అంగారకుడి పుట్టుక గురించి హిందూ పురాణాల్లో ఉన్న రహస్యం

అంగారకుడు ఉగ్ర స్వభావుడు. గ్రహాల సేనాధిపతిగా అంగారకుడిని పరిగణిస్తారు. సౌరవ్యవస్థలోని గ్రహాలలో నాలుగవ గ్రహమైన అంగారకుడికి కుజుడు అనే పేరు కూడా ఉంది. దీని రంగు కారణంగా ‘అరుణ గ్రహం’ అని కూడా పేరు వచ్చింది. ఈ మంగళ గ్రహం ఎర్రగా ఉండటానికి పురాణాల్లో రకరకాల కారణాలు ఉన్నాయి.

why Mars stays redఅంగారకుడి పుట్టుక గురించి హిందూ పురాణాల్లో మూడు కథలు వాడుకలో ఉన్నాయి. భూదేవికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే అంగారకుడు అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. ఒకసారి, నేల మీద పడ్డ విష్ణువు యొక్క చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుట్టాడు. అతను తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఒక గ్రహంగా మారాడు. ఆ గ్రహమే ‘కుజ గ్రహం’ అని పద్మ పురాణం చెబుతుంది.

అంగారకుడుస్కందపురణాంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుంచి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురడనే రాక్షసుడికి శివుడు వరం ఇచ్చాడు. అనంతరం భక్తుల బాధలను తీర్చేందుకు మహేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో పోరాడారు. ఇద్దరి మధ్య భీకర యుద్దం జరిగింది. ఈ రణంలో శివుడు చెమట ధారలుగా ప్రవహించింది. చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. భూదేవి అతన్ని తన సొంత కొడుకుఁగా చేరదీసిందనీ, అతనే కుజుడని మరో కథ కూడా నానుడిలో ఉంది.

Lord Shivaఎట్టకేటలకు శివుడు.. అసురుడిని సంహరించి కొత్తగా సృష్టించిన అంగారకుడు రాక్షసుడు రక్తపు చుక్కలను గ్రహించాడు. అందుకే అంగారక భూమిని ఎరుపు రంగులో ఉందని అంటారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR