భీష్ముడు బ్రహ్మచారిగా ఉండడం వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి

మహాభారతంలో శంతనుడి భార్య సత్యవతి. కౌరవ, పాండవులకు మహాపితామహురాలు. కౌరవ వంశమాత ఆమె ఒకప్పుడు ఒక సామాన్యపు పల్లె పడతి. దాశరాజు అనే పల్లె పెద్దకు కుమార్తె. ఆమె వంటినుంచి చేపల వాసన వస్తూండడంతో ఆమెకు మత్స్యగంధి అన్న పేరుండేది. చరిత్రలు, పురాణాలంటే మక్కువ చూపే ఔత్సాహికులకు ఈ కథ ఓ బంగారు గని లాంటింది. శంతనుడి సత్యవతిని కలవడానికి ముందే మహాభారత కథకు బీజం పడిందని తెలిపే సంఘటన ఇది. సత్యవతి వంటి నుండి చేపల వాసన రావడంతో సత్యవతిని వివాహం చేసుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.

భీష్ముడుతీవ్ర వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓ నాడు పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరాశర మహర్షి ఓ గొప్ప తపశ్శాలి. పురాణాల్లో మొదటిదైన విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఈయనే. కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించాడు. సత్యవతి శరీరం నుంచి వెలువడే చేపల వాసనకు ఆ ముని తపస్సుకు భంగం వాటిల్లింది. కానీ ఆమె అందాన్ని చూసి చలించిన పరాశర మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు. అలాగే మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని అంటాడు. అయితే తన మూడు కోరికలు నేరవేర్చితేనే దీనికి ఒప్పకుంటానని సత్యవతి అంటుంది.

భీష్ముడుమనం కలిసున్నప్పుడు పంచభూతాలు సైతం తిలకించరాదని కోరుకుంటుంది. దీనికి అంగీకరించిన పరాశర మహర్షి చుట్టూ ఒక కృత్రిమ గుడారాన్ని రూపొందిస్తాడు.దీని వల్ల తన కన్యత్వం చెక్కుచెదరకుండా ఉండాలని సత్యవతి కోరింది. బిడ్డ పుట్టిన తర్వాత తన శక్తులతో కన్వత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని పరాశర హామీ ఇచ్చాడు. తన శరీరం వెదజల్లే చేపల వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంది. దీని నుంచి విముక్తి కలిగించడమే కాదు తొమ్మిది మైళ్ల దూరం వరకు వెదజల్లే సువాసనను శరీరానికి కలిగిస్తానని ప్రమాణం చేశాడు.

భీష్ముడుసత్యవతి షరతులు అంగీకరించడంతో పరాశర మహర్షి కోరిక తీర్చింది. ఈ ఇద్దరి కలయిక వల్ల జన్మించివాడే వేద వ్యాసుడు. కోరినట్లుగానే తిరిగి ఆమెకు కన్యత్వాన్ని ప్రసాదించాడు. ఒక రోజు శంతనుడు గంగా తీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెతుకుంటూ వెళ్లిన అతనికి సత్యవతి ఎదురవుతుంది. ఆమె అందానికి మంత్రముగ్దుడైన శంతనుడు అక్కడే గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడ నుంచే మహాభారతం ప్రథమ అధ్యాయం ప్రారంభమవుతుంది.

భీష్ముడుఅంతకు ముందే దేవవ్రతుడు (భీష్ముడు, గాంగేయుడు) అనే కుమారుని హస్తినాపురం రాజైన శంతనునికి అప్పగించి గంగ అతనిని విడచిపోయింది. సత్యవతిని తనకిచ్చి పెండ్లి చేయమని ఆమె తండ్రి దాశరాజును కోరాడు శంతనుడు. అయితే తన కుమార్తె సంతతికే రాజ్యం కట్టబెట్టేలాగయితేనే రాజుకు తన కుమార్తెనిస్తానని దాశరాజు చెప్పాడు. తండ్రి ద్వారా ఈ సంగతి తెలుసుకున్న దేవవ్రతుడు దాశరాజు దగ్గరికి వెళ్ళి తాను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, తను గాని, తన సంతతిగాని రాజ్యం కోసం సత్యవతి సంతానంతో పోటీ పడే సమస్యే రాదని భీషణంగా ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతిని తనకు మాతృదేవతగా అనుగ్రహించమని అర్ధించాడు. ఆమెను సగౌరవంగా తీసుకెళ్లి వెళ్ళి తండ్రితో వివాహం జరిపించాడు.

భీష్ముడుసత్యవతీ, శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే బిడ్డలు కలిగారు. శంతనుని మరణానంతరం చిత్రాంగదుడు రాజయ్యాడు కాని ఒక గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. తరువాత భీష్ముడు విచిత్రవీర్యుని రాజు చేశాడు. అతనికి కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలనిచ్చి పెండ్లి చేశాడు. కామలాలసుడైన విచిత్రవీర్యుడు కొద్దికాలానికే అనారోగ్యంతో, నిస్సంతుగా మరణించాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR