విష్ణుమూర్తి ఆదిశేషువు మీద పడుకోడం వెనుక అంతరార్ధం ఏమిటి?

0
227

హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచ సృష్టికర్త. విష్ణుమూర్తి గురించి పురాణ గాధలలో శాంతాకారం భుజగశయనం అని రాసి ఉంటుంది. అంటే శేషనాగుపై విష్ణువు సేదతీరుతుంటాడు. ఇలా కూర్చోవడాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ పాముల రాజైన శేషనాగుపై ఇంత ప్రశాంతంగా విష్ణువు ఎలా కూర్చున్నాడనే అనుమానం వస్తుంది. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు కావడం వల్ల ఆయన ఏదైనా చేయడానికి సాధ్యమవుతుందనే సమాధానం వినిపిస్తుంది.

విష్ణుమూర్తిఅసలు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేదతీరుతారు? పాములకు రాజైన శేషనాగుపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కారణమేంటి? పురాణాలు విష్ణుమూర్తి రెండు ముఖాల గురించి మాట్లాడతాయి. మొదటిది నవ్వుతూ భక్తులను అనుగ్రహించే దేవుడు, రెండో ముఖం భయపెట్టే రూపం. అంటే పాముల రాజైన శేషనాగుపై కూర్చుని ఉన్న రూపం.

విష్ణుమూర్తివిష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేదతీరుతారు. అనేది చాలామందిని ఆశ్చర్యపరిచే విషయం. అయితే ప్రతి మానవుడి జీవితం యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అనేక బాధ్యతలు, పనులతో నిమగ్నమై ఉంటుంది. వాటిలో చాలా వరకు కుటుంబం, సమాజానికి సంబంధించిన బాధ్యతలే ఉంటాయి.

విష్ణుమూర్తిఈ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శేషనాగులా భయపెట్టేవిగా కూడా ఉంటాయి. ఆందోళన కలిగించేవి ఉంటాయి. అలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని శేషనాగుపై సేదతీరే విష్ణు రూపం వివరిస్తుంది.

విష్ణుమూర్తిప్రశాంతమైన ముఖం కలిగిన విష్ణుమూర్తి ఇబ్బందికరమైన సందర్భాల్లో ఓర్పుతో ఉండాలని సూచిస్తుంది. అలాంటప్పుడు సమస్యల ద్వారా విజయం పొందడం సాధ్యమవుతుందని విష్ణుమూర్తి వివరిస్తారు.

 

SHARE