Home Unknown facts క్రిస్మస్ సందర్భంగా ముల్డ్ వైన్ తాగడం వెనుక ఉన్న సంప్రదాయం ఏంటి ?

క్రిస్మస్ సందర్భంగా ముల్డ్ వైన్ తాగడం వెనుక ఉన్న సంప్రదాయం ఏంటి ?

0

క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే చాలు పది రోజుల ముందు నుండే సెలెబ్రేషన్స్ మొదలైపోతుంటాయి. క్రిస్మస్ ట్రీ, కేకులు, శాంటా క్లాజ్, క్రిస్మస్ కరోల్స్‌తో సందడిగా కనిపిస్తుంటుంది. అయితే వీటితో పాటు ముల్డ్‌ వైన్ ఉంటేనే పండుగ సంపూర్ణంగా ఉంటుందని క్రిస్టియన్లు భావిస్తారు. క్రిస్మస్ సందర్భంగా ముల్డ్ వైన్ తాగడం ఒక పురాతన సంప్రదాయంగా వస్తోంది.

Christmasముల్డ్ వైన్ నే మసాలా వైన్ అని కూడా పిలుస్తారు. దీన్ని రెడ్ వైన్‌తో తయారు చేస్తారు. చక్కెర, లవంగాలు, దాల్చినచెక్క, ఎండుద్రాక్ష వంటి సుగంధ ద్రవ్యాలతో రుచిగా, వేడిగా అతిథులకు అందిస్తారు. ముల్డ్ వైన్ మూలాలు రోమన్ల కాలం నుంచి ఉన్నాయి. చలికి తట్టుకోవడానికి రోమన్లు శీతాకాలంలో వైన్ తాగేవారు.

రెండో శతాబ్ధం నుండే అక్కడి వారికి వైన్ తాగే అలవాటు ఉంది. క్రమంగా దాంట్లో సుగంధ ద్రవ్యాలు వేసి తాజా సువాసనలు వెదజల్లే కొత్త రకం వైన్‌ను తయారు చేశారు. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండేదట. శీతాకాలంలో వచ్చే క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద మొత్తంలో దీన్ని తయారు చేసేవారు. క్రమంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వైన్ తాగడం ఒక సంప్రదాయంగా మారింది. ఈ డ్రింక్ బ్రిటిష్ వారి ద్వారా భారత్‌కు వ్యాపించింది. మన దేశంలో ముల్డ్ వైన్ క్రిస్మస్ లో ఒక భాగంగా కొనసాగుతోంది. ఇప్పుడు మనదేశంలో కూడా క్రిస్మస్ రోజున ముల్డ్ వైన్ తాగడం సాంప్రదాయంగా మారింది. మరి ఈ ముల్డ్ వైన్ లేదా మసాలా వైన్ ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

మందు ఒక బాటిల్ రెడ్ వైన్, రెండు నారింజ పండ్లు, ఒక నిమ్మకాయ, 60 గ్రాముల చక్కెర, ఐదు లవంగాలు, దాల్చిన చెక్క, మూడు తాజా బిర్యాని ఆకులు, ఒక చెంచా వెనీలా క్రీమ్ తీసుకోవాలి. రెడ్ వైన్‌లో చక్కెర వేసి మీడియం ఫ్లేమ్‌పై వేడి చేయాలి. దానికి లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యాని ఆకులు, నారింజ పండ్ల తొక్క, నిమ్మ తొక్క, వెనీలా క్రీమ్ వేసి బాగా కలపాలి.

వైన్‌కు సుగంధ ద్రవ్యాల ఫ్లేవర్ రావడానికి 15 నిమిషాల పాటు తక్కువ మంటపై వేడి చేయాలి. బాగా వేడిచేస్తే వైన్‌లో ఉండే ఆల్కహాల్ ఆవిరైపోతుంది కాబట్టి మిశ్రమాన్ని ఎక్కువసేపు ఉడికించవద్దు. ఆ తరువాత ముల్డ్ వైన్‌ను వడకట్టి, వేడి వేడిగా తీసుకోవచ్చు.

 

Exit mobile version