్లుళ్ళ సంతోషం కొరకు – అరిసెలు వాయనమిచ్చింది.
  • కూతుళ్ళ సౌభాగ్యాలకి – కుడుములు వాయనమిచ్చింది .
  • ప్రజల మేలును కోరి – పగడాల వాయనమిచ్చింది.
  • బంధువుల బాగును కోరి – బంతిపూలు వాయనమిచ్చింది.
  • రాజ్య క్షేమాన్ని కోరి – రత్నాలూ వాయనమిచ్చింది.
  • పాడిపంటల అభివృద్ధి కోసం – పాయసం వాయనమిచ్చింది.
  • అందరికన్నా గొప్పతనానికి – అద్దాలు వాయనమిచ్చింది.
  • పేరు ప్రతిష్టా కోసం – పెరుగన్నం వాయనమిచ్చింది.
  • ప్రాణభయాలు రాకుండా – పరమాన్నం వాయనమిచ్చింది.
  • కోరీకలన్నీ తీరేందుకు – కొబ్బరి కాయ వాయనమిచ్చింది.
  • అకాలమరణాలు లేకుండా – అరటి పండ్లు వాయనమిచ్చింది.
  • ఇరుగువారి మేలు కోరి – యిప్పపూలు వాయనమిచ్చింది.
  • పొరుగు వారి మేలు కోరి – పొగడపూలు వాయనమిచ్చింది.
  • పడుచు పిల్లల మేలు కోరి – పావడాలు వాయనమిచ్చింది.
  • ఆనారోగ్యాలు కలక్కుండా – అప్పాలు వాయనమిచ్చింది.
  • శాంతీ సౌఖ్యాల కోసం – చలిమిడి వాయనమిచ్చింది
  • అందరి మేలూ కోరి – అడిగిన వల్లా వాయనమిచ్చింది.
  • ఆదినారాయణుడి దయ కోసం అడగనివి కూడా వాయనమిచ్చింది.

వెంటనే మూల గౌరీ దేవి తన భర్తయైన పరమేశ్వరునితో సహా ప్రత్యక్షమైంది. శివ పార్వతులక్కడే పడివున్న రాణీ వర్గము వారందరినీ పునర్జీవులను చేసి మరునాడు యుద్ధంలో విజయం కలిగేలా ఆశీర్వదించారు. ఆ విధంగానే జరిగి ఆ రాణీ, రాజూ సుఖంగా వున్నారు. ఇది తెలిసినది మొదలు ధనిక పేద బేధాలు లేకుండా అందరు స్త్రీలూ ఈ నోము చేసి తరించసాగారు.

Gauri Poojaప్రతి రోజూ మూల గౌరీని పూజించి కథ చెప్పుకుని, అక్షతలు వేసుకోవాలి. వీలు కలిగినప్పుడల్లా, మనసులో వున్న కోరిక చెప్పుకుని అనువైన వస్తువును అయిదుగురు ముత్తయిదువులకు వాయనమివ్వాలి. అలా అనుకున్న వస్తువులూ, కోరికలూ అయ్యాక ఉద్యాపన చేసుకోవాలి.

Gauri Poojaకడగా అయిదుగురు ముత్తయిదువుల్ని పిలిచి, బొట్లు కాటుక పెట్టి, భోజనం పెట్టి, అంతకుముందు యిచ్చిన అన్నిరకాల వాయనాలనూ రకానికి అయిదు చొప్పున దక్షిణ తాంబూలాలతో వాయన దానమివ్వాలి.

 

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR