Home Unknown facts శ్రీమహావిష్ణువుని హరి అని పిలవడానికి కారణం?

శ్రీమహావిష్ణువుని హరి అని పిలవడానికి కారణం?

0

“ఇందుగలడందులేడని సందేహము వలదు ఏందేందు వెతికినా అందందే గలడు” నా స్వామి అని భక్త ప్రహ్లాదుడు శ్రీహరిని ఉద్దేశించి అన్నాడు. మరి అంతటి శ్రీహరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…

vishnuపురణాల్లో ప్రతి వారంలో ప్రతిరోజూ ఏదోఒక దేవతలకు అంకితం చేసి ఉంది. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం అయ్యప్పకు ఇలా వారంలో ప్రతి రోజూ దేవుళ్ళకు కేటాయించబడింది. అలాగే గురువారం షిర్డీ సాయిని పూజిస్తుంటాం. సాయి బాబాతోపాటు విష్ణువును కూడా పూజిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం విష్ణువును గురువారం ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి.

‘హరి హరతి పాపని’ అంటే ‘హరి’ మన జీవితంలోని అన్ని పాపాలను తీసేస్తాడు. ‘హరి’ అంటే బుజించేవాడు అని అర్థం. హరి అంటే కష్టాలను తొలగించేవాడు. విష్ణువును హృదయపూర్వకంగా కోలిచే భక్తుడికి పాపాలన్నింటినీ తొలగిస్తాడని పురణాలలో చెప్పబడింది. అలాగే ఎంత పెద్ద సమస్యలు ఉన్నా వారికి విముక్తి కలుగుతుంది. అందుకే ఆయనను హరి, శ్రీహరి అని భక్తితో పిలుస్తారు.

పురణాల ప్రకారం పక్షులలో అతి పెద్ద పక్షి గరుడుడు విష్ణువు యొక్క వాహనంగా ప్రతీతి. గరుడుడు విష్ణువును కఠినమైన తపస్సుతో ఆయన దృష్టిని పొందినట్లుగా చెప్పుకుంటారు. గరుడ పక్షి తపస్సుతో సంతోషించిన విష్ణువు అతన్ని తన వాహనంగా ఉండేందుకు అంగీకరించాడు. గురు అంటే భారీ మరియు గరుడ కూడా పక్షులలో బరువైనది. గరుడ అంటే కఠిన విజయాన్ని సాధించునది అని అర్థం. ఈ కారణంగానే గురువారం విష్ణువు ఆరాధన చేస్తారు. కొంతమంది పండితులు కూడా గురు బృహస్పతి విష్ణువు యొక్క రూపం అని నమ్ముతారు. కాబట్టి గురువారం విష్ణువు రోజూగా భావిస్తారు.

క్షీర సముద్రంలో శేషనాగు మీద నిద్రిస్తున్నట్లుగా విష్ణువు ఫోటోలు మనం చూస్తుంటాం. అయితే క్షీర సాగరం అంటే ఆనందం లేదా శ్రేయస్సు మరియు శేషనాగు దుఃఖాన్ని సూచిస్తుంది. విష్ణువు క్షీరసాగరంలో శేషనాగుపై ప్రశాంతంగా పవలిస్తున్నట్లుగా ఉంటాడు. ఆ చిత్రం చూస్తుంటే ఆనందం, మరియు అసంతృప్తి రెండింటిలోనూ ఒకే పద్ధతిలో జీవించాలి అని సూచిస్తుంది. ఈ రూపం అంటే మానవులు ఆనందం మరియు అసంతృప్తి రెండింటిలోనూ ఒకే పద్ధతిలో జీవించాలి అని సూచిస్తుంది.

Exit mobile version