బోనాల పండుగలో పోతురాజుల ప్రత్యేకత ఏమిటి ?

వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం.
బోనాలు సమర్పించే సంస్కృతి తెలంగాణలో ఎప్పటినుంచో ఉంది. అయితే.. హైదరాబాద్‌‌లో 18వ శతాబ్దం నుంచి దీన్ని పెద్ద ఉత్సవంగా సామూహికంగా చేస్తున్నారు.

Pothurajuఆషాఢ మాసంలో తెలంగాణలోని చాలా గ్రామాల్లో బోనాల పండుగ చేసుకుంటారు. అంటే గ్రామదేవతలు అమ్మవార్లను పూజించి, వాళ్లకు ఇష్టమైన భోజనాన్ని నైవేద్యంగా పెడతారు. అంటే ఇది అమ్మవారికి భోజనం పెట్టే పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. కొత్త కుండలో అన్నం వండి, అమ్మవారికి భక్తితో సమర్పిస్తారు. బోనంలో అన్నంతోపాటు పాలు,పెరుగు, బెల్లం ఉంటాయి. బోనం కుండలను వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యప్పిండి ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. దానిపై ఒక దీపం కూడా పెడతారు.

Pothurajuబోనాల పండుగలో పోతురాజు ప్రత్యేకం. పోతురాజు లేకుండా ఏ కొలుపు, ఏ జాతర, ఏ తిరునాళ్లు, ఏ బోనాలు జరగవు. అంత ముఖ్యమైనవాడు ఈ పోతురాజు. మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ,ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతురాజు.

Pothurajuగ్రామదేవత ఉత్సవాలలో పూనకంతో వున్న పోతరాజు తన దంతాలతో మేక పోతును కొరికి, తలను మోండెం నుండి వేరుచేసి పైకి ఎగురవేస్తాడు, గ్రామ దేవతల ఊరేగింపులో పోతురాజు విగ్రహం ముందుంటుంది. ఈ ఊరేగింపులో కొందరు పురుషులు పోతు రాజు వేషం ధరించి ఆడుతారు. అలాగే పురాణ సంబంధిత నాటకాలు వేసే టప్పుడు ముందుగా పోతురాజు విగ్రహాన్ని పెట్టి నాటకము ఆడుతారు.

Pothurajuపోతురాజు గ్రామదేవతకు సోదరుడు. పోతురాజుకు సంబందించిన ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. ప్రతి అమ్మవారి గుడి బయట పోతురాజు విగ్రహం పెట్టడం గానీ, పెయింట్ తో వేయటం గానీ చేస్తారు. బోనాల జాతర సందర్భంగా పోతురాజు వంటినిండా పసుపు/కుంకుమ, పెయింట్ వేసుకుని భయంకరాకారంతో కనిపిస్తుంటారు. కళ్ళకు పెద్ద గజ్జెలు, శరీరంపై గంటలు, వేపాకులు ధరించి నుదిటిపై పెద్ద బొట్టుతో, చేతిలో కొరడాతో భీతావహంగా ఉంటారు. పోతురాజు ఎప్పుడూ ఫలహారం బండికి ముందు నడుస్తాడు. అతన్ని జాతరకు మొదటివాడిగా, రక్షకుడిగా పరిగణిస్తారు. అతను డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. ఊరేగింపు సందర్భంగా మైకంతో శిగం ఊగే వారిని అతనే నడిపిస్తాడు.

Pothurajuపోతురాజు చేతిలో కొరడాను ఈరకోల అంటారు. పోతురాజులు ఎవరి మెడలోనైనా ఈరకోల వేస్తే మంచి జరుగుతుందని, కొడితే వ్యాధులు తగ్గుతాయనీ, మానసిక భయాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే అందరూ పోతురాజుకు మొక్కుతారు. ఓం నమ: శివాయ అంటూ డప్పు కొట్టేప్పుడు పోతురాజులు ప్రత్యేకమైన భక్తితో కూడిన తాండవం/నృత్యం చేస్తారు. ఆ సమయంలో ఎవరూ పోతురాజుకు ఎదురు వెళ్ళరు. పోతురాజులలో చాలా మంది ఉపవాసం చేస్తారు. జాతర సుదీర్ఘ సమయం సాగుతుంది కాబట్టి శక్తి కోసం కొంతమంది గ్లూకోస్ నీళ్లు తీసుకుంటారు. కొన్ని ప్రాంతాలలో ఆచారం కానప్పటికీ ఆల్కహాల్ ను కూడా తీసుకుంటున్నారు.

Pothurajuఉగ్ర రూపంలో ఉండే అమ్మవారు రక్తాన్ని చూసి శాంత పడతారనే నమ్మకం కూడా ఉంది. అందుకే పోతురాజులు నోటితో కోడి, లేదా మేకను కొరుకుతారు. దీనినే గావు పట్టడం అంటారు. పోతురాజు నోటిలో రక్తం చూస్తే అమ్మవారు శాంతిస్తుంది. అమ్మవారికి పోతురాజు మేకను గావు పట్టడం చాలా ఇష్టమని పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం. ఇవి ఇష్టంలేని ప్రాంతాలలో గుమ్మడికాయ, నిమ్మకాయలతో కూడా గావు పట్టే ఆచారాలు ఉన్నాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR