కుంభ కర్ణుడు అంతలా నిద్ర పోవడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది?

ఎవరైనా ఎక్కువసేపు నిద్రపోయినా లేకపోతే, ఎంత లేపినా నిద్ర లేవకపోతే కుంభ కర్ణుడిలా నిద్ర పోతున్నావు అంటారు. ఎందుకంటే కుంభ కర్ణుడు ఏడాదిలో ఆరు నెలలు నిద్రలో ఉంటాడు. ఒకరోజు లేచి ఆరు నెలలకు సరిపోయేంత ఆహరం తీసుకోని మళ్ళీ ఆరు నెలలు నిద్ర పోతాడు. అసలు కుంభ కర్ణుడు అంతలా నిద్రపోవటానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

Kumbhakarnaకైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు. రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ అలా పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు. అప్పుడు తనకు మరణం లేకుండా వరం ప్రసాదించమంటాడు.

Brahmaఅలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ. మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు. అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు.

Ravanaవిభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు.

Vibhishanaకుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే- అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు. సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిద్దుర కావాలంటాడు కుంభకర్ణుడు. తథాస్తు అంటాడు కమలాసనుడు.

Kumbhakarnaముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు. లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు. కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు. కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR