క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలో తెలుసా ?

కరోనా ప్రభావం ప్రస్తుతం తగ్గినా థర్డ్ వేవ్ ఇంకా ప్రమాదకరంగా ఉండబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యంత వేగంగా విస్త‌రించే ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేశారు. జ‌నాలు కూడా కొవిడ్‌-19 బారిన ప‌డొద్ద‌ని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.. అయినా ఇంకా చాలామందిలో ఏవేవో అనుమానాలు ! టీకా వేయించుకుంటే ఎలాంటి దుష్ప్ర‌భావాలు వస్తాయోన‌నే భ‌యం కొంద‌రిలో ఉంటే.. కొవిడ్‌-19 టీకా తీసుకున్న త‌ర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి ఆహారం తినాలి ? ఏం తిన‌కూడ‌ద‌ని సందేహాలు మ‌రికొంద‌రిలో ఉన్నాయి. ఆ సందేహాలన్నీ ఇప్పుడు దూరం చేసుకుందాం.

క‌రోనా వ్యాక్సిన్వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటీబాడీస్ పెరగాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? ఏమి తినాలి?’ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. యాంటీబాడీస్ కోసం ప్రత్యేకంగా తినాల్సినవంటూ ఏదీ లేదు. అన్నీ తినాలి. తినొచ్చు. అలాగే వ్యాయామాలు చేస్తే పెరుగుతుందని లేదు. కానీ, ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం సాయపడుతుంది.

క‌రోనా వ్యాక్సిన్ఇంకా కొంత మందికి ఇప్పుడు ఉన్న సందేహం వ్యాక్సిన్ తరువాత కరోనా రాదా? వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కొవిడ్ బారినపడితే వ్యాక్సిన్ పనిచేయనట్లు కాదు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న రెండు వారాల తర్వాత ఇమ్యూనిటీ వస్తుంది. ఈ లోగా కరోనా బారినపడొచ్చు. కాబట్టి వ్యాక్సిన్ పనిచేయట్లేదని అనుకోవద్దు. వ్యాక్సిన్ తీసుకుంటే కోవిడ్ రాదని నూటికి నూరు పాళ్లు హామీ ఇవ్వలేము. కానీ, కోవిడ్ బారినపడి హాస్పిటల్లో చేరిన పేషెంట్స్లో వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. వ్యాక్సిన్ కరోనా బారిన పడకుండా కాపాడుతుంది. కొంత మందిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తగినన్ని యాంటీబాడీస్ బాడీలో తయారు కాకపోవడం, తయారైన యాంటీ బాడీస్ ఎక్కువకాలం ఉండకపోవడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్నా కొవిడ్ బారినపడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో 99 శాతం మంది సేఫ్గా ఉన్నారు. ఒకరిద్దరి సంగతి ఆలోచిస్తూ లక్షల మంది సేఫ్గా ఉన్న విషయాన్ని మరచిపోవద్దు.

క‌రోనా వ్యాక్సిన్ఇప్పుడు కోవిడ్ రోగుల లెక్కలను బట్టి చూస్తే వ్యాక్సిన్ చాలామందిని కోవిడ్ బారినపడకుండా కాపాడింది. కోవిడ్ బారినపడి, హాస్పిటల్లో చేరాల్సి వచ్చిన వాళ్లలో 99 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్లే ఉన్నారిప్పుడు. ఒకవేళ కొవిడ్ వచ్చినా ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చేసింది వ్యాక్సిన్. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కోవిడ్ బారిన పడినా తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో తీవ్రమైన సమస్యలు లేవు. తీవ్రమైన జ్వరం, ఆయాసం రావట్లేదు. అంటే వ్యాక్సిన్ లైఫ్ని సేవ్ చేస్తున్నట్లే కదా. సింగిల్ డోస్ తీసుకున్న కోవిడ్ పేషెంట్స్కి 50 శాతం ప్రొటక్షన్, వ్యాక్సిన్ ఉత్పత్తి చేసిన యాంటీ బాడీస్ వల్ల దొరుకుతుంది. డబుల్ డోస్ తీసుకున్న వారికి 99శాతం ప్రొటక్షన్ ఉంటుంది. సింగిల్ డోస్ తీసుకున్న వాళ్లు కూడా కోవిడ్ బారినుంచి 3-–4 రోజుల్లోనే కోలుకున్నారు. కాబట్టి వ్యాక్సిన్ మీద అనుమానాలొద్దు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

క‌రోనా వ్యాక్సిన్ఫస్ట్ డోస్ తీసుకున్నవాళ్లలో 30 శాతం మంది సెకండ్ డోస్కి రావట్లేదు. ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడు జ్వరం, వళ్లు నొప్పులు, తలనొప్పి వస్తున్నాయి. ఈ భయంతో సెకండ్ డోస్కి రావట్లేదు. కరోనా రాకుండా ఇంటిపట్టునే ఉందాం అనుకుంటున్నారు. వృద్ధులు ఇంటి పట్టునే ఉన్నా పిల్లలు అటూ ఇటూ తిరిగి వస్తారు. వాళ్ల ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకోవాలి.

క‌రోనా వ్యాక్సిన్వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంతకాలం వరకు కొవిడ్ బారిన పడరో ఇప్పటికైతే తెలియదు. యాంటీ బాడీస్ ఎంతకాలం బాడీలో ఉంటాయో అప్పటి వరకు కోవిడ్ బారినపడరు. కాకపోతే కరోనా వైరస్, కోవిడ్ వ్యాక్సిన్ ఈ మధ్యనే వచ్చాయి. కాబట్టి వీటిమీద స్టడీ జరగలేదు. తగ్గితే మాత్రం బూస్టర్ డోస్ (మరోసారి వ్యాక్సిన్) తీసుకోవాలి. బూస్టర్ డోస్ అవసరమా? లేదా అనేది తర్వాత పరిశోధనల ఆధారంగా చెబుతారు. ఈ మహమ్మారిని దాటడానికి మాత్రం ఇప్పుడీ వ్యాక్సిన్ సాయపడుతుంది.

క‌రోనా వ్యాక్సిన్ఇదిలా ఉండగా మహిళలు పీరియడ్స్ టైంలో కరోనా టీకా తీసుకోవద్దని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయింది. చాలా మంది ఈ పోస్టును ట్రోల్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో నెలసరి టైంలో వ్యాక్సిన్ తీసుకోకూడదని చాలా మంది భావిస్తున్నారు. నెలసరి టైంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకుంటే పనిచేయదని ఓ పోస్టు చక్కర్లు కొట్టింది.

క‌రోనా వ్యాక్సిన్అయితే ఈ విషయంపై ఇప్పటికే పలువురు వైద్యులు స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. నెలసరికి కరోనా వ్యాక్సిన్ కు ఏ విధమైన సంబంధం ఉండదని స్పష్టం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. నెలసరి టైంలో కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ఫేక్ అని తేల్చి పారేసింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR