Home Unknown facts ఉనకోటి అంటే ఏమిటి ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది ?

ఉనకోటి అంటే ఏమిటి ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది ?

0

ఉనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అని అర్ధం. పురాణకధ ప్రకారమే ఈ పేరొచ్చింది.అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కొండకే చెక్కిన వేలాది విగ్రహాలు భలే కనువిందు చేస్తాయి. వీటిల్లో పదడుగుల రూపాల్నుంచి 50 అడుగుల ఎత్తైన ఆకారాల వరకు వున్నాయి.మనం పూజించే దుర్గ, పార్వతి, భైరవుడు,దేవతల వాహనాలైన సింహం, నంది,పులి ఇలా ఇక్కడున్న ప్రతీ కొండ విగ్రహాలతో నిండి అబ్బురపరుస్తుంది.ఈ విగ్రహాలపై పరిశోధనలు చేస్తే ఇవి 7 నుంచి 12 వ శతాబ్దంలో చెక్కినవని తెలుస్తుంది.కోటి దేవతలు కొలువుతీరిన కొండ ఇది.

Unakotiఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా ఏ కొండపైన చూసినా మీకు శిల్పాలే దర్శనమిస్తాయి. చిన్నరాయిని, రాప్పని కూడా వదలలేదు. ప్రతీదాని పైన శిల్పాలు చెక్కబడే వుంటాయి. ఈ శిల్పాలపై రీసెర్చ్ జరిగిన తర్వాత అవి మొత్తంగా ఒకటి తక్కువ కోటివరకు వున్నాయంట.అందుకే ఈ ప్రాంతాని ఉనకోటి అంటారు. ఉనకోటి అంటే అక్కడి భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం. ఈ ప్రాంతం మన భారతదేశంలోని త్రిపురలోని అగర్తకు 170కి.మీ ల దూరంలో అటవీప్రాంతంలో వుంది. ఈ కొండపైన వున్న విగ్రహాలకి, అక్కడ వుండే శివుని విగ్రహానికి చాలామంది వచ్చి పూజలు చేస్తూ ఉంటారు.

ఆ ప్రాంతంలో వినాయకుని విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా వుంటుంది. వర్షాకాలంలో కొండలపైనుంచి వచ్చే నీరు ఆ విగ్రహాలపై నుంచి కిందకు పడుతూవుంటాయి.అలాగే ఒక కొండరాతిపైనయితే పెద్ద దేవి విగ్రహం వుంటుంది. ఇది ఎంత దూరం నుంచి చూసినా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొండలపైన జంతువుల యొక్క విగ్రహాలు ఇలా చాలా మీకు దర్శనమిస్తూవుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఈ ప్రదేశానికొచ్చి ఇక్కడ విగ్రహాలన్నీ చూసి తరించి పూజలు చేసి వెళ్తుంటారు.

చాలా ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి కొన్ని కథలు, పురాణగాథలు ఉన్నట్లే ఈ ప్రాంతానికి కూడా వున్నాయి. పూర్వకాలంలో ఇక్కడ కల్లుకుమార్ అనే ఒక ప్రఖ్యాత శిల్పకారుడుండేవాడంట.అతడు ఎంతో శివభక్తుడు. కైలాసానికి వెళ్లి శివుడిని,పార్వతిని కళ్ళారా చూసి తరించాలని ఎంతో ఆశపడ్డాడట.

ఒకరోజు తనకి శివపార్వతులు తన కలలో కన్పించగా తన కోరికను ఆ దేవతలకి కల్లుకుమార్ తెలియచేసాడంట.దానితో పార్వతీదేవి అతనికి ఒక షరతు పెట్టింది.రేపు ఉదయం తెల్లారేటప్పటికంతా వూరి చివర కొండపైన నువ్వు కోటి శిల్పాలని గానీ చెక్కినట్లయితే తమతోపాటు తనని కూడా కైలాసానికి తీసుకువెళ్తానని ఆ పార్వతీ దేవి కల్లుకుమార్ కి షరతు విధించిందంట.

దానికి వెంటనే ఒప్పుకుని కల్లుకుమార్ ఆ కొండపైన వున్న ప్రతీ రాతి పైన ఆ రోజంతా చేక్కుతునే ఉన్నాడంట. తీరా సూర్యోదయమవుతున్నప్పటి కల్లా ఒకటి తక్కువ కోటి శిల్పాలను చెక్కాడంట. కానీ ఆఖరి శిల్పం చెక్కుతున్నప్పుడు అతనికి నేనిన్ని శిల్పాలను చెక్కాను నీనెంతో గొప్ప అనే అహంకారమొచ్చి అక్కడ దేవతా శిల్పాలకు బదులుగా తన ఆకృతిని పోలివుండే శిల్పాన్ని చెక్కుతుండగా,పార్వతీదేవి విధించిన షరతును మితిమీరడంతో అతని నిబంధన కాస్త పోయి పార్వతీపరమేశ్వరులు అతనికి కనిపించకుండా కైలాసానికి వెళ్ళిపోయారట.

మరో కథనం ప్రకారం… ఒక సారి శివుడు కోటిదేవతలను వెంటబెట్టుకుని కాశీకి ప్రయాణమయ్యాడు. మధ్యలో చీకటి పడగానే దేవతలంతా ఒకచోట పడుకున్నారు. మర్నాడు సూర్యోదయానికి ముందే అందరూ నిద్రలేవాలని శివుడు ఆజ్ఞాపించాడు. కానీ ఉదయాన్నే చూసేసరికి తనొక్కడూ తప్ప ఎవరూ నిద్రలేవకపోవడంతో శంకరుడికి కోపం వచ్చి వెంటనే మీరంతా శిలలుగా మారిపోండి అని శపించాడు. అలా ఒకరు తక్కువ కోటిమంది విగ్రహాలుగా మారిపోయారు.

 

Exit mobile version