పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో తలపై స్వస్తిక్‌ చిహ్నం ఎందుకు వేస్తారు?

స్వస్తిక్‌ చిహ్నం శుభప్రదం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం ఉంది.

swastika symbolవిఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కాబట్టి, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట.

swastika symbolదీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలని ఇలా చేస్తారు. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన. అయితే చోడకర్మ (పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం) సంస్కారం చేసే సమయంలో కూడా శిశువు తలపై స్వస్తిక్ గుర్తు పెడతారు.

swastika symbolశిశువు పుట్టిన సంవత్సరకాలం తరువాత శిశువుకు తలనీలాలు తీయడం జరుగుతుంది. ఆరవ నెల అన్నప్రసమైన అనేక రోజులకు ఈ తలవెంట్రుకలు తీసే కార్యాన్ని చేస్తారు. వెంట్రుకలు తీసిన అనంతరం వెన్న లేక చిలికిన పెరుగును శిశువు సున్నితమైన గుండుపై రాయడం జరుగుతుంది. ఆ తరువాత శిశువు తండ్రి శిశివు తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తును రాసి నుదుటిపైన బొట్టు పెడుతారు.

swastika symbolస్వస్తిక్ గుర్తు భగవంతుడి తలంపేశిశివు తలంపవుగాక అనే అర్థాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. కాసేపు తరువాత స్వస్తిక్ గుర్తున్న గుండుపై అంతటా గంధలేపనాన్ని రాయడం జరుగుతుంది. ఈ కార్యాన్ని చోడకర్మ సంస్కారం అని అంటారు. గంథంలో ఔషధీయ గుణాలు ఉంటాయి. గంథలేపనం మెదడును చల్లబరచడమే కాక బుద్దిని వికసింపజేస్తుంది. తల్లిదండ్రులు మరియు ఈ కార్యానికి వచ్చిన వారు శిశివును దీవించి, దీర్ఘయువును ప్రసాదించుమని భగవంతుడిని ప్రార్థిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR